ఇప్పటి వరకు ఫ్యాన్ మాదిరిగా నేరుగా కరెంట్ కనెక్షన్‌తో పనిచేసే ఎయిర్ ప్యూరిఫైయర్స్‌నే చూశాం. ఇప్పుడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఎయిర్ ప్యూరిఫైయర్ అందుబాటులోకి వచ్చింది. ఇది మూడంచెల్లో గాలిని శుభ్రపరుస్తుంది.
అమెరికన్ కంపెనీ ‘డ్రియో’ ఈ మ్యాక్రో ప్రో బ్యాటరీ పవర్డ్ ఎయిర్ పూరిఫైయర్‌ను ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది గాలిలోని కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మ కణాలను, ప్రమాదకరమైన సూక్ష్మజీవులను తొలగిస్తుంది. గాలిలో వ్యాపించే వాసనలను తొలగిస్తుంది.
దీనిని స్థూపాకారంలో నిర్మించడం వల్ల 360 డిగ్రీల్లో పనిచేస్తూ, గదిలోని అన్ని దిశల్లోనూ గాలిని సమానంగా శుభ్రపరుస్తుంది. ఇందులోని హెచ్13 హెపా ఫిల్టర్లు గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ కణాలను కూడా సమర్థంగా క్షణాల్లో పీల్చేసుకుంటాయి. ఇది 680 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గదికి చక్కగా సరిపోతుంది. దీని ధర 109.99 డాలర్లు (రూ.9,156) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment