సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కాలంలో ఇన్‌స్టా, ట్విటర్, టిక్‌టాక్‌లు సోషల్ మీడియాను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి. ఇప్పుడు సోషల్ మీడియా కాదు ఏకంగా వర్చువల్ యూనివర్స్‌గా మెటావర్స్ తెస్తానంటున్నాడు మార్క్ జూకర్‌బర్గ్. దాదాపు ఏడాది కాలంగా మెటావర్స్ గురించి వింటున్నా చాలా మందికి ఇంకా అది కొరుకుడు పడని విషయంగానే ఉంది. దీన్ని గమనించిన జూకర్‌బర్గ్ మెటావర్స్ ఎక్సీపీరియన్స్ మరింత చేరువ చేసే పనిలో పడ్డారు.
మెటావర్స్ ఎక్స్‌పీరియన్స్ పొందాలంటే ప్రత్యేకమైన గ్యాడ్జెట్స్ అవసరం. లేటెస్ట్ సెన్సార్ల ఆధారంగా పని చేసే ఈ గ్యాడ్జెట్స్ ఉన్నప్పుడే మెటావర్స్ అనుభూతిని ‘ఫీల్’ అవగలం లేదంటూ వర్చువల్ రియాలిటీ, యానిమేషన్ వీడియోలకు మరో రూపం మెటావర్స్ అన్నట్టుగా ఉంటుంది. దీంతో మెటావర్స్ ఫీల్‌కు ఉపయోగపడే గ్యాడ్జెట్స్‌తో మెటాస్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.
కాలిఫోర్నియాలో బర్లింగేమ్ క్యాంపస్‌లో తొలి మెటాస్టోర్‌ని 2022 మే 9న ప్రారంభించబోతున్నారు. అదే విధంగా ఆన్‌లైన్ పోర్టల్ మెటాడాట్‌కామ్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో దొరికే గ్యాడ్జెట్స్‌ని కొనుగోలు చేసి ఉపయోగించిన తర్వాతే మెటావర్స్ మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మెటా గ్యాడ్జెట్స్ ఎంత ధరలో లభిస్తున్నాయనే అంశంపై ఇంకా పూర్తి వివరాలు జూకర్‌బర్గ్ రిలీజ్ చేయలేదు.
చదవండి: యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment