Dress Style
-
ఇలాంటి డ్రెస్ వేసుకొని పార్క్‌కు వస్తారా?
బెంగుళూరు : పార్క్‌కు జాగింగ్ చేద్దామని వచ్చిన ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ దంపతులకు చేదు అనుభవం ఎదురైన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మహిళ ధరించిన దుస్తులపై అభ్యంతరం తెలుపుతూ నానా రభస చేశాడు. అయితే ఆ దంపతులు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బందువుకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బెంగుళూరులోని జేపీ పార్క్‌కు ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఒక మహిళ తన భర్తతో కలిసి జాగింగ్‌కు వచ్చింది. ఆమె జిమ్‌లో ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన వార్మ్ప్ ప్రారంభించగా, తన భర్త జాగింగ్‌కు వెళ్లాడు. తన వార్మప్ పూర్తయిన తర్వాత స్వెటర్‌ను విప్పేసి ఆమె భర్త కోసం ఎదురుచూస్తుంది. కాగా సదరు మహిళ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ కావడంతో తన వర్కౌట్లను ఆమె భర్త వీడియాలు తీసి యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటాడు. ఇదే సమయంలో టూ వీలర్‌పై ఒక యాబై ఏళ్ల వయసున్న వ్యక్తి పార్క్‌కి వచ్చాడు. మహిళ వేసుకున్న దుస్తులను గమనించి తన బండిని పార్క్ చేసి ఆ వ్యక్తి మహిళ దగ్గరకు వచ్చాడు. 'ఇలాంటి దుస్తులు వేసుకొని ఎవరైనా పార్క్‌కు వస్తారా.. ఇది క్లబ్ కాదు ప్యామిలీలు వచ్చే చోటు' అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మహిళ భర్త వ్యక్తి దగ్గరకు వచ్చి తన భార్య ఏమి అభ్యంతరకరమైన దుస్తులు వేసుకోలేదని పేర్కొన్నాడు. అయితే ఇదేమి వినకుండా సదరు వ్యక్తి వారిద్దరిపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యంగా మాట్లాడాడు.అంతటితో ఊరుకోకుండా పక్కనున్న వారి దగ్గరికి వెళ్లి మహిళ వేసుకొచ్చిన దుస్తులపై చర్చించాడు. అయితే ఇదే విషయమై మహిళ మాట్లాడుతూ.. 'ఒక ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా నేను వేసుకొచ్చిన దుస్తులు అంత అసభ్యకరంగా ఏమి లేవు. అయినా ఇన్ని రోజులుగా పార్క్‌కు వస్తున్నా ఎవరు తన దుస్తులపై అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి ఎందుకలా ప్రవర్తించాడో మాకు అర్థం కాలేదంటూ' తెలిపారు. ఆ వ్యక్తి ప్రవర్తనపై సదరు మహిళ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న బందువుకు తెలిపింది. దీంతో అతను ఈ విషయాన్ని డీసీపీ ఎన్ శశికుమార్‌కు చెప్పడంతో పోలీసులు వెళ్లి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. అయితే ఆ వ్యక్తి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణ చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండానే వివాదం సద్దుమణిగింది. -
ఆడవాళ్ల భుజాలను కూడా వదలరా!
లండన్ : 'హలో... మీరు చేసే కామెంట్లకు సమాధానాలిచ్చే తీరిక నాకు లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేనేమీ మందుతాగి పార్లమెంట్‌కు రాలేదు. హ్యాంగోవర్లో కూడా లేను. అలాగని టీనేజ్ అమ్మాయిని కూడా కాను. బిడ్డకు పాలిచ్చే తల్లినీ అంతకన్నా కాను. నేనేమి చెత్తకుప్ప నుంచి లేచి రాలేదు. నాకేం తెలుసు? ఆడవాళ్ల భుజాలు చూసినా ఉద్రేకానికి గురవుతారని'' అంటూ 59 ఏళ్ల ట్రేసీ బ్రాబిన్ తన ట్విటర్లో పెట్టిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ట్రెసీ బ్రాబెన్.. బ్రిటన్ పార్లమెంటులో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. కాగా రెండురోజుల కిందట బ్రెగ్జిట్ పై చర్చలో భాగంగా పార్లమెంటులో జరిగిన చర్చలో ఆమె అద్భుతంగా మాట్లాడారు. అయితే ఆ సమయంలో ట్రెసీ ధరించిన డ్రెస్ భుజాల నుంచి జారిపోవడం, ఆ ఫొటోలు వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. 'ఒక బాధ్యత గల ఎంపీగా ఇలాంటి బట్టలేసుకుని పార్లమెంట్ కు రావొచ్చా? భుజాలను చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించడం ఏం బాలేదు' అంటూ ట్రోలర్లు ట్రెసీపై విరుచుకుపడ్డారు.( ట్రోల్స్‌కు బదులిచ్చిన ఎంపీ నుస్రత్ జహాన్) Hello. Sorry I don’t have time to reply to all of you commenting on this but I can confirm I’m not.... A slag Hungover A tart About to breastfeed A slapper Drunk Just been banged over a wheelie bin. Who knew people could get so emotional over a shoulder... 🙄 https://t.co/sTWWiEY2TF — Tracy Brabin MP 🌹 (@TracyBrabin) February 4, 2020 నెటిజన్ల వేధింపులు విపరీతంగా పెరిగిపోవడంతో ఎంపీ ట్రెసీ బాబ్రెన్ తన ట్విటర్ వేదికగా వారికి ఘాటుగానే సమాధానమిచ్చారు. స్పీకర్ పిలవడంతో సడెన్ గా నిలబడ్డానని, సభలో తాను మాట్లాడే విషయం అందరికీ వినబడాలన్న ఉద్దేశంతో మైక్ ముందుకు వంగానని, దాంతో డ్రెస్ కొంచెం స్లిప్ అయిందని తెలపారు. అంతమాత్రానికే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఎంపీ వివరించారు. మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులకు ఇదొక ఉదాహరణ అని చెప్పారు. కాగా గతేడాది భారత పార్లమెంటులోనూ ఇలాంటి సందర్భమే ఒకటి చోటుచేసుకుంది. తృణముల్ కాంగ్రెస్ నుంచి కొత్తగా ఎన్నికైన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తిలు జీన్స్, మోడ్రన్ డ్రెస్సుల్లో లోక్ సభకు రావడం, వాళ్లపై ట్రోలర్లు విరుచుకుపడటం, వారు కూడా అదే స్థాయిలో తిప్పికొట్టడం తెలిసిందే.(‘ఇరుకు’ మాటలు) -
అసమాన అందం
అసమానం అంటే సమానంగా లేకపోవడం. ఇది డిజైనర్ దుస్తులకు బాగా నప్పే విషయం. ధరించే డ్రెస్ డిజైన్ ఎంత హెచ్చు తగ్గులుగా ఉంటే ఆ స్టైల్ అంత ఆకర్షణీయంగా కనిపిస్తుందనేది నేటితరం ఆలోచన. ఆ ఆసక్తిని బట్టి పాశ్చాత్య ఫ్రాక్ డిజైన్స్ మాత్రమే కాదు మన దేశీయ సంప్రదాయ దుస్తుల్లోనూ ఈ స్టైల్‌ని చూపిస్తున్నారు డిజైనర్లు. ఈ అసమాన స్టైల్స్ క్యాజువల్ వేర్‌గానే కాదు సంగీత్, రిసెప్షన్ వంటి పార్టీలకూ కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. సేమ్ కలర్ కట్ పువ్వుల బుటీస్ వచ్చేలా ఎంబ్రాయిడరీ చేసిన గులాబీ రంగు రాసిల్క్ టాప్‌కి, నెటెడ్ మెటీరియల్‌ని జత చేసి డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. స్కర్ట్ పార్ట్‌ని అసిమెట్రిక్స్టైల్లో డిజైన్ చేశారు. లేయర్డ్ స్టైల్ మూడు సమాన లేయర్స్ తీసుకొని అసమానంగా డిజైన్ చేశారు శారీని. ఇది కుచ్చులతో డిజైన్ చేసినది కాదు. అసిమెట్రిక్ కట్‌తో శారీ డిజైన్‌లో తెచ్చిన స్టైల్. కుచ్చులున్న లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్, నడుము దగ్గర బెల్ట్‌ను జత చేస్తే ఈ చీరకట్టు అసమానమైన అందంతో ఆకట్టుకుంటుంది. ఇండోవెస్ట్రన్ రా సిల్క్ పెప్లమ్ బ్లౌజ్‌కి చెక్స్ వచ్చేలా స్వీక్వెన్స్, గోల్డ్ బీడ్స్, జర్దోసీ మిక్సింగ్‌తో వర్క్ చేశారు. దీనికి బాటమ్‌గా శాటిన్ పెన్సిల్ ప్యాంట్(ధోతీ ప్యాంట్) ధరించడంతో ఇండోవెస్ట్రన్ స్టైల్ వచ్చింది. దీనికి జార్జెట్ అసిమెట్రిక్ స్టైల్లో దుపట్టా జత చేశారు. శారీ కట్టు పింక్ ఆరెంజ్ షేడ్ స్వీకెన్స్ శారీని బ్లాక్ బ్లౌజ్‌తో జత చేసి ఈ చీరకట్టులోనే అసిమెట్రిక్ స్టైల్ తీసుకువచ్చారు. బ్లౌజ్‌ని కాలర్ నెక్‌తో పాటు స్ప్రింగ్స్ ఇచ్చి కర్దానా స్టైల్లో డిజైన్ చేసి అంతా చమ్కీ వర్క్‌తో మెరిపించారు. ఎడమవైపు ఫుల్‌గా చీరతో కవర్ చేసి, కుడివైపు చేతికి కొంగును రోల్ చేశారు. సింగిల్ స్లీవ్ బ్లౌజ్ చీరకట్టు సాధారణమే. ప్లెయిన్ శారీ ఏదైనా సింగల్ షోల్డర్ వెల్వెట్ బ్లౌజ్ ఎంపిక ఆకర్షణీయంగా ఉంటుంది. వెల్వెట్ క్లాత్కి ఎంబ్రాయిడరీ చేసి ఒక చేతికి మాత్రమే ఫుల్ స్లీవ్ ఇవ్వడం ఈ బ్లౌజ్ ప్రత్యేకత. అలా ఒక చేతికి ఫుల్ స్లీవ్, మరో చేతికి స్లీవ్‌లెస్‌తో అసిమెట్రిక్ స్టైల్‌ను ఇచ్చారు. స్లీవ్‌లెస్ అసౌకర్యంగా ఉందని భావించేవారికోసం ప్లెయిన్ జార్జెట్ క్లాత్‌ని కుడివైపు నుంచి ఎడమవైపు బ్లౌజ్లోకి సెట్ చేశారు. దీంతో ఒక భిన్నమైన లుక్ వచ్చింది. చీరకట్టులో ఇదొక అసిమెట్రిక్ స్టైల్. అంచు చీరలను కూడా ఇలా డ్రేప్ బ్లౌజ్‌తో అందంగా కట్టుకోవచ్చు. సంగీత్, రెసిప్షన్, పుట్టిన రోజు వంటి వేడుకలకూ ఈ స్టైల్ బాగుంటుంది. కాంట్రాస్ట్ షేడ్స్ కాలర్‌నెక్ ఉన్న ఎల్లో ఆర్గాంజా, లైట్ బ్లూ, హాఫ్‌వైట్ షేడ్స్ ప్యాటర్న్‌తో అసిమెట్రిక్ స్టైల్ ప్యాటర్న్‌ని డిజైన్ చేశారు. ఇది గెట్ టు గెదర్ పార్టీలకు నప్పే డ్రెస్. – తులసి, డిజైనర్ లగ్జరీ కొచ్చర్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఇన్‌స్ట్రాగ్రామ్: tulasidesignofficial -
అబ్బాయిల నేత్రానందం నాకు ముఖ్యం కాదు!
మంచి డ్రెస్ వేసుకున్న తర్వాత పదే పదే నిలువుటద్దంలో చూసుకుని మురిసిపోతుంటారు కొంతమంది. ఈ టైప్ అమ్మాయిలు తమ ఆత్మానందం కోసం మాత్రమే డ్రెస్సులు వేసుకుంటారు. కొంతమంది అమ్మాయిలు మాత్రం ఇతరుల నేత్రానందం కోసం బట్టలు వేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా అబ్బాయిల కోసం ప్రత్యేకంగా డ్రెస్ చేసుకునే అమ్మాయిలు లేకపోలేదు. శ్రుతీహాసన్ మాత్రం ఈ టైప్ కాదు. ఆ విషయం గురించి ఈ బ్యూటీ చెబుతూ - ‘‘నాకు స్టైల్‌గా ఉండటం ఇష్టం. వెరైటీ డ్రెస్సులు ట్రై చేయడానికి ఏమాత్రం వెనకాడను. అబ్బాయిల కోసం మాత్రం డ్రెస్ చేసుకోను. అందమైన బట్టలు వేసుకుని వాళ్లను ఆకర్షించాలని అనుకోను. బయటకు వెళ్లినప్పుడు షాపింగ్ మాల్స్‌లో పెద్ద పెద్ద అద్దాలు కనిపిస్తాయి కదా.. వాటిలో నా ప్రతిబింబం చూసుకోవడానికి డ్రెస్ చేసుకుంటాను. ఇంట్లో అద్దాలుంటాయ్. కానీ, బయట కనిపించే స్టోర్ అద్దాల్లో నన్ను చూసుకోవడం నాకిష్టం. అందుకే డ్రెస్ చేసుకునేటప్పుడు అద్దాలను కూడా గుర్తు పెట్టుకుంటాను. ఆ సంగతలా ఉంచితే.. డ్రెస్సింగ్ అనేది మన అభిరుచికి తగ్గట్టుగా ఉండాలి. ఇతరులు ఏమనుకుంటారో? అని ఆలోచించకూడదు. మనకు సౌకర్యంగా అనిపించే బట్టలు ఇతరులకు చూడ్డానికి బాగాలేకపోయినా వేసుకోవాలి’’ అన్నారు.