లండన్ : అదేంటి ఎప్పుడు కూల్‌గా ఉంటూ ఏ విషయంలో తలదూర్చని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నెటిజన్లపై మండిపడుతున్నారేంటి అనుకుంటున్నారా! అయితే మీరు పొరబడ్డట్లే. అసలు విషయం ఏంటంటే.. పాకిస్థాన్ మూలాలున్న బ్రిటీష్ బాక్సర్ ఆమిర్‌ఖాన్ తన భార్య, పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్‌లో షేర్ చేశారు. 'మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు నా కుటుంబసభ్యులతో ఆనందంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నా. ఖాన్ ఫ్యామిలీ నుంచి మీ అందరికి మరోసారి #మెర్రీ క్రిస్‌మస్' అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
అయితే దీనిపై స్పందించిన అతని ఫాలోవర్స్ ఆమిర్‌ను తప్పుబడుతున్నారు. ఒక ముస్లిం అయి ఉండి క్రైసవుల పండుగను ఎలా జరుపుకుంటారని ఆమిర్‌ను దుమ్మెత్తిపోశారు. దీంతో ఆమిర్ ఖాన్ స్పందిస్తూ.. 'మీరు పెట్టిన కామెంట్స్ నాకు ఆశ్చర్యం కలిగించాయి. మతం అనే బేషజాలు లేని ఒక వ్యక్తిగా నేను అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు జరుపుకున్నాము. కానీ దీనిని మీరందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే నేను మీ అందరిని మనస్పూర్తిగా ద్వేషిస్తున్నా' అంటూ రీట్వీట్ చేశారు.
So shocked by all the hate I’m getting on my Twitter & instagram for wishing everyone Merry Christmas and posting a picture with my family in Christmas outfits. Just want to tell those people ‘I don’t give a f**k’
— Amir Khan (@amirkingkhan) December 26, 2019
బ్రిటీష్ బాక్సర్‌గా పేరు పొందిన ఆమిర్ ఖాన్ గత కొంతకాలంగా గాయంతో బాధపడుతూ రింగ్‌లోకి దిగలేదు. అయితే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో బరిలోకి దిగనున్నట్లు ఇంతకు ముందే మీడియాకు వెల్లడించాడు. కాగా 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో లైట్ వెయిట్ విభాగంలో ఆమిర్ దేశానికి సిల్వర్ మెడల్‌ను అందించాడు. కాగా, 33 ఏళ్ల ఆమిర్ ఖాన్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నట్లు ఇదివరకే స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment