గుర్తుపెట్టుకుని మరీ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన తారక్‌ | Jr NTR Celebrates His Fitness Trainer Birthday | Sakshi
Sakshi News home page

Jr NTR: ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ బర్త్‌డే.. కేక్‌ కట్‌ చేయించిన యంగ్‌ టైగర్‌

Published Fri, Apr 19 2024 7:09 PM | Last Updated on Fri, Apr 19 2024 7:18 PM

Jr NTR Celebrates His Fitness Trainer Birthday - Sakshi

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌తో అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ పంచిన ఆయన ప్రస్తుతం దేవర సినిమాతో ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో వార్‌ 2 మూవీలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మీదునియాలో టాక్‌ నడుస్తోంది.

బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన తారక్‌
షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ బర్త్‌డే గుర్తుపెట్టుకుని మరీ సెలబ్రేట్‌ చేశాడు. ఈ విషయాన్ని హీరో ట్రైనర్‌ కుమార్‌ మన్నవ సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనలయ్యాడు. 'నా పుట్టినరోజు గుర్తుపెట్టుకున్నారు. నేను ఎలాంటి ఫుడ్‌ తింటానో తెలుసుకుని ఆరోగ్యకరమైన కేక్‌ తీసుకొచ్చారు. పెద్ద స్టార్‌ అయినప్పటికీ ఎంతో ఒదిగి ఉంటారు.

మీ గురించి ఏమని చెప్పను..
మీరు నాపై, నా కుటుంబంపై చూపించే ప్రేమకు.. మన అనుబంధానికి ఉప్పొంగిపోయాను. మీ గురించి ఏమని చెప్పను.. వినయ విధేయతకు, ప్రేమకు మీరు నిలువెత్తు నిర్వచనం. మీతో కలిసి పని చేయడం సంతోషంగా భావిస్తున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మా అన్న బంగారం.. అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: చాలాసార్లు కడుపులోనే బిడ్డను కోల్పోయిన అమీర్‌ ఖాన్‌ మాజీ భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement