Washing clothes
-
తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే..
వాషింగ్టన్: అమెరికాలో ఒకే నెలలో ఒకే తరహా మరణాలు రెండు చోటుచేసుకున్నాయి. ఇదే నెలలో తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి మూడేళ్ళ తన చిట్టి చెల్లిని చేజేతులా చంపుకున్నాడు ఓ బుడతడు. ఆ సంఘటన ఇంకా మరువక ముందే అచ్చంగా అలాగే తన తుపాకీని తుడుచుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి తన భార్యను హతమార్చాడు మరో అభాగ్యుడు. వెంటనే అచేతన స్థితికి వెళ్ళిపోయిన అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత తాను ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో అర్ధం చేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. చికాగోకు చెందిన సిమియోన్ హెన్డ్రిక్సన్(61) తుపాకులు కాల్చడంలో శిక్షణనిస్తూ ఉంటాడు. జులై 15న తీరిక దొరికడంతో ఇంటిలోని తుపాకులను శుభ్రం చేసే పనికి ఉపక్రమించాడు. కానీ దురదృష్టవశాతూ ఒక తుపాకి తన చేతిలోనే పేలిపోయింది. ఆ తుపాకీ లోంచి వెళ్లిన బుల్లెట్ అక్కడే ఉన్న అతని భార్య లారీ హెన్డ్రిక్సన్(60) తలకు తగలడంతో ఆమె ఉన్నచోటనే కుప్పకూలింది. విభ్రాంతికి గురైన సిమియోన్ కొద్దీ సేపటికి తేరుకుని జరిగిన దారుణాన్ని తలచుకుని కుమిలిపోయి తుపాకిని తనవైపు ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. తుపాకీ పేలుళ్ల చప్పుడుకి చుట్టుపక్కలవారు సమాచారమిచ్చారో లేక స్వయంగా సిమియోనే చెప్పాడో స్పష్టత లేదని చెప్పిన పోలీసులు విషయం తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. సిమియోన్ అక్కడికక్కడే చనిపోగా అతని భార్య లారీ మాత్రం కోన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు చికాగో పోలీసులు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవంతో వారి ఒక్కగానొక్క కుమారుడు డెరెక్ హెన్డ్రిక్సన్ శోకతప్త హృదయంతో పేస్ బుక్ లో విచారాన్ని వ్యక్తం చేస్తూ.. "వారిని అందరూ ఎంతగానో ప్రేమించి, అభిమానించేవారు. వారు ఎప్పటికీ గొప్ప తల్లిదండ్రులుగా మిగిలిపోతారు." అని రాశాడు. ఇది కూడా చదవండి: కంపెనీ డబ్బులు రూ.21 లక్షలు కొట్టేసి ఏం చేశాడో తెలుసా? -
భారత్‌లో తొలిసారి, కొత్త వాషింగ్ మెషీన్ వచ్చిందోచ్.. నోటితో చెప్తే ఉతికేస్తుంది!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో బోలెడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన డివైజ్‌లు, మిషీన్లు మరో ఏడాదికల్లా అదనపు ఫీచర్లతో కస్టమర్లను పలకరిస్తున్నాయి. తాజాగా టచ్ ప్యానెల్, వాయిస్ కంట్రోల్‌తో ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్ (Washing Machine) మార్కెట్లోకి వచ్చేసింది. ఈ తరహా టెక్నాలజీతో రావడం భారత్‌లో ఇదే తొలిసారి. ఈ వాషింగ్ మెషీన్‌ను హోమ్ అప్లయెన్సెస్, కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్ సంస్థ హయర్(Haier) విడుదల చేసింది. ప్రత్యేకంగా ఇందులో ఏఐ డైనమిక్ బ్యాలన్స్ సిస్టమ్, ఇన్‌బిల్ట్ వాయిస్ కంట్రోల్, డైరెక్ట్ మోషన్ మోటర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంది. డైరెక్ట మోషన్ మోటార్ అదిరిపోయే ఫీచర్లు కొత్త వాషింగ్ మెషీన్లో ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్ మోషన్ మోటార్ ఉంది. ఇది గణనీయంగా మెషిన్ వైబ్రేషన్‌ని తగ్గిస్తుంది, తద్వారా మిషన్ సౌండ్ లేకుండా పని చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫీచర్ మెషీన్ లైఫ్టైంను కూడా పెంచుతుంది. ఇందులో 30పైగా వాషింగ్ ప్రోగ్రామ్‌లతో డిజైన్ చేయబడింది. పాటు వివిధ రకాల బట్టలను సునాయాసంగా వాష్ చేసేస్తుంది. అదనంగా హై-ఎఫిషియన్సీ ABT (యాంటీ బాక్టీరియల్ టెక్నాలజీ) ఉంది. ఇందులోని డిటర్జెంట్ డిస్పెన్సర్‌ను శుభ్రంగా ఉంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ డ్యూయల్ స్ప్రే టెక్నాలజీ, బ్యాక్టీరియా, అలెర్జీ కారకాలను సమర్థవంతంగా తొలగించే పూరిస్టీమ్ ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా కస్టమర్లు ఇంట్లో ఎక్కడ నుంచైనా ఇచ్చే ఆదేశాలతో ఈ వాషింగ్ మెషీన్‌ను కంట్రోల్ చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మార్కెట్లో 10కేజీల దీని ధర రూ.96వేల వరకు ఉంది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
Munni Devi: ఇస్త్రీ చేసే మున్ని ఎంఎల్‌సి అయ్యింది
బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి జీవించే 40 ఏళ్ళ మున్నీ రజక్ ఎం.ఎల్.సి. అయ్యింది. అందుకు కారణం ఆమె గట్టిగా మాట్లాడగలగడం. పెద్దగా అరవగలగడం. లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొనే ర్యాలీల్లో ఆమె గొంతు చించుకుని నినాదాలు చేస్తుంది. ధర్నాల్లో ముందు వరుసలో కూచుని టీవీలకు బైట్లు ఇస్తుంది. ఎన్డిఏ గవర్నమెంట్‌ను విమర్శిస్తూ ధైర్యంగా పాటలు పాడుతుంది. ఇవన్నీ ఆర్.జె.డి నేత లాలూను మెప్పించాయి. ఆమెను నిజమైన కార్యకర్తగా గుర్తించి తమ పార్టీ తరఫున ఎం.ఎల్.సి.ని చేశాడు. 75 మంది సభ్యుల విధాన పరిషత్‌లో కూచోబోతున్న మున్నీ రాజకీయాల మురికిని కూడా వదలగొడతానంటోంది. కొన్ని ఘటనలు కొందరి మేలుకు జరుగుతాయి. 2019. జుడీషియల్ కస్టడీలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. బయటంతా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు. రాంచీకి 300 కిలోమీటర్ల దూరం ఉన్న భక్తియార్‌పూర్‌లో అక్కడి రైల్వేస్టేషన్ పక్కన ఇస్త్రీ బండి పెట్టుకుని జీవించే మున్నీ అంత దూరం నుంచి రాంచీకి లాలూని చూడటానికి వచ్చింది. కాని సెక్యూరిటీ వాళ్లు ఆమెను లోపలకు వదల్లేదు. దాంతో ఆమె టీవీ కెమెరాల ముందు పెద్దపెద్దగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ‘నా దేవుడు లాలూని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తారా...’ అంటూ లాలూకు మద్దతుగా విపరీతంగా మాట్లాడింది. ఇది లాలూ కంట పడింది. ఆయన మెచ్చాడు. కట్ చేస్తే – భక్తియార్‌పూర్‌లో నడుచుకుంటూ వెళుతున్న మున్నీ పక్కనే మొన్నటి జూన్ మొదటి వారంలో ఒక జిప్సీ ఆగింది. ‘ఎక్కు’ అన్నారు అందులో ఉన్నవారు. బిహార్‌లో అధికారంలో ఉన్నది జె.డి.యు, బిజెపి అలెయెన్స్ ప్రభుత్వం. తాను ఆర్.జె.డి కార్యకర్త. పోలీసులు కాదుకదా అని భయపడింది. కాదు తమ పార్టీ వాళ్లే. అక్కడికి గంట దూరంలో ఉన్న పాట్నాలో రబ్రీదేవి బంగ్లాకు తీసుకెళ్లారు. లోపల రబ్రీ దేవి, పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ఉన్నారు. ‘లాలూగారు నిన్ను ఎం.ఎల్.సి చేయడానికి నిశ్చయించుకున్నారు’ అని వారు తెలిపితే మున్నీకి మాట రాలేదు. కృతజ్ఞతలు చెప్పి బయట పడింది. ఈ విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశం అయ్యింది. అయితే ‘అయినప్పుడు చూద్దాం’ అని కొందరు అనుకున్నారు. మరోవైపు పార్టీలో రజక వర్గానికే చెందిన మరొక నాయకుడు చురుగ్గా పని చేస్తున్నాడు. రజకులలో ఇవ్వాలనుకుంటే అతనికే ఇస్తారని ఊహించారు. కాని అంచనాలు తారుమారయ్యాయి. జూన్ 20న జరగనున్న ఎం.ఎల్.సి. ఎన్నికల్లో ఆర్.జె.డి. తరఫున పోటీ లేకుండానే గెలిచింది మున్నీ రజక్. ముగ్గురు పిల్లల తల్లి మున్నీ ముగ్గురు పిల్లల తల్లి. భర్త అవదేశ్ రజక్ కూడా వృత్తి పనే చేస్తున్నాడు. వీరికి భక్తియార్‌పూర్‌లోని రైల్వేస్టేషన్ పక్కనే ఉండే ఇస్త్రీ బండి ఆధారం. అయితే గత పదేళ్లుగా మున్నీ ఆర్.జె.డి. కార్యకర్తగా మారింది. ఆమె పాటలు పాడగలదు. పార్టీ సభలకు స్టేజ్ మీద పాటలు పాడుతుంది. అంతేకాదు లోకల్ టీవీ చానల్స్‌లో ఆమె పార్టీ విధానాలకు పెద్ద పెద్దగా అరిచి చెప్తుంది. నితీష్ ప్రభుత్వాన్ని బాగా తిట్టి పోస్తుంది. ఇవన్నీ పార్టీని ఆకర్షించాయి. ‘అట్టడుగు స్థాయి కార్యకర్తలను లాలూ అభిమానిస్తారని చెప్పడానికి, ఆ స్థాయి వారికి కూడా పదవులు దక్కుతాయని చెప్పడానికి మున్నీ ఎంపిక ఒక ఉదాహరణ’ అని ఆర్.జె.డి. నేతలు అంటున్నారు. మున్నీ చాలా ఉత్సాహంగా పని చేయాలనుకుంటోంది. ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడేవాళ్లదే పైచేయి కాబట్టి విధాన పరిషత్‌లో ఆమె విమర్శలు అధికార పార్టీని ఇరుకున పెట్టడం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు. మున్నీ రజక్ గురించి మున్ముందు మనం మరిన్ని విశేషాలు వినడంలో ఆశ్చర్యం లేదు. -
అబ్బా.. ఎంత బాగా ఉతుకుతున్నానో కదా..!
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో జంతువులు కూడా మనుషులను అనుకరిస్తూ.. మనం చేసే పనులు అవి కూడా చేస్తున్నాయి. గతంలో కోతులు మనుషుల మాదిరే సిగరెట్, కోక్ తాగే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు.. మనుషుల కన్నా బాగా పని చేస్తున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు.. హెలికాప్టర్ యాత్ర అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సచిన్ శర్మ అనే యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశారు. జూలో తీసిన ఈ వీడియోలో ఓ చింపాంజీ అచ్చం మనుషుల మాదిరే బట్టలు ఉతుకుతుంది. వీడియో ప్రాంరంభం కాగానే నీటి మడుగు పక్కన కూర్చుని ఉన్న ఓ చింపాంజీ కనిపిస్తుంది. దాని చేతిలో పసుపురంగు టీషర్ట్ ఉంటుంది. (చదవండి: ‘ఈ బంధాన్ని ఇక్కడితోనే ఆపేయండి’) ఇక ఈ చింపాంజీ టీ షర్ట్‌ని కిందపరిచి.. ముందుగా దానికి సబ్బు రుద్దుతుంది. తర్వాత బ్రష్ తీసుకుని.. రుద్దుతుంది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. మా కంటే నువ్వు చాలా బెటర్.. ఎంత బాగా పని చేస్తునావో.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోని 3000 మందికిపైగా లైక్ చేశారు. చదవండి: Viral Video: హద్దులు లేని ప్రేమ! ‘నేస్తమా.. ఇటు రా’ View this post on Instagram A post shared by Sachin Sharma (@helicopter_yatra_) -
జీన్స్‌ను నెలకు ఒక్కసారే ఉతకాలంట.. కారణమేంటంటే
న్యూఢిల్లీ: సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్ది మనిషికి సౌకర్యాలు పెరిగాయి. ప్రతిదీ చేయి దగ్గరకు వస్తుంది.. ఇక మన శారీరక శ్రమను తగ్గించే ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రైండర్లు, మిక్సీలు, వాషింగ్ మెషీన్లు. వీటి వల్ల మహిళలకు ముఖ్యంగా ఉద్యోగం చేసే ఆడవారికి పని సులువు అయ్యింది.. సమయం కూడా చాలా కలసి వస్తుంది. అయితే ఈ పరికరాల వల్ల మనిషికి లాభమే కానీ పర్యవరణానికి చాలా కీడు జరుగుతుంది. ముఖ్యంగా మన సౌకర్యం కోసం వాడుతున్న ఫ్రిజ్‌ల వల్ల ఓజోన్ పొరకు చాలా నష్టం వాటిల్లుతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి మరోకటి వచ్చి చేరింది. అది వాషింగ్ మెషీన్. మనల్ని బట్టలుతికే శ్రమ నుంచి తప్పించని వాషింగ్ మెషీన్‌ను తరచుగా వాడటం వల్ల పర్యావరణం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది అటున్నారు నిపుణులు. భూమిని పరిరక్షించుకోవాలని భావిస్తే.. వాషింగ్ మెషిన్ వాడకాన్ని తగ్గించమని సూచిస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: ఉన్నట్టుండి వాషింగ్ మిషిన్ ఢాం!! అని పేలింది..) తాజాగా సోసైటీ ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీ తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. సమాజంలో ఎక్కువ మంది చాలా తరచుగా.. అంటే ప్రతి రోజు వాషింగ్ మెషీన్‌ను వాడుతున్నారని.. దీనివల్ల పర్యావరణం మీద చాలా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఈ నివేదక వెల్లడిస్తుంది. మీరు వాషింగ్ మెషీన్లో బట్టలు ఉతికే ప్రతిసారి, మిలియన్ల మైక్రోఫైబర్లు నీటిలోకి విడుదల అయ్యి మహాసముద్రాలలోకి ప్రవేశిస్తాయి. మైక్రోఫైబర్లు ప్లాస్టిక్ చిన్న తంతువులు. ఇవి పాలిస్టర్, రేయాన్, నైలాన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్ల నుంచి వెలువడతాయి. మహాసముద్రాలలో ప్లాస్టిక్ కాలుష్యానికి ఇవి ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని నివారించాలంటే.. నెలకు ఒక్కసారి మాత్రమే వాషింగ్ మెషీన్ వాడమని నిపుణులు ఈ నివేదికలో సూచించారు. అంటే జీన్స్ ప్యాంట్స్‌ని నెలకు ఒకసారి.. జంపర్స్ని పదిహేను రోజులకు ఒకసారి.. పైజామాలను వారానికొకసారి ఉతకాలని తెలిపారు. అలానే లోదుస్తులను ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలని.. అది మెషీన్లో కాకుండా సాధారణ పద్దతుల్లో ఉతుక్కోవాలని సూచించారు. టీ షర్ట్స్, టాప్స్ వంటి వాటిని ఐదు సార్లు.. డ్రెస్‌లను ఆరు సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచించారు నిపుణులు. ఇలా చేయడం వల్ల టైమ్, మనీతో పాటు దుస్తులు కూడా ఎక్కువ కాలం మన్నుతాయని తెలుపుతున్నారు. బట్టలు తక్కువ సార్లు ఉతకడం వల్ల కరెంట్, నీటి వినియోగం తగ్గుతుంది. డిటర్జెంట్ల వాడకం తగ్గడం వల్ల తక్కువ సార్లు రసాయనాలు వాడినట్లు అవుతుంది. ఫలితంగా భూమికి మేలు చేసినవారం అవుతాం అంటున్నారు నిపుణులు. (చదవండి: వాషింగ్ మెషీన్లో బుసలు కొట్టిన నాగుపాము, వీడియో హల్చల్) "వాషింగ్ మెషీన్లను కనిపెట్టడానికి ముందు, బట్టలు ఉతకడం అనేది శ్రమతో కూడుకున్నది, అలసటగా ఉండేది. అయితే వాషింగ్ మెషీన్లు వచ్చాక ఈ శ్రమ తగ్గింది. ఉతకడం ఎక్కువయ్యింది. దీన్ని తగ్గిస్తే.. మనం మనతో పాటు మనం నివసించే గ్రహం కూడా బాగుంటుంది" అని ఫ్యాషన్ రివల్యూషన్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు , ఓర్సోలా డి కాస్ట్రో తెలిపారు. చదవండి: జీన్స్ వేసుకుని అలా వద్దు.. ఎందుకో తెలుసా? -
తల్లిని కాపాడేందుకు చెరువులో ఐదేళ్ల చిన్నారి సాహసం
పలమనేరు: బట్టలు ఉతుకుతూ కాలుజారి చెరువులో పడి తల్లి మునకలేసింది. తల్లిని చూసి కాపాడేందుకు ధైర్యం చేసి చెరువులోకి దిగిన చిన్నారి తానూ మునిగిపోతూ కేకలేసింది. ఇది విన్న స్థానికులు పరుగున అక్కడికి చేరుకుని చిన్నారిని రక్షించారు. తల్లి మాత్రం తిరిగిరాని లోకాలకు చేరుకుంది. శుక్రవారం ఈ సంఘటన మండలంలో పకీరుపల్లె వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మొగిలప్ప కుమార్తె సుజాత (40) తన తండ్రి వద్దే ఉంటోంది. ఆమె తన కుమార్తె లక్ష్మి (5)తో కలసి గ్రామ సమీపంలోని కూర్మాయిచెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. దుస్తులు ఉతుకుతుండగా కాలుజారి చెరువులో పడి మునిగిపోయింది. ఇది చూసి లక్ష్మి గట్టిగా కేకలు వేసినా ఎవరూ రాకపోయేసరికి తల్లిని కాపాడేందుకు తానే చెరువులోకి దిగడంతో బాలిక సైతం మునిగింది. ఆ బాలిక కేకలు విన్న సమీపంలోని రైతులు అక్కడికి చేరుకుని కాపాడారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. సుజాత కోసం గాలించినా ఫలితం లభించలేదు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారి బాబు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గంటపాటు గాలించి సుజాత మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
వాషింగ్ మెషీన్ ఆన్ చేసి లైట్ తీసుకోకండి!
మనం తరుచూ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిందని, గ్యాస్ లీకై పేలిందనే వార్తలు వింటుంటాం. కానీ మీరెప్పుడైనా వాషింగ్ మెషీన్ పేలిందని విన్నారా. అవును ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాషింగ్ మెషీన్ పేలే అవకాశం ఉంది. చాలా మంది వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ అలా చేయడం ముమ్మాటి తప్పే. కొన్ని చిట్కాలు పాటిస్తే వాషింగ్ మెషీన్‌ను ఎక్కువ కాలం వినియోగించుకోవడమే కాదు ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఇటీవల స్కాట్లాండ్ కు చెందిన లూరా బిరెల్ అనే మహిళ వాషింగ్ మెషీన్ లోలో బట్టలు వేసి, ఇంట్లోనే మరో పనిలో నిమగ్నమైంది. వాషింగ్ మెషీన్ బటన్ ఆన్ చేసిన కొద్ది సేపటి తర్వాత ఇంట్లోనే బాంబు పేలిన శబ్ధం వినిపించింది. దీంతో ఆందోళనకు గురైన లూరా.. ఏం జరిగిందోనని వాషింగ్ మెషీన్ వైపు చూడగా.. అది పేలి పొగలు రావడం గమనించింది. వెంటనే వాషింగ్ మెషీన్ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే తనకు జరిగిన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. వాషింగ్ మెషీన్ ఆన్ చేసి బయటకు వెళ్లి ఉంటే ఏమయ్యేదోనని ఊహించుకుంటే భయమేస్తుందంటూ నెటిజన్లతో షేర్ చేసుకుంది. వాషింగ్ మెషీన్ పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ ఎంబ్రాయిడరీ దుస్తులు, కాయిన్స్, మెమరీ ఫోమ్ దిండ్లు,స్నీకర్ షూస్, లెదర్ బ్యాగ్స్, జిప్పర్ లు ఎక్కువగా ఉన్న దుస్తుల్ని వాషింగ్ మిషన్ లో వేయడం వల్ల దుస్తులు పనికి రాకుండా పోవడమే కాకుండా, మిషన్ లోపల బట్టల్ని శుభ్రం చేసే చక్రాలు విరిగి పోయి, పేలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్ని చిట్కాల్ని అప్లయ్ చేయండి. జాగ్రత్తగా ఉండొచ్చు. ♦ ఎంబ్రాయిడరీ దుస్తులు, కాయిన్స్, మెమరీ ఫోమ్ దిండ్లు,స్నీకర్ షూస్, లెదర్ బ్యాగ్స్, జిప్పర్ లు ఎక్కువగా ఉన్న దుస్తుల్ని వాహింగ్ మిషన్ లో వేయడం వల్ల దుస్తులు పనికి రాకుండా పోవడమే కాకుండా, మిషన్ లోపల బట్టల్ని శుభ్రం చేసే చక్రాలు విరిగి పోయి, పేలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్ని చిట్కాల్ని అప్లయ్ చేస్తే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ♦ ట్యాప్ నుంచి వాషింగ్ మెషీన్‌లోకి వాటర్‌ను పంపే పైపుల్ని మార్చుకోవాలి. ఆ పైపులు పగిలినా, లేదంటే వాటర్ లీక్ అయినా లోపల ఉండే మిషనరీ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ♦ వాషింగ్ మెషీన్ ఆన్ లో ఉన్నప్పుడు వింత శబ్ధాలు వస్తుంటే వెంటనే దాన్ని మార్చుకోవడం ఉత్తమం. లేదంటే లేని పోని తలనొప్పిల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు కరెంట్ షాక్ తగలడం, మెషీన్ బ్లాస్ట్ అవ్వడంలాంటి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. ♦ వాషింగ్ మెషీన్ చుట్టూ మీ పిల్లలు, లేదంటే పెంపుడు జంతువులు లేకుండా చూసుకోవాలి. వాషింగ్ మెషీన్ ఆన్ లో ఉండగా ఫ్రంట్ డోర్ సరిగ్గా వేశామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే పిల్లలు ఆడుకునే బొమ్మల్ని లోపల వేస్తే..లోపల బట్టల్ని వాష్ చేసే చక్రాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. ♦ వాషింగ్ సమయంలో ఓవర్ లోడ్ కాకుండా చూసుకోవాలి. మీకు సూచించిన విధంగా మెషీన్ ను ఆపరేట్ చేయాలి. ♦ వాషింగ్ మెషీన్ ను నీట్ గా కడగాలి. వాషింగ్ మెషీన్ క్లీనర్ లేదా వేడి నీళ్లు, వెనిగర్, బేకింగ్ సోడాల్ని వినియోగించాలి. వాటిని వినియోగిస్తే లోపల ఉన్న సర్ఫ్, సబ్బు ముక్కలు తొలగిపోతాయి. ఎలాంటి మరమ్మత్తులు రాకుండా చూసుకోవచ్చు. -
బట్టలు ఉతుక్కుంటున్నాను: సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భోపాల్‌లోని చిరాయు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారి గురించి జనాలు ఎవరూ ఆందోళన చెందకుండా ఉండటం కోసం తన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటున్నారు చౌహాన్. వైరస్ బారిన పడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తన పనులు తానే చేసుకుంటున్నట్లు వెల్లడించారు. వైరస్ వల్ల తాను స్వయం సమృద్ధి గురించి తెలుసుకున్నానని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో తనే సొంతంగా టీ పెట్టుకోవడమే కాక తన బట్టలు తానే ఉతుక్కుంటున్నట్లు వెల్లడించారు. (ఐసోలేషన్ వార్డులో డాక్టర్ దుర్బుద్ధి) ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేను బాగున్నాను. నిత్యం ఏదో ఓ పని చేస్తూనే ఉన్నాను. దగ్గు కూడా తక్కువయ్యింది. మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆస్పత్రిలో టీ చేసుకుంటున్నాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నాను. కాబట్టి జనాలు ఎవరు కరోనా గురించి భయపడవద్దు. ఇది మనకు స్వయం సమృద్ధి గురించి బోధిస్తుంది. కొన్నేళ్ల క్రితం నా చెయ్యి ప్రాక్షర్ అయ్యింది. ఫిజియోథెరపి అవసరం ఎంతో ఉంది. కానీ ఇక్కడ ఆస్పత్రిలో నా చేతులు నిరంతరం ఏదో ఒక పని చూస్తూనే ఉన్నాయి. దాంతో నా చేతల పని తీరు కూడా బాగా మెరుగుపడింది’ అని తెలిపారు. గత వారం చౌహాన్ తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్న అజాగ్రత్త వల్ల తనకు కరోనా సోకిందని తెలిపారు. ఆదివారం చౌహాన్ 75 సెకన్ల నిడివి గల ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో ఆయన తన ఆరోగ్యం ఎంతో బాగుందని తెలిపారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. దీనిలో ఆయన బ్లూ కలర్ ఆస్పత్రి గౌన్ ధరించి కన్పించారు. (అనుమానంగా ఉంది.. ఎక్కడికెళ్లాలి?) -
పిల్లలూ.. దుస్తులు ఇలా శుభ్రం చేసుకోవాలి
కర్ణాటక, రాయచూరు రూరల్: ఇంటిలో ఉన్న కన్నపిల్లల దుస్తులు శుభ్రం చేయాలంటే తలనొప్పిగా మారుతున్న నేటి రోజుల్లో జెడ్పీ సీఈఓ కవితా మన్నికేరి స్వయంగా రంగంలోకి దిగి పిల్లలకు దుస్తులు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించిన ఘటన యాదగిరి జిల్లా లింగేరి మొరార్జి దేశాయి వసతి పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. ఆమె పాఠశాలను సందర్శించిన సమయంలో చిన్న పిల్లలు బట్టలు శుభ్రం చేసుకోవడానికి పడుతు న్న కష్టాలను చూడలేక ఆమే స్వతహాగా పిల్లలకు దుస్తులను ఎలా పిండుకోవాలో చూపించారు. అనంతరం విద్యార్థులు హాస్టల్లో ఏవిధంగా చదువుకుంటున్నారనే విషయంపై కూడా ఆరా తీశారు. -
కొత్తగా 5 మోడల్ వాషింగ్ యూనిట్లు
సాక్షి, హైదరాబాద్: రజక వృత్తికి ఆధునిక సొబగులు అద్దుతోంది రజక ఫెడరేషన్. చెరువులు, వాగుల వద్ద బట్టలుతికే పద్ధతికి స్వస్తి పలికేందుకు ఫెడరేషన్ చర్యలు చేపట్టింది. వృత్తిని ఆధునీకరించేందుకు నడుంబిగించింది. మోడ ల్ వాషింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చెరువులు, వాగుల్లో నీటి లభ్యత లేకపోవడం, కొన్నిచోట్ల అపరిశుభ్రమైన నీటితో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వృత్తికి సాంకేతికతను జోడిస్తోంది. ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో మోడల్ వాషింగ్ యూనిట్లు ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. ఫెడరేషన్ పరిధిలోని సంఘాల్లో సభ్యత్వం ఉన్న రజకులకు తక్కు వ ధరలో బట్టలుతికి ఆరబెట్టి ఇచ్చే వాషింగ్ మిషన్లను తీసుకురానుంది. రజకులకు శ్రమ తగ్గించి వృత్తిని విస్తృత పర్చుకునే వెసులుబా టు కల్పించాలని రజక ఫెడరేషన్ భావిస్తోంది. ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా.. మోడల్ వాషింగ్ యూనిట్లను తొలుత ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాల ని ఫెడరేషన్ నిర్ణయించింది. రజకుల జనాభా అధికంగా ఉన్న ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట్, నల్లగొండ జిల్లాలను ఎంపిక చేసింది. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.40 లక్షల వరకు వెచ్చించనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. వాటికి ఆమోదం లభిస్తే క్షేత్రస్థాయిలో చర్యలు వేగవంతం చేయనుంది. రజకులు ఇళ్ల నుంచి సేకరించే వస్త్రాలను చెరువులు, వాగులు వద్ద ఉతకడంతోపాటు అక్కడే ఆరబెట్టేవారు. దీనికిగాను ఒకరిద్దరు సహాయకులను నియమించుకునేవారు. మోడల్ వాషింగ్ యూనిట్లతో ఈ కష్టాలన్నీ దూరమ య్యే అవకాశముంది. ఆయా ప్రాజెక్టుల పరిధుల్లో రజకులు సేకరించిన వస్త్రాలను నేరుగా యూనిట్లో సమర్పించాలి. యూనిట్ నిర్వహకులు వాటిని నిర్ణీత గడువులోగా ఉతికి, ఆరబెడతారు. ఆ తర్వాత ఎవరి వస్త్రాలను వారు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఉతికి, ఆరబెట్టినందుకు ప్రతిఫలంగా ఫీజు ఇవ్వాలి. ఈ ఫీజు మొత్తాన్ని రజక ఫెడరేషన్ నిర్ణయిస్తుంది. ఉతికి, ఆరబెట్టిన వస్త్రాలను రజకులు ఇంటి వద్ద ఇస్త్రీ చేసి కస్టమర్లకు అందజేయవచ్చు. -
కాలువలో మహిళ గల్లంతు
తీపర్రు (పెరవలి) : కాలువలో దుస్తులు ఉతకడానికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తూ అందులో పడి గల్లంతైంది. స్థానికుల కథనం ప్రకారం.. పెరవలి మండలం తీపర్రుకు చెందిన పోలవరపు పద్మావతి(38) బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి వద్ద ఉన్న నరసాపురం కాలువలో దుస్తులు ఉతకడానికి వెళ్లింది. రేవులో నాచు పట్టి ఉండటం వల్ల ప్రమాదవశాత్తూ కాలుజారి కాలువలో పడింది. స్థానికులు కాలువలో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో మధ్యాహ్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెరవలి ఎస్సై పి.నాగరాజు ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కాలువ దిగువన ఉన్న పోలీసుస్టేçÙన్లకు సమాచారం ఇచ్చారు. కాలువ వెంబడి గాలింపు చేపట్టామని చెప్పారు. పద్మావతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఇటీవల వివాహం చేశారు. పద్మావతి భర్త నాగరాజు కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
బట్టలు సరిగా ఉతకలేదని జడ్జిగారి మెమో
చెన్నై: ప్రభుత్వ ఉన్నతాధికారులు కింది ఉద్యోగులను ఇంటి పనికి వాడుకోవడం, తరచూ వేధింపులకు గురిచేయడం లోపాయికారిగా జరిగే వ్యవహారమే. అది దాచేస్తే దాగని సత్యం. కానీ తమిళనాడుకు చెందిన ఓ జడ్జిగారు మహిళా అసిస్టెంట్ కు బహిరంగంగా జారీ చేసిన మెమో అధికార దుర్వినియోగానికి అద్దం పట్టింది . బట్టలు సరిగా ఉతకలేదనే కారణంతో ఈరోడ్ జిల్లా కోర్టు కార్యాలయంలో మహిళా సబార్డినేట్ కు , సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ... మెమో జారీ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్థానిక భాషలో(తమిళం)లో జారీ చేసిన ఈ మెమో లో బట్టలు, ముఖ్యంగా లో దుస్తులు సరిగా ఉతకలేదంటూ మండిపడ్డారు. దీనికితోడు తమ మాటకు ఎదురు చెప్పావంటూ ఉగ్రుడయ్యారు. సమాధానం చెప్పాలంటూ మెమో జారీ చేశారు. ఆ మెమోలో ...బట్టలు..ముఖ్యంగా లోపలి వస్త్రాలు శుభ్రంగా ఉతకకపోవడం, తమ మాటలకు ఎదురు చెప్పడం, బట్టలు బైటికి విసిరేయడం.. ఎదురు సమాధానం చెప్పడం లాంటి నేరాలపై క్రమశిక్షణా చర్య ఎందుకు తీసుకోకూడదో చెప్పాలన్నారు. దీనిపై వారం రోజులుగా వివరణ ఇవ్వాలని కోరుతూ గత నెల 1న మహిళా అసిస్టెంట్ వాసంతికి ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. దీనిపై ఆమె వివరణ ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్లీ జరగదంటూ వివరణ ఇచ్చుకుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ద్వారా పదేళ్ల క్రితం తాను విధుల్లో చేరానని, కార్యాలయంలో పనిచేయాలనుకున్న తాను చివరికి పనిమనిషిగా మారతాననుకోలేదని వాసంతి వాపోయింది. కొంతమంది ఉన్నతాధికారులుతమ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై తమళనాడు జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆందోళనకు సిద్ధపడుతున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకోరాదని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఈ తరహా వేధింపులు కొనసాగుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకరన్ తెలిపారు. ఈవ్యవహారంపై స్పందించడానికి మెమో జారీ చేసిన న్యాయమూర్తి అందుబాటులో లేరని సమాచారం. -
వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది?
వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత దుస్తులు ఉతకడం చాలా సులువైపోయింది. కొంచెం అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ వాషింగ్ మిషన్లు ఉంటున్నాయి. ఇంతకీ వాషింగ్ మిషన్ ఎలా పని చేస్తుందో తెలుసా? వాషింగ్ మిషన్ అనేది విద్యుచ్ఛక్తి సాయంతో నడిచే ఒక గృహోపకరణం. దాదాపు అన్ని రకాల వాషింగ్ మిషన్లలోనూ గుండ్రటి డ్రమ్ము వంటిది ఉంటుంది. ఉతికిన దుస్తులను తీసి, ఇందులో వేస్తే, ఇది గిరగిరా తిరుగుతూ దుస్తులను నీళ్లు లేకుండా పిండుతుంది. ఇప్పుడు వస్తున్న అధునాతన వాషింగ్ మిషన్లలో అంటే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లలో ముందుగా రూపొందించబడిన మెకానిజం ప్రకారం, మనం కొన్ని మీటలను నొక్కితే చాలు... దుస్తులను ఉతకడం, జాడించడం, పిండటం వంటివన్నీ అదే చేస్తుంది. విద్యుత్తుతో పని చేసే కవాటం లోపలి ద్వారంలో నీటిని పోయాలి. ఫుల్లీ ఆటోమేటెడ్ అయితే నీటి కుళాయికి అనుసంధానిస్తే చాలు, అదే కావలసినంత నీటిని తీసుకుంటుంది. నీరు కావలసినంత మట్టానికి చేరగానే, దానిని కనిపెట్టి, దానంతట అదే నీటి ధార ఆగిపోయేలా సెన్సర్లు ఉంటాయి. కవాటం లోపలి ద్వారంలో ఉండే నీటి పీడనం మూలంగా కవాటం దానంతట అదే మూసుకుపోతుంది. నీటిని వేడి చేయవలసిన అవసరం ఉంటే, అందులో ఉండే వేడి చేసే పరికరం (హీటర్) ద్వారా నీరు వేడెక్కుతాయి. ముందుగానే సెట్ చేసి ఉంచిన సెన్సర్ ద్వారా దానికి కావలసిన వేడిని చేరగానే నీరు వేడెక్కటం ఆగిపోతుంది. నీటిలో కలిపిన డిటర్జెంట్ పొడి సాయంతో మురికి పోయేలా డ్రమ్లోని దుస్తులను పరికరం అటూ ఇటూ వేగంగా తప్పుతుంది. శుభ్రపడిన దుస్తులు స్పిన్నింగ్ డ్రమ్ములోకి వెళతాయి. సెమీ ఆటో మేటిక్ అయితే మనమే వాటిని స్పిన్నింగ్ డ్రమ్ములోకి పంపించాలి. ఉతికిన దుస్తులలోని సర్ఫు నురగ పోయేలా బట్టలను ఆ పరికరం శుభ్రంగా జాడించి, అక్కడినుంచి బట్టలను ఎండబెట్టే డ్రయ్యర్‌లోకి పంపుతుంది. దుస్తులలోని నీరంతా పోయే వరకూ డ్రయ్యర్ వాటిని గట్టిగా పిండుతుంది. దుస్తులను పిండటం అయిపోయాక మనం వాటిని తీసి, గాలి లేదా ఎండ తగిలేలా ఆరవేయాలి. వాషింగ్ మిషన్ల వాడకం ద్వారా గృహిణులకు చాలా శ్రమ తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది.