అబ్బా.. ఎంత బాగా ఉతుకుతున్నానో కదా..! | Chimpanzee Washes Clothes with Soap and Brush Like Humans | Sakshi
Sakshi News home page

Chimpanzee Washes Clothes: అబ్బా.. ఎంత బాగా ఉతుకుతున్నానో కదా..!

Published Sat, Oct 9 2021 9:16 PM | Last Updated on Sun, Oct 10 2021 7:25 AM

Chimpanzee Washes Clothes with Soap and Brush Like Humans - Sakshi

న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో జంతువులు కూడా మనుషులను అనుకరిస్తూ.. మనం చేసే పనులు అవి కూడా చేస్తున్నాయి. గతంలో కోతులు మనుషుల మాదిరే సిగరెట్‌, కోక్‌ తాగే వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు.. మనుషుల కన్నా బాగా పని చేస్తున్నావ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఆ వివరాలు..

హెలికాప్టర్‌ యాత్ర అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో సచిన్‌ శర్మ అనే యూజర్‌ ఈ వీడియోని పోస్ట్‌ చేశారు. జూలో తీసిన ఈ వీడియోలో ఓ చింపాంజీ అచ్చం మనుషుల మాదిరే బట్టలు ఉతుకుతుంది. వీడియో ప్రాంరంభం కాగానే నీటి మడుగు పక్కన కూర్చుని ఉన్న ఓ చింపాంజీ కనిపిస్తుంది. దాని చేతిలో పసుపురంగు టీషర్ట్‌ ఉంటుంది. 
(చదవండి: ‘ఈ బంధాన్ని ఇక్కడితోనే ఆపేయండి’)

ఇక ఈ చింపాంజీ టీ షర్ట్‌ని కిందపరిచి.. ముందుగా దానికి సబ్బు రుద్దుతుంది. తర్వాత బ్రష్‌ తీసుకుని.. రుద్దుతుంది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. మా కంటే నువ్వు చాలా బెటర్‌.. ఎంత బాగా పని చేస్తునావో.. అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోని 3000 మందికిపైగా లైక్‌ చేశారు. 

చదవండి: Viral Video: హద్దులు లేని ప్రేమ! ‘నేస్తమా.. ఇటు రా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement