chimpanzee
-
గుండెపోటుతో చింపాంజీ మృతి
విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూ పార్కులో చీపా అనే ఆడ చింపాంజీ బుధవారం మృతి చెందింది. దీని వయసు 29 సంవత్సరాలు ఉంటుందని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. జూ ఆస్పత్రిలో వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్డియక్ అరెస్టుతో మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం వెల్లడైనట్లు ఆమె తెలిపారు. దీన్ని 2016లో ఇజ్రాయిల్ జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఒంటరైన చికిత ప్రస్తుతం జూ పార్కులో ఉన్న చికిత అనే పేరుగల చింపాంజీ ఒంటరైంది. ఇంతవరకు తోడుగా ఉన్న చీపా మరణించడంతో చికిత ఒక్కటే ఇక్కడ మిగిలింది. 2016లో ఇజ్రాయిల్ నుంచి చికో అనే పేరుగల ఒక మగ చింపాంజీ, చీపా, చికిత అనే రెండు ఆడ చింపాంజీలను విశాఖ జూకి తీసుకొచ్చారు. చికో మూడేళ్ల క్రితం మృతి చెందగా బుధవారం చీపా మృతి చెందింది. దీంతో చికిత ఒంటరిగా మిగిలింది. -
నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ట్విటర్ వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'మండే మోటివేషన్' అనే ట్యాగ్‌తో తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. ఈ క్లిప్ గత వారం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఆఫ్రికా కామెరూన్‌లోని ఒక చింపాంజీ నీరు త్రాగడానికి ఫోటోగ్రాఫర్ సహాయం కోరింది. నీరు తాగిన తరువాత ఈ వ్యక్తి చేతులను శుభ్రంగా కడిగేసింది. ఇది చాలా ఉపయోగకరమైన లెసన్ అంటూ.. మీరు విజయం సాధించాలనుకుంటే, మీ సంఘంలోని వారికి సహాయం చేయండి, మద్దతు ఇవ్వండి.. వారు తిరిగి మీకు సపోర్ట్ చేస్తారు అని రాసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది ఈ వీడియోని లైక్ చేయగా.. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. నిజంగా ఈ సంఘటన ఎందోమంది మనసు దోచింది. దీనికి ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయాడంటే.. ఈ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. This clip went around the world last week. A Chimpanzee in Cameroon, Africa apparently asked for a photographers’s help in drinking water; then repaid him by washing his hands gently… A useful applied lesson: If you want to succeed, then assist & support those in your… pic.twitter.com/qLntPXfTkG — anand mahindra (@anandmahindra) August 21, 2023 -
అబ్బా.. ఎంత బాగా ఉతుకుతున్నానో కదా..!
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో జంతువులు కూడా మనుషులను అనుకరిస్తూ.. మనం చేసే పనులు అవి కూడా చేస్తున్నాయి. గతంలో కోతులు మనుషుల మాదిరే సిగరెట్, కోక్ తాగే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు.. మనుషుల కన్నా బాగా పని చేస్తున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు.. హెలికాప్టర్ యాత్ర అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సచిన్ శర్మ అనే యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశారు. జూలో తీసిన ఈ వీడియోలో ఓ చింపాంజీ అచ్చం మనుషుల మాదిరే బట్టలు ఉతుకుతుంది. వీడియో ప్రాంరంభం కాగానే నీటి మడుగు పక్కన కూర్చుని ఉన్న ఓ చింపాంజీ కనిపిస్తుంది. దాని చేతిలో పసుపురంగు టీషర్ట్ ఉంటుంది. (చదవండి: ‘ఈ బంధాన్ని ఇక్కడితోనే ఆపేయండి’) ఇక ఈ చింపాంజీ టీ షర్ట్‌ని కిందపరిచి.. ముందుగా దానికి సబ్బు రుద్దుతుంది. తర్వాత బ్రష్ తీసుకుని.. రుద్దుతుంది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. మా కంటే నువ్వు చాలా బెటర్.. ఎంత బాగా పని చేస్తునావో.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోని 3000 మందికిపైగా లైక్ చేశారు. చదవండి: Viral Video: హద్దులు లేని ప్రేమ! ‘నేస్తమా.. ఇటు రా’ View this post on Instagram A post shared by Sachin Sharma (@helicopter_yatra_) -
‘ఈ బంధాన్ని ఇక్కడితోనే ఆపేయండి’
జూలో జంతువులను చూసి భలే ఉన్నాయంటూ మురిసిపోతాం. కోతులు, చింపాజీల వంటి జంతువులైతే అచ్చం మనిషిలాగే ఉంటాయని ఆనందపడతాము. ఖాళీ దొరికితే చాలు జంతుప్రేమికులు.. జూలను సందర్శిస్తుంటారు. అయితే తాజాగా బెల్జియంలోని ఆంట్వెర్ప్ జంతు ప్రదర్శనశాల ఓ సందర్శకురాలిపై నిషేధం విధించింది. దీంతో సదరు సందర్శకురాలు కన్నీటి పర్యంతం అయ్యిది. వివరాల్లో వెళ్తే.. బెల్జియంలోని ఆంట్వెర్ప్ జంతు ప్రదర్శనశాలను గత నాలుగేళ్లుగా ఏడీ టిమ్మర్‌మన్స్ అనే ఓ మహిళా సందర్శిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆమె జూకి వచ్చిన ప్రతిసారి ఆమె 38 ఏళ్ల ఓ మగ చింపాంజీని చూస్తూ కాలక్షేపం చేసేది. తరచుగా రావటంతో ఆ చింపాంజీ సదరు మహిళను గుర్తించడం మొదలుపెట్టింది. దీంతో వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో చింపాంజీ దాని సహచర చింపాంజీలో కలివిడిగా ఉండటంతో తగ్గించింది. ఒంటరిగా కూర్చోటంతో మిగతా చింపాంజీలు కూడా దాన్ని పట్టించుకోవటం మానేశాయి. దీంతో ఆ చింపాంజీలో వచ్చిన మార్పును జూ సిబ్బంది గమనించి.. దాని ప్రవర్తనకు గల కారణం ఆరా తీశారు. అయితే ఏడీ టిమ్మర్‌మన్స్ అనే మహిళ దాని వద్ద ఎక్కువ సమయం ఉండటం వారి దృష్టికి వచ్చింది. అయితే దాని ప్రవర్తనలోని మార్పుకు తీసుకురావడానికి సిబ్బంది.. ఆమెను జూకు రావొద్దని నిషేధం విధించారు. దీంతో ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవుతూ.. చింపాజీతో తనకు బంధం ఉందని తెలిపింది. మిగతా సందర్శకులను అనుమతించినప్పుడు తనను ఎందుకు రానివ్వడం లేదని జూ సిబ్బందిని ప్రశ్నించింది. ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో ఉద్యమం నడుస్తోంది. -
Viral Video: హద్దులు లేని ప్రేమ! ‘నేస్తమా.. ఇటు రా’
ఐకమత్యం మనుషుల కంటే జంతువుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటి ప్రేమ నిస్వార్థంతో కూడుకున్నది. ఈ విషయాలు ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే వస్తున్నాయి. అంతేకాదు వాటి విశ్వసనీయతకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్లో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా థాయ్‌లాండ్ నుంచి అలాంటి ఓ సీన్.. ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది. చూపు లేని ఓ ఏనుగుకు ఆహారం కోసం మరో ఏనుగు దారి చూపించడం ఆ వీడియోలో ఉంది. ఎలిఫెంట్ నేచర్ పార్క్ ఫౌండర్ లెక్ ఛాయ్లెర్ట్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ప్లాయ్ థాంగ్కు చూపు లేదు. కానీ, చనా దాని బాగోగులన్నీ చూసుకుంటోంది. ఈ వీడియోలో దానిని ఆహారం వైపు తీసుకెళ్తోంది. ప్రతీరోజూ ఇలా మనసుకి సంతోషాన్ని కలిగించే దృశ్యాన్ని నేను చూస్తున్నా. ఈ మూగజీవాల నిస్వార్థమైన ప్రేమ.. మనకూ ఒక పాఠం కావాలి’ అని పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Lek Chailert (@lek_chailert) ఇక మరో పాత వీడియో సైతం ఇంటర్నెట్లో దర్శనమిస్తోంది. ప్రముఖ ప్రైమటాలజిస్ట్ జేన్ గుడ్‌ఆల్.. ఓ చింపాజీని కొందరి సాయంతో రక్షించగా, అది తిరిగొచ్చి ఆమెను ఆప్యాయంగా హత్తుకుంది. 2014లో వైరల్ అయిన ఈ పాత వీడియో ట్విటర్ ద్వారా మరోసారి తెర మీదకు రావడం విశేషం. Love has no limits. Watch the unconditional love of this chimpanzee to the people who rescued and helped her get back to the woods. Before she leaves, she beautifully expresses her gratitude to the team and Dr Jane Goodall. Today is #WorldChimpanzeeDay 🎐 pic.twitter.com/FhC5ir3la9 — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 14, 2021 -
‘సాండ్రాను చూస్తే ముచ్చటేస్తుంది’
-
కరోనా: చేతులు కడుక్కున్న చింపాంజీ
కరోనా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు చేతులను ఇలా శుభ్రం చేసుకోవాలంటూ ఓ చింపాంజీ అవగాహన కల్సిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూకేలోని ఓ జూకు చెందిన ఈ చింపాంజీ పేరు సాండ్రా. ఈ ఒరంగుటాంగ్ తన చేతులను సబ్బు నీళ్లలో బ్రష్‌తో శుభ్రం చేసుకుంటున్న వీడియోను ఓ ట్విటర్ యూజర్ బుధవారం రాత్రి షేర్ చేశాడు. ’ఆ జూలో పని చేస్తున్న సిబ్బంది కోవిడ్-19 నేపథ్యంలో తరచూ చేతులు కడుక్కోవడం చూసి సాండ్రా కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవడం ప్రారంభించింది’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 3.2 మిలియన్ల వ్యూస్ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘ఓ కోతిని చూసి మరో కోతి నేర్చుకుంది’, ‘సాండ్రా చేతులను శుభ్రం చేసుకుంటున్న తీరు చూస్తే ముచ్చటేస్తుంది... ఇది ఎంత ముద్దుగా ఉందో’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (ఏపీలో 132కి చేరిన కరోనా కేసులు!) ‘ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు’ కాగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని అరికట్టేందుకు మందు లేకపోవడంతో ముందు జాగ్రత్తలు చర్యలే విరుగుడు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా కోవిడ్-19 బారిన పడకుండా ఉండేందుకు తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, సామాజిక దూరం పాటించాలంటూ సెలబ్రెటీలు సైతం అవగాహన చర్యలు చేపడుతున్నారు. (మర్కజ్ : ఈశాన్యానికి పాకిన విషపు వైరస్) -
లిప్ టూ లిప్ కిస్.. సో క్యూట్!
-
వైరల్: లిప్ టూ లిప్ కిస్.. సో క్యూట్!
మెక్సికో : జూ ఎన్‌క్లోజర్‌లోని ఓ చింపాంజీ మహిళకు లిప్ టూ లిప్ కిస్ ఇచ్చింది. ఈ సంఘటన న్యూ మెక్సికోలోని ఏబీక్యూ బయోపార్క్ జూలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ కావటంతో వారం రోజుల క్రిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం న్యూ మెక్సికోకు చెందిన ఓ మహిళ భర్తతో కలిసి అక్కడి బీక్యూ బయోపార్క్ జూకు వెళ్లింది. ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఓ చింపాంజీ ఆమెకు బాగా నచ్చటంతో దానికి దగ్గరగా వెళ్లింది. మొదట ఆ చింపాంజీ వారి వైపు చూడలేదు. ఆ మహిళ కొన్ని పిల్లి మొగ్గలు వేయటంతో ఆ కోతి ఆమె వైపు తిరిగింది. ఆమె దాని కళ్లలోకి చూస్తూ పెదాలను ముందుకు చాపింది. అంతే అటువైపునుంచి ఆ చింపాంజీ కూడా పెదాలను చాచి ఆమెను ముద్దుపెట్టుకుంది. అయితే ఇద్దరి మధ్యా ఎన్‌క్లోజర్ అద్దం ఉండటం గమనార్హం. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ లిప్ టూ లిప్ కిస్.. సో క్యూట్! .. బ్యూటీ అండ్ ది బీస్ట్..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( కరోనా: మనుషులకు సరే, మరి దేవుళ్లకు ) -
బట్టలుతికే చింపాంజీ వీడియో వైరల్
చాంగింక్ : చింపాంజీలు, మానవ చేష్టలను అనుకరించే తెలివైన జంతువులని తెల్సిందే. అయినప్పటికీ అప్పుడప్పుడు వాటి చేష్టలు చూస్తుంటే నవ్వు రావడమే కాకుండా, ఔరా అనేలా అబ్బురపరుస్తాయి. చైనా, చాంగింక్ రాష్ట్రంలోని ‘లెహే లెడు థీమ్ పార్క్’లో గత శుక్రవారం నాడు 18 ఏళ్ల యుహూ అనే చింపాజీ తన సంరక్షుడి తెల్లటి టీ షర్టును ఉతుకుతు కనిపించింది. నీళ్ల గుంట వద్ద కూర్చొని అచ్చం మనిషి వలనే చొక్కాకు సబ్బు పెట్టి, నీళ్లలో పదే పదే కుదించి, ఆ పక్కనే ఆరేయడం అబ్బురపరిచింది. ఈ తతంగాన్ని ఆ పక్కనే ఇనుప రాడ్లపై కూర్చున్న సోదరి చింపాంజీ ఎంజాయ్ చేసింది. ఆ సమయంలో చింపాంజీ సంరక్షుకుడు ఆ చింపాంజీల కోసం వంట తయారు చేస్తున్నారని, ఈ లోగా ఈ దృశ్యాలను చూసిన పార్క్ వర్కర్ ఒకరు దాదాపు 30 నిమిషాలపాటు కొనసాగిన చింపాజీ చేష్టలను వీడియో తీశారు. చింపాజీలు తమ పడకలను మనుషులకన్నా శుభ్రంగా ఉంచుకుంటాయని ఆ వర్కర్ తెలిపారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. -
సుజీ.. ఎంతపని చేసింది!!
బహదూర్‌పురా: జూలో తోడు లేక తల్లడిల్లుతున్న ఓ చింపాంజీ అక్కడ పనిచేసే హెడ్ మాలీపై దాడి చేసి గాయపరిచింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం ఎన్‌క్లోజర్‌లో నుంచి బయటికి వచి్చన ఆడ చింపాంజీ సుజీ.. హెడ్ మాలీ యాదయ్యపై దాడి చేసి కాలిపై గాయపరిచింది. సోమవారం జూపార్కుకు సెలవు కావడంతో పెద్ద గండం తప్పింది. ప్రముఖ వ్యాపార సంస్థ సహారా చైర్మన్ సుబ్రతోరాయ్ 2011లో బహుమతిగా ఆడ చింపాంజీ సుజీని జూకు అందించారు. అప్పట్నుంచి సుజీ జూలో సందర్శకులను అలరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పెద్దదైన సుజీ ఒంటరితనం అనుభవిస్తోంది. ఇటు జూ సిబ్బంది ఇన్నాళ్లైనా దానికి ఓ తోడును తేవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే సుజీ గతంలో ఆహారం కూడా మానేసి తీవ్ర అస్వస్థతకు గురై కోలుకుంది. ఎన్‌క్లోజర్‌లో నుంచి సుజీ బయటికి రావడం ఇది రెండోసారి. గతంలో యానిమల్ కీపర్‌ను ఎన్‌క్లోజర్‌లో ఉంచి బయటి నుంచి సుజీ గడియపెట్టింది. కాగా దాడి ఘటనపై సమాచారం అందుకున్న జూ వెటర్నరీ వైద్యులు, అధికారులు వెంటనే స్పందించి ఫుడ్కోర్ట్ వద్ద సుజీపై మత్తు మందు ప్రయోగించి పట్టుకున్నారు. గాయపడిన యాదయ్యను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జూ అధికారులు విచారణ చేపట్టారు. -
యాంగ్ యాంగ్ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..
బీజింగ్ : 12 ఏళ్లుగా బోనులో బందీగా ఉన్న ఓ చింపాంజీకి విముక్తి లభించింది. ఇంకేముంది.. తనదైన రీతిలో పరుగులు తీసింది. తన దారికి అడ్డువచ్చిన వారిని ఎగిరెగిరి తన్నింది. ఇక తనను ఆపేవారే లేరనుకొని పార్క్‌లో పరుగెడుతూ హల్చల్ చేసింది. చివరకు మళ్లీ అదే బోనులోకి వెళ్లి బిక్కమొఖం వేసింది. ఈ ఘటన చైనాలోని హెఫీ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో గత శుక్రవారం చోటు చేసుకుంది. హెఫీ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఓ రేకుల షెడ్డూలో ఉన్న 12 ఏళ్ల యాంగ్ యాంగ్ అనే చింపాంజీ షెడ్డును పగులగొట్టి అక్కడ ఉన్న వెదురు బొంగుల ద్వారా బయటపడింది. అక్కడ నుంచి పరుగులు తీస్తూ జూలో ఉన్న సందర్శకులపై దాడి చేయబోయింది. అడ్డుకున్న జూ సిబ్బందిని ఎగిరితన్నింది. దీంతో కొద్దిసేపు జూలో గందరగోళ వాతావరణం నెలకొంది. తమపై చింపాంజీ ఎటువైపు నుంచి విరుచుకుపడుతుందోనని సందర్శకులు భయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. జూ సిబ్బందితో కలిసి పోలీసులు చాకచక్యంగా యాంగ్ యాంగ్‌ను పట్టుకుని తిరిగి బోనులో పెట్టారు. దీంతో సందర్శకులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సీఎం.. చింపాంజి
హుబ్లి (సాక్షి, బెంగళూరు): సీఎం సిద్ధరామయ్యను చింపాంజితో పోలుస్తూ హుబ్లి–ధారవాడ మహిళా కాంగ్రెస్ వాట్సప్ గ్రూప్ లో స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ మోహన హిరేమని షేర్ చేసిన మార్ఫింగ్ చేసిన ఫో టో చర్చనీయాంశమైంది. ఏకంగా సీఎం ఫోటోను అదే పార్టీ నాయకురాలు పార్టీ గ్రూప్‌లోనే పోస్ట్ చేయడంతో ఆమెపై పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు డీ.కే.శివకుమార్, వినయ్ కులకర్ణి, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ తదితరులు సభ్యులుగా ఉన్న గ్రూపులో ఈ ఫోటో పెట్టడం విశేషం. దీనిపై హుబ్లి–ధారవాడ నగర జిల్లాధ్యక్షుడు అల్తాఫ్ స్పందిస్తూ కార్పొరేటర్ మోహన హిరేమని తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేం పెట్టలేదు : తమ నాయకుడైన సిద్ధరా మయ్య అవహేళనకరంగా ఉన్న ఫోటోను తాము పోస్ట్ చేయలేదని, ఈ ఘటనతో త మకు సంబంధం లేదని కార్పొరేటర్ మోహన హిరేమని చెబుతున్నారు. -
చింపాంజీతో జీవా
తమిళసినిమా: చింపాంజీతో కలిసి వినోదాల విందునివ్వడానికి నటుడు జీవా సిద్ధం అవుతున్నారు. ఆయనతో వర్ధమాన నటి శాలినిపాండే జోడి కడుతోంది. కీ చిత్రంతో త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతున్న నటుడు జీవా తాజా చిత్రానికి రెడీ సిద్ధం అయిపోతున్నారు. ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై విజయరాఘవేంద్ర హైయస్ట్ కామెడీ థ్రిల్లర్ కథతో భారీ వ్యయంతో నిర్మించినున్న ఈ చిత్రానికి గోరిల్లా అనే టైటిల్‌ను నిర్ణయించారు. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి ఫేమ్ శాలినిపాండే నాయకిగా నటించనున్న ఇందులో నిజ చింపాంజీ టైటిల్ పాత్రలో నటించనుంది. దీనికి డాన్శాండి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ చింపాంజీలు చాలా తెలివిగా, జాలీగా ఉండడానికి కారణం వాటి అల్ల రితనమేనన్నారు. అలాంటి ఇతివృత్తంతో రూపొందించనున్న చిత్రం గెరిల్లా అని వివరించారు. ఇందులో జీవా, శాలినిపాండే హీరోహీరోయిన్లుగా నటించనుండగా థాయ్‌లాండ్‌కు చెందిన చింపాంజీ ముఖ్య పాత్రలో నటించనుందని తెలిపారు. ఈ చింపాంజీకి థాయ్‌లాండ్‌లోని సాముట్ అనే సంతు శిక్షణ కేంద్రంలో నాలుగు నెలల పాటు శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. హాలీవుడ్ చిత్రాలు హెంగోవర్–2, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ వంటి చిత్రాల్లో నటించిన చింపాంజీలు ఈ కేంద్రంలోనే శిక్షణ పొందాయన్నది గమనార్హం. గెరిల్లా చిత్రం పూర్తి వినోదాత్మకంగానూ, అదే సమయంలో చాలా థ్రిల్లింగ్‌గానూ ఉంటూ ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. చిత్ర షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనికి విక్రమ్‌వేదా చిత్రం ఫేమ్ శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారని తెలిపారు. -
చింపాంజీ సిగరెట్ తాగితే...!
-
పెప్సోడెంట్ పేస్టు.. పియర్స్ సబ్బు.. చింపాంజీ సోకులు!
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ చింపాంజీకి రాజభోగాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇది సాధారణ చింపాంజీ కాదు.. ఓ కోటీశ్వరుడు పెంచుకున్నది!! ఈ మధ్యేనే హైదరాబాద్ జూకి వచ్చిన ఈ చింపాంజి పేరు సుజీ (28). సహారా గ్రూపు చైర్మన్ సుబ్రతా రాయ్ పెంచుకున్న ఈ చింపాజీని ఇప్పుడు నగరంలోని జూ కు తీసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన సుజీ ప్రస్తుతం జూలో కూడా అదే రాజభోగాలు అనుభవిస్తోంది. ఉదయాన్నే పళ్లు తోమడంతో తన దైనందిన జీవితాన్ని మొదలుపెట్టే సుజీ.. ఇందుకు పెప్సోడెంట్ టూత్ పేస్టు తప్ప మరొకటి వాడదు. ఆ తర్వాత స్నానానికి సకల సౌకర్యాలతో కూడిన బాత్ రూమ్, షాంపూ, పియర్స్ సబ్బు ఉండాల్సిందే. స్నాన కార్యక్రమం ముగిశాక కొబ్బరినూనెతో శరీరంపై మర్దన చేసుకుంటుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన తర్వాత చక్కని కాఫీ సేవిస్తుంది. ఎప్పుడూ నెస్ కేఫ్ కాఫీని తాగే సుజీ.. అప్పుడడప్పుడూ కాంప్లాన్ ను హెల్త్ డ్రింక్ గా భావిస్తూ తీసుకుంటుంది. ఆ తర్వాత బ్రెడ్, ఫ్రూట్ జామ్, కొన్ని పండ్లతో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేస్తుంది. లంచ్ కోసం తేనె, పండ్లు, కార్న్ ఫ్లేక్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుంది. కాడ్ బరీ చాక్లెట్స్ అంటే పిచ్చెత్తిపోయే సుజీ కేవలం మినరల్ వాటరే తాగుతుంది. అది కూడా తన బాటిల్ లో మాత్రమే. జూ అధికారులు సుజీ పడుకోవడానికి రోజూ కొత్త బ్లాంకెట్స్ ఇవ్వాల్సిందే.. వాడినది ఇచ్చి దాన్ని మోసం చేయడం అసాధ్యం. ఇక ఎండ వేడిమి ఉంటే కచ్చితంగా కూలర్, ఫ్యాన్ ఉండాల్సిందే. దోమలు లేకుండా ఉంచడం కోసం ఆలౌట్ లాంటి లిక్విడ్ సదుపాయం కూడా తప్పదు మరి. ఈ విషయంపై అధికారులను అడగగా ప్రస్తుతం జైలులో ఉన్న సుజీ పాత యజమాని సుబ్రతా రాయ్‌కి కూడా ఇలాంటి సదుపాయాలు ఉండవని అంటున్నారు. -
ప్రేమకు ప్రతిరూపం.. చింపూ
పాతికేళ్లయినా మరువని వానరాలు... మానవత్వం, ప్రేమ, అనురాగాలు మనుషుల్లో ఉండే సహజ గుణాలు. కానీ ఇవి అందరికీ ఉండవు. ఉన్నా.. ఎక్కువ కాలం కొనసాగడం కష్టమే. ఎవరైన మనకు సహాయం చేస్తే వాళ్లను కొంతకాలం గుర్తుంచుకుంటాం. ఎదుటి వ్యక్తులు చేసిన సహాయాన్ని ఏళ్ల తరబడి గుర్తుంచుకోవాలంటే వారు మనల్ని తరచూ కలుస్తూ ఉండాలి. వరుసగా ఓ పదేళ్లు కనబడకుంటే దాదాపు మరచిపోతాం. మానవులను మించి తమకు ప్రేమానురాగాలు ఉన్నాయంటూ నిరూపించాయి ఫ్లోరిడాలోని చింపాంజీలు. ఏకంగా 25 ఏళ్ల తర్వాత తమకు శిక్షణ ఇచ్చిన ట్రెయినీని మాత్రం మర్చిపోలేదు. తల్లిలా పెంచి పోషించిన ఆ శిక్షకురాలిని చూడగానే తమలో ప్రేమానురాగాలను ఆనంద భాష్పాల రూపంలో చూపిస్తూ.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాయి. మూగ సైగలతో తమ ప్రేమను చాటుకున్నాయి. ప్రయోగాల కోసం... సాధారణంగా శాస్త్రవేత్తలు మానవులకు వచ్చే పలు రోగాలకు సంబంధించి ఏ ఒక్క మందును కనిపెట్టినా మొదటగా చింపాంజీలపై ప్రయోగిస్తారు. ఇప్పటివరకు కనుగొన్న మందుల్లో 95 శాతం వీటిపై ప్రయోగించినవే. దీనికి కారణం చింపాంజీల డీఎన్ఏ 98.8 శాతం మానవుల డీఎన్ఏను పోలి ఉండడం. 1974 వచ్చిన హెపటైటిస్ వ్యాధికి పరిశోధకులు మందు కనిపెట్టారు. దీన్ని చింపాంజీలపై ప్రయోగించేందుకు అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఓ ల్యాబరేటరీని ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని చింపాంజీలను బంధించి వాటికి ఆవాసం కల్పించారు. వీటిపై పరిశోధన చేస్తున్న సమయంలోనే వాటిని బయటి ప్రపంచంలో ఎలా బతకాలో నేర్చించేందుకు కొంత మంది శిక్షకులను నియమించారు. వీరిలో దక్షిణ ఫ్లోరిడాకు చెందిన‘ లిండా కోబనార్’ కూడా ఉన్నారు. అప్పటికే కోబనార్ జంతువుల ప్రవర్తన విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. చింపాంజీలపై పరిశోధనతో పాటు శిక్షణ కూడా ఆరేళ్ల పాటు కొనసాగింది. ఈ సమయంలో కోబనార్ చింపాంజీలను ఎంతో ప్రేమగా చూసేవారు. వాటికి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలను సమయానుసారంగా అందించేది. ఆప్యాయతగా వాటికి పాలు పట్టించేది. ఆరేళ్ల అనంతరం హెపటైటిస్పై చేసిన ప్రయోగం విజయవంతమవడంతో వాటికి లాబరేటరి నుంచి విముక్తి లభించింది. అనంతరం ఫ్లోరిడాలోని అటవీ ప్రాంతంలో చింపాజీలు ఉండేందుకు ఓ విశాలమైన ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. లూసియానాకు పయనం చింపాజీలకు శిక్షణ అనంతరం కోబనార్ అక్కడి నుంచి అమెరికాకు దక్షిణాగ్రంలో ఉన్న లూసియానా రాష్ట్రానికి వెళ్లిపోయింది. జంతువులపై తనకు ఉన్న ప్రేమానురాగాలతో అక్కడ కూడా ఓ చింపాంజీ అభయారణ్యం పేరుతో మరికొన్ని చింపాజీలను పెంచింది. అలా నాలుగేళ్లపాటు వాటి ఆలనాపాలనా చూసింది. అనంతరం చింపాజీలపై 1998లో కోబనార్ ఓ చిత్రాన్ని నిర్మించింది. విస్డమ్ వరల్డ్ పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రంలో సమాజంతో ఎలా మెలగాలి అనే విషయం మానవులు చింపాజీల నుంచి తెలుసుకోవచ్చని తెలియజేశారు. ఈ జంతువులు మనుషుల్లాగానే ప్రేమానురాగాలను పంచుకుంటాయని ఈ చిత్రంలో చూపించారు. గుర్తున్నానా? దాదాపు 25 ఏళ్ల అనంతరం కోబనార్ ఫ్లోరిడాలోని చింపాజీల ఆవాసానికి వెళ్లాల్సి వచ్చింది. గతంలో ఆమె శిక్షణ ఇచ్చిన చింపాంజీల్లో కొన్ని అక్కడ ఉన్నాయి. చాలా ఏళ్లు గడవడంతో కోబనార్ వాటిని దూరం నుంచే చూడాలనుకుంది. మీకు నేను గుర్తున్నానా? అంటూ వాటిని పలకరించింది. వెంటనే అక్కడ ఉన్న స్వింగ్ అనే చింపాజీ కోబనార్ వైపుకు దూసుకువచ్చింది. దాని ముఖంలో నవ్వులు విరజిమ్ముతూ కోబనార్ దగ్గరకు వచ్చి ఆమె రెండు చేతులను పట్టుకుంది. నన్ను గుర్తుపట్టావా? అని కోబనార్ మళ్లీ అనడంతో ఒక్క సారిగా తన రెండు చేతులతో ఆమెను కౌగిలించుకొని తన మనసులోని ప్రేమను వెలుబుచ్చింది. కోబనార్ ఎంతో ఆనందంతో ఆ చింపూని బిగ్గరగా ఆలింగనం చేసుకుంది. స్వింగ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన ‘డాల్’ అనే మరో చింపాజీ కూడా కౌగిలించుకొని ఆనంద భాష్పాలు కురిపించింది. 25 ఏళ్ల తర్వాత తనను గుర్తు పెట్టుకుని ప్రేమగా కురిపించడంతో కోబనార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. (25 ఏళ్ల క్రితం ఫోటో) -
జూ సిబ్బందికి చుక్కలు చూపించిన చాచా
టోక్యో: జపాన్‌లో ఓ చింపాంజీ జూ అధికారులకు చుక్కలు చూపించింది. తనను బంధించి ఉంచిన నెట్‌కు పెద్ద కన్నం చేసి అందులో నుంచి పారిపోయింది. అనంతరం ఒక పెద్ద విద్యుత్ స్తంభాన్ని ఎక్కి కూర్చుని వెర్రికూతలు కూయడం ప్రారంభించింది. తొలుత జూలో నుంచి చింపాంజీ తప్పిపోయినట్లు జూ ఉద్యోగులు ఉన్నతాధికారులకు చెప్పడంతో శరవేగంగా కదిలారు. సెండాయ్ లోని యాగియామా అనే పెద్ద జూపార్క్ ఉంది. అందులో చాచా అనే ఓ చింపాంజీ ఉంది. అది గురువారం సాయంత్రం అధికారుల కళ్లు గప్పి తెలివిగా తప్పించుకుంది. దీంతో ఉలిక్కిపడిన అధికారులు కిందా మీదా పడ్డారు. సీసీటీవీ ఫుటేజీలో చూడగా అది ఒక పెద్ద కరెంటు స్తంభం ఎక్కినట్లు గుర్తించారు. తర్వాత దానిని కిందికి దించేందుకు ఎంత ప్రయత్నించినా వినకపోగా వారిపై కోపంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. బాణం లాంటిదాంతో దాని వీపుపై గుచ్చగా దాన్ని లాక్కొని కిందపడేసి విద్యుత్ తీగల గుండా తప్పింకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అది జారి కింద అప్పటికే సిద్ధం చేసి ఉంచిన బోనులో పడిపోయింది. ఈ క్రమంలో దానికి స్వల్పగాయాలయ్యాయి. కాగా, అసలు చాచా తప్పించుకునేందుకు గల కారణాలు, సిబ్బంది నిర్లక్ష్యంపై చర్చించేందుకు శుక్రవారం ఆ జూను మూసివేశారు.