
ఓ మోడల్ తన పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే కేక్ కట్ చేయడం విమర్శలకు దారి తీసింది.ఎందుకంటారా?
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాలభైరవ దేవాలయం ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా దేవాలయానికి మోడల్ మమతా రాయ్ వచ్చింది. అయితే, దైవదర్శనం అనంతరం తన వెంట తెచ్చుకున్న బర్త్‌డే కేకును కాలభైరవ విగ్రహం ఎదుట కట్ చేసి తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంది.
శక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలభైరవ ఎదుట మమతా రాయ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవిత్రమైన దేవాయంలో ఆమె కేక్ కట్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పుట్టిన రోజు దైవదర్శనం చేసుకోవడం మంచిదే. ఇలా కేక్ కట్ చేయమని ఎవరు? చెప్పారని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, వారణాసిలోని కాశీ విద్వాత్ పరిషత్ అనే సంస్థ దేవాలయంలో జరిగిన ఘటనపై ఆగ్రహం చేసింది. మమతారాయ్ బర్త్‌డే కేక్ కట్ చేస్తున్నా ఆలయ నిర్వహాకులు స్పందించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది.
चंद पैसों के लिए पंडा-पुजारियों ने हमारे आस्था के केंद्रों को मजाक बना रखा है, आप भी जेब ढीली करिये और गर्भगृह में बर्थडे व एनिवर्सरी सेलिब्रेट कर सकते हैं, काल भैरव मन्दिर में केक काटने का है ये वीडियो #varanasi pic.twitter.com/joznhamSrF
— Dr Raghawendra Mishra (@RaghwendraMedia) November 29, 2024