లండన్ : 'హలో... మీరు చేసే కామెంట్లకు సమాధానాలిచ్చే తీరిక నాకు లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేనేమీ మందుతాగి పార్లమెంట్‌కు రాలేదు. హ్యాంగోవర్‌లో కూడా లేను. అలాగని టీనేజ్ అమ్మాయిని కూడా కాను. బిడ్డకు పాలిచ్చే తల్లినీ అంతకన్నా కాను. నేనేమి చెత్తకుప్ప నుంచి లేచి రాలేదు. నాకేం తెలుసు? ఆడవాళ్ల భుజాలు చూసినా ఉద్రేకానికి గురవుతారని'' అంటూ 59 ఏళ్ల ట్రేసీ బ్రాబిన్ తన ట్విటర్లో పెట్టిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ట్రెసీ బ్రాబెన్.. బ్రిటన్ పార్లమెంటులో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. కాగా రెండురోజుల కిందట బ్రెగ్జిట్ పై చర్చలో భాగంగా పార్లమెంటులో జరిగిన చర్చలో ఆమె అద్భుతంగా మాట్లాడారు. అయితే ఆ సమయంలో ట్రెసీ ధరించిన డ్రెస్ భుజాల నుంచి జారిపోవడం, ఆ ఫొటోలు వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. 'ఒక బాధ్యత గల ఎంపీగా ఇలాంటి బట్టలేసుకుని పార్లమెంట్ కు రావొచ్చా? భుజాలను చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించడం ఏం బాలేదు' అంటూ ట్రోలర్లు ట్రెసీపై విరుచుకుపడ్డారు.( ట్రోల్స్‌కు బదులిచ్చిన ఎంపీ నుస్రత్ జహాన్)
Hello. Sorry I don’t have time to reply to all of you commenting on this but I can confirm I’m not....
— Tracy Brabin MP 🌹 (@TracyBrabin) February 4, 2020
A slag
Hungover
A tart
About to breastfeed
A slapper
Drunk
Just been banged over a wheelie bin.
Who knew people could get so emotional over a shoulder... 🙄 https://t.co/sTWWiEY2TF
నెటిజన్ల వేధింపులు విపరీతంగా పెరిగిపోవడంతో ఎంపీ ట్రెసీ బాబ్రెన్ తన ట్విటర్ వేదికగా వారికి ఘాటుగానే సమాధానమిచ్చారు. స్పీకర్ పిలవడంతో సడెన్ గా నిలబడ్డానని, సభలో తాను మాట్లాడే విషయం అందరికీ వినబడాలన్న ఉద్దేశంతో మైక్ ముందుకు వంగానని, దాంతో డ్రెస్ కొంచెం స్లిప్ అయిందని తెలపారు. అంతమాత్రానికే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఎంపీ వివరించారు. మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులకు ఇదొక ఉదాహరణ అని చెప్పారు. కాగా గతేడాది భారత పార్లమెంటులోనూ ఇలాంటి సందర్భమే ఒకటి చోటుచేసుకుంది. తృణముల్ కాంగ్రెస్ నుంచి కొత్తగా ఎన్నికైన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తిలు జీన్స్, మోడ్రన్ డ్రెస్సుల్లో లోక్ సభకు రావడం, వాళ్లపై ట్రోలర్లు విరుచుకుపడటం, వారు కూడా అదే స్థాయిలో తిప్పికొట్టడం తెలిసిందే.(‘ఇరుకు’ మాటలు)
Comments
Please login to add a commentAdd a comment