ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ పిల్లల కోసం అమృత్ బాల్ పేరిట ఓ కొత్త పాలసీని పరిచయం చేసింది. పిల్లల ఉన్నత విద్య, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్‌ఐసీ అధికారికంగా వెల్లడించింది.
ఈ పాలసీ మెచ్యూరిటీ కనీస వయస్సు 18 ఏండ్లు. గరిష్ఠం 25 సంవత్సరాలు. షార్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్ 5, 6 లేదా 7 ఏండ్లు. కనీస పాలసీ టర్మ్ కోసం లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ 10 ఏండ్లు చెల్లించాలి.
ఇక సింగిల్ ప్రీమియం పేమెంట్ కోసం 5 ఏండ్లు. మినిమం సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు. గరిష్ఠ బేసిక్ సమ్ అష్యూర్డ్ కోసం పరిమితి లేదు. షరతులకు లోబడి పాలసీ వ్యవధిలో రుణ సదుపాయం లభిస్తుంది.
హై బేసిక్ సమ్ అష్యూర్డ్, ఆన్‌లైన్ సేల్ కింద పూర్తయిన ప్రతిపాదనకు రిబేటు. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందేందుకు 5, 10 లేదా 15 ఏండ్ల వాయిదాల్లో సెటిల్మెంట్ ఆప్షన్లు. మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్‌లపై పాలసీ వ్యవధిలో గ్యారంటీడ్ అడిషన్స్ ఉంటాయి. పూర్తి సమాచారం కోసం ఎల్‌ఐసీ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment