కాలువలో మహిళ గల్లంతు | one women sliipped in to canal | Sakshi
Sakshi News home page

కాలువలో మహిళ గల్లంతు

Published Thu, Oct 6 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

one women sliipped in to canal

తీపర్రు (పెరవలి) : కాలువలో దుస్తులు ఉతకడానికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తూ అందులో పడి గల్లంతైంది. స్థానికుల కథనం ప్రకారం.. పెరవలి మండలం తీపర్రుకు చెందిన పోలవరపు పద్మావతి(38) బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి వద్ద ఉన్న నరసాపురం కాలువలో దుస్తులు ఉతకడానికి వెళ్లింది. రేవులో నాచు పట్టి ఉండటం వల్ల ప్రమాదవశాత్తూ కాలుజారి కాలువలో పడింది. స్థానికులు కాలువలో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో మధ్యాహ్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెరవలి ఎస్సై పి.నాగరాజు ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కాలువ దిగువన ఉన్న పోలీసుస్టేçÙన్లకు సమాచారం ఇచ్చారు. కాలువ వెంబడి గాలింపు చేపట్టామని చెప్పారు.  పద్మావతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఇటీవల వివాహం చేశారు. పద్మావతి భర్త నాగరాజు కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.  
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement