బెంగుళూరు : పార్క్‌కు జాగింగ్ చేద్దామని వచ్చిన ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్ దంపతులకు చేదు అనుభవం ఎదురైన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మహిళ ధరించిన దుస్తులపై అభ్యంతరం తెలుపుతూ నానా రభస చేశాడు. అయితే ఆ దంపతులు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న బందువుకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బెంగుళూరులోని జేపీ పార్క్‌కు ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఒక మహిళ తన భర్తతో కలిసి జాగింగ్‌కు వచ్చింది. ఆమె జిమ్‌లో ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన వార్మ్‌ప్ ప్రారంభించగా, తన భర్త జాగింగ్‌కు వెళ్లాడు. తన వార్మప్ పూర్తయిన తర్వాత స్వెటర్‌ను విప్పేసి ఆమె భర్త కోసం ఎదురుచూస్తుంది. కాగా సదరు మహిళ ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్ కావడంతో తన వర్కౌట్లను ఆమె భర్త వీడియాలు తీసి యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటాడు.
ఇదే సమయంలో టూ వీలర్‌పై ఒక యాబై ఏళ్ల వయసున్న వ‍్యక్తి పార్క్‌కి వచ్చాడు. మహిళ వేసుకున్న దుస్తులను గమనించి తన బండిని పార్క్ చేసి ఆ వ్యక్తి మహిళ దగ్గరకు వచ్చాడు. 'ఇలాంటి దుస్తులు వేసుకొని ఎవరైనా పార్క్‌కు వస్తారా.. ఇది క్లబ్ కాదు ప్యామిలీలు వచ్చే చోటు' అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మహిళ భర్త వ్యక్తి దగ్గరకు వచ్చి తన భార్య ఏమి అభ్యంతరకరమైన దుస్తులు వేసుకోలేదని పేర్కొన్నాడు. అయితే ఇదేమి వినకుండా సదరు వ్యక్తి వారిద్దరిపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యంగా మాట్లాడాడు.అంతటితో ఊరుకోకుండా పక్కనున్న వారి దగ్గరికి వెళ్లి మహిళ వేసుకొచ్చిన దుస్తులపై చర్చించాడు.
అయితే ఇదే విషయమై మహిళ మాట్లాడుతూ.. 'ఒక ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా నేను వేసుకొచ్చిన దుస్తులు అంత అసభ్యకరంగా ఏమి లేవు. అయినా ఇన్ని రోజులుగా పార్క్‌కు వస్తున్నా ఎవరు తన దుస్తులపై అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి ఎందుకలా ప్రవర్తించాడో మాకు అర్థం కాలేదంటూ' తెలిపారు. ఆ వ్యక్తి ప్రవర్తనపై సదరు మహిళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న బందువుకు తెలిపింది. దీంతో అతను ఈ విషయాన్ని డీసీపీ ఎన్ శశికుమార్‌కు చెప్పడంతో పోలీసులు వెళ్లి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. అయితే ఆ వ్యక్తి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణ చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండానే వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment