తమిళసినిమా: సాధారణంగా డబ్బులు పొదుపు చేసుకోవడానికి, అవసరమైనప్పుడు వాడుకోవడానికి బ్యాంకులను ఉపయోగిస్తుంటాం. అలాంటిది ఇప్పుడు సినిమా దర్శక నిర్మాతల కోసం ఒక కథల బ్యాంకు ప్రారంభమైంది. స్క్రిప్ట్ టిక్ పేరుతో గీత రచయిత మదన్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధనుంజయన్ కలిసి నెలకొల్పారు. ఈ బ్యాంకును ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా శనివారం ఉదయం ప్రారంభించారు. ప్రతిభావంతులైన రచయితల కథనాలను చదివి వాటిలో మంచి కథలను ఎంపిక చేసి చిత్ర నిర్మాణానికి సిద్ధం చేసి దర్శక నిర్మాతలకు అందించే విధంగా ఏర్పాటు చేసిన కొత్త ప్రయత్నమే ఈ బ్యాంక్ అని వెల్లడించారు.
ప్రస్తుతం వస్తున్న చాలా చిత్రాల్లో కథ, కథనాలు సరిగ్గా ఉండడం లేదన్నారు. అందుకే చాలా వరకు చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రతిభావంతులైన కథా రచయితలు, దర్శకులు, నిపుణులు అందించిన కథలతో చిత్రాలు చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతారని అన్నారు. అలాంటి ప్రయత్నంతోనే ఈ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పలువురు ప్రతిభావంతులైన రచయితలను ప్రోత్సహించడం, వారికి తగిన పారితోషికాన్ని అందించడం తమ లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. నిర్మాతలు పలు కథలను విని వాటిలో ఒకటి, రెండు ఎంపిక చేసుకోవడం కాకుండా మంచి కథ మాత్రమే చదివి చిత్రాలు చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. అదే విధంగా తక్కువ సమయంలో పలు చిత్రాలు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి మంచి కథలను అందించడమే తమ స్క్రిప్ట్ టిక్ బ్యాంకు ఉద్దేశమని పేర్కొన్నారు.
Creative initiative 👏#SCRIPTick - India's First Script Bank launched by @offBharathiraja sir -
— Ajay Srinivasan (@Ajaychairman) February 11, 2023
Will be valuable for script Writers & Producers
Best wishes@madhankarky @Dhananjayang @karundhel @onlynikil@scriptickindiahttps://t.co/0upoHpY9x7
https://t.co/3Gf8E7Td9u pic.twitter.com/o2HdMaPtP7
Comments
Please login to add a commentAdd a comment