కరోనా: చేతులు కడుక్కున్న చింపాంజీ | Coronavirus: Chimpanzee Washing Her Hands With Brush Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘సాండ్రాను చూస్తే ముచ్చటేస్తుంది’

Published Thu, Apr 2 2020 11:33 AM | Last Updated on Thu, Apr 2 2020 12:12 PM

Chimpanzee Washing Her Hands With Brush Video Goes Viral - Sakshi

కరోనా వైరస్‌ దరిచేరకుండా ఉండేందుకు చేతులను ఇలా శుభ్రం చేసుకోవాలంటూ ఓ చింపాంజీ అవగాహన కల్సిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యూకేలోని ఓ జూకు చెందిన ఈ చింపాంజీ పేరు సాండ్రా. ఈ ఒరంగుటాంగ్ తన చేతులను సబ్బు నీళ్లలో బ్రష్‌తో శుభ్రం చేసుకుంటున్న వీడియోను ఓ ట్విటర్‌ యూజర్‌ బుధవారం రాత్రి షేర్‌ చేశాడు.

’ఆ జూలో పని చేస్తున్న సిబ్బంది కోవిడ్‌-19 నేపథ్యంలో తరచూ చేతులు కడుక్కోవడం చూసి  సాండ్రా కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవడం ప్రారంభించింది’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 3.2 మిలియన్ల వ్యూస్‌ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘ఓ కోతిని చూసి మరో కోతి నేర్చుకుంది’, ‘సాండ్రా చేతులను శుభ్రం చేసుకుంటున్న తీరు చూస్తే ముచ్చటేస్తుంది... ఇది ఎంత ముద్దుగా ఉందో’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌  పెడుతున్నారు. (ఏపీలో 132కి చేరిన కరోనా కేసులు!)
‘ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు’

కాగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని అరికట్టేందుకు మందు లేకపోవడంతో ముందు జాగ్రత్తలు చర్యలే విరుగుడు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ), వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా కోవిడ్‌-19 బారిన పడకుండా ఉండేందుకు తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, సామాజిక  దూరం పాటించాలంటూ సెలబ్రెటీలు సైతం అవగాహన చర్యలు చేపడుతున్నారు. (మర్కజ్‌ : ఈశాన్యానికి పాకిన విషపు వైరస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement