ఐకమత్యం మనుషుల కంటే జంతువుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటి ప్రేమ నిస్వార్థంతో కూడుకున్నది. ఈ విషయాలు ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే వస్తున్నాయి. అంతేకాదు వాటి విశ్వసనీయతకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా థాయ్‌లాండ్ నుంచి అలాంటి ఓ సీన్.. ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చింది.
చూపు లేని ఓ ఏనుగుకు ఆహారం కోసం మరో ఏనుగు దారి చూపించడం ఆ వీడియోలో ఉంది. ఎలిఫెంట్ నేచర్ పార్క్ ఫౌండర్ లెక్ ఛాయ్‌లెర్ట్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ప్లాయ్ థాంగ్‌కు చూపు లేదు. కానీ, చనా దాని బాగోగులన్నీ చూసుకుంటోంది. ఈ వీడియోలో దానిని ఆహారం వైపు తీసుకెళ్తోంది. ప్రతీరోజూ ఇలా మనసుకి సంతోషాన్ని కలిగించే దృశ్యాన్ని నేను చూస్తున్నా. ఈ మూగజీవాల నిస్వార్థమైన ప్రేమ.. మనకూ ఒక పాఠం కావాలి’ అని పోస్ట్ చేశారు.
ఇక మరో పాత వీడియో సైతం ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. ప్రముఖ ప్రైమటాలజిస్ట్ జేన్ గుడ్‌ఆల్.. ఓ చింపాజీని కొందరి సాయంతో రక్షించగా, అది తిరిగొచ్చి ఆమెను ఆప్యాయంగా హత్తుకుంది. 2014లో వైరల్ అయిన ఈ పాత వీడియో ట్విటర్ ద్వారా మరోసారి తెర మీదకు రావడం విశేషం.
Love has no limits. Watch the unconditional love of this chimpanzee to the people who rescued and helped her get back to the woods. Before she leaves, she beautifully expresses her gratitude to the team and Dr Jane Goodall.
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 14, 2021
Today is #WorldChimpanzeeDay 🎐 pic.twitter.com/FhC5ir3la9
Comments
Please login to add a commentAdd a comment