
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో బోలెడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన డివైజ్‌లు, మిషీన్‌లు మరో ఏడాదికల్లా అదనపు ఫీచర్లతో కస్టమర్లను పలకరిస్తున్నాయి. తాజాగా టచ్ ప్యానెల్, వాయిస్ కంట్రోల్‌తో ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్ (Washing Machine) మార్కెట్లోకి వచ్చేసింది. ఈ తరహా టెక్నాలజీతో రావడం భారత్‌లో ఇదే తొలిసారి.
ఈ వాషింగ్ మెషీన్‌ను హోమ్ అప్లయెన్సెస్, కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్ సంస్థ హయర్(Haier) విడుదల చేసింది. ప్రత్యేకంగా ఇందులో ఏఐ డైనమిక్ బ్యాలన్స్ సిస్టమ్, ఇన్‌బిల్ట్ వాయిస్ కంట్రోల్, డైరెక్ట్ మోషన్ మోటర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంది.
డైరెక్ట మోషన్ మోటార్
అదిరిపోయే ఫీచర్లు
కొత్త వాషింగ్ మెషీన్‌లో ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్ మోషన్ మోటార్ ఉంది. ఇది గణనీయంగా మెషిన్ వైబ్రేషన్‌ని తగ్గిస్తుంది, తద్వారా మిషన్ సౌండ్ లేకుండా పని చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫీచర్ మెషీన్ లైఫ్‌టైంను కూడా పెంచుతుంది. ఇందులో 30పైగా వాషింగ్ ప్రోగ్రామ్‌లతో డిజైన్ చేయబడింది. పాటు వివిధ రకాల బట్టలను సునాయాసంగా వాష్ చేసేస్తుంది. అదనంగా హై-ఎఫిషియన్సీ ABT (యాంటీ బాక్టీరియల్ టెక్నాలజీ) ఉంది. ఇందులోని డిటర్జెంట్ డిస్పెన్సర్‌ను శుభ్రంగా ఉంచుతుంది.
యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ
డ్యూయల్ స్ప్రే టెక్నాలజీ, బ్యాక్టీరియా, అలెర్జీ కారకాలను సమర్థవంతంగా తొలగించే పూరిస్టీమ్ ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా కస్టమర్లు ఇంట్లో ఎక్కడ నుంచైనా ఇచ్చే ఆదేశాలతో ఈ వాషింగ్ మెషీన్‌ను కంట్రోల్ చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మార్కెట్లో 10కేజీల దీని ధర రూ.96వేల వరకు ఉంది.
చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ!
Comments
Please login to add a commentAdd a comment