Chimp Washes Man's Hand After He Feeds It Water. Anand Mahindra Shares Viral Video - Sakshi
Sakshi News home page

Anand Mahindra: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

Published Mon, Aug 21 2023 8:14 PM | Last Updated on Mon, Aug 21 2023 8:34 PM

Chimpanzee washes man hand after drinking water viral video - Sakshi

Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ట్విటర్ వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'మండే మోటివేషన్' అనే ట్యాగ్‌తో తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. ఈ క్లిప్ గత వారం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఆఫ్రికా కామెరూన్‌లోని ఒక చింపాంజీ నీరు త్రాగడానికి ఫోటోగ్రాఫర్‌ సహాయం కోరింది. నీరు తాగిన తరువాత ఈ వ్యక్తి చేతులను శుభ్రంగా కడిగేసింది. ఇది చాలా ఉపయోగకరమైన లెసన్ అంటూ.. మీరు విజయం సాధించాలనుకుంటే, మీ సంఘంలోని వారికి సహాయం చేయండి, మద్దతు ఇవ్వండి.. వారు తిరిగి మీకు సపోర్ట్ చేస్తారు అని రాసాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది ఈ వీడియోని లైక్ చేయగా.. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. నిజంగా ఈ సంఘటన ఎందోమంది మనసు దోచింది. దీనికి ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయాడంటే.. ఈ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement