చింపాంజీతో జీవా | Jiiva's next movie will feature a live chimpanzee | Sakshi
Sakshi News home page

వినోదాల విందుకు చింపాంజీతో జీవా

Published Sat, Dec 30 2017 7:55 AM | Last Updated on Sat, Dec 30 2017 7:55 AM

Jiiva's next movie will feature a live chimpanzee - Sakshi

తమిళసినిమా: చింపాంజీతో కలిసి వినోదాల విందునివ్వడానికి నటుడు జీవా సిద్ధం అవుతున్నారు. ఆయనతో వర్ధమాన నటి శాలినిపాండే జోడి కడుతోంది. కీ చిత్రంతో త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతున్న నటుడు జీవా తాజా చిత్రానికి రెడీ సిద్ధం అయిపోతున్నారు. ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ పతాకంపై విజయరాఘవేంద్ర హైయస్ట్‌ కామెడీ థ్రిల్లర్‌ కథతో భారీ వ్యయంతో నిర్మించినున్న ఈ చిత్రానికి గోరిల్లా అనే టైటిల్‌ను నిర్ణయించారు. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి ఫేమ్‌ శాలినిపాండే నాయకిగా నటించనున్న ఇందులో నిజ చింపాంజీ టైటిల్‌ పాత్రలో నటించనుంది. దీనికి డాన్‌శాండి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ చింపాంజీలు చాలా తెలివిగా, జాలీగా ఉండడానికి కారణం వాటి అల్ల రితనమేనన్నారు.

అలాంటి ఇతివృత్తంతో రూపొందించనున్న చిత్రం గెరిల్లా అని వివరించారు. ఇందులో జీవా, శాలినిపాండే హీరోహీరోయిన్లుగా నటించనుండగా థాయ్‌లాండ్‌కు చెందిన చింపాంజీ ముఖ్య పాత్రలో నటించనుందని తెలిపారు. ఈ చింపాంజీకి థాయ్‌లాండ్‌లోని సాముట్‌ అనే సంతు శిక్షణ కేంద్రంలో నాలుగు నెలల పాటు శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. హాలీవుడ్‌ చిత్రాలు హెంగోవర్‌–2, ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ వంటి చిత్రాల్లో నటించిన చింపాంజీలు ఈ కేంద్రంలోనే శిక్షణ పొందాయన్నది గమనార్హం. గెరిల్లా చిత్రం పూర్తి వినోదాత్మకంగానూ, అదే సమయంలో చాలా థ్రిల్లింగ్‌గానూ ఉంటూ ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తారని అన్నారు. చిత్ర షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనికి విక్రమ్‌వేదా చిత్రం ఫేమ్‌ శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement