
గాల్లో ఎగిరే వస్తువులను చూసి చాలా ఆనందపడతారు పిల్లలు. ఇక ఆ ఎగిరే వస్తువు వాళ్లు చెప్పినట్లు ఎగిరితే ఇక ఆ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఆ పని చేస్తుంది ఈ ‘స్కూట్ డ్రోన్’. చేతి సైగలతో కోరుకున్న రీతిలో ఈ డ్రోన్‌ను ఎగురవేస్తూ ఆటలాడుకోవచ్చు. ఎగిరేటప్పుడు పల్టీలు కొట్టడం వంటి విన్యాసాలు కూడా చేస్తుంది.
ఆరుబయటి మైదానాల్లోనే కాకుండా, జనావాసాల్లో కూడా దీనిని సురక్షితంగా ఎగరేయవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని సెన్సర్లు ఎదురుగా ఉన్న అవరోధాలను గుర్తించగలవు. కాబట్టి, ఎలాంటి ప్రదేశాల్లోనైనా ఈ డ్రోన్‌ను ఎగరేస్తూ ఆటలాడుకోవచ్చు. ధర రూ. 4,569. వివిధ రంగుల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.