ట్విటర్
లండన్ : ఫేస్‌బుక్కే కాదు... ట్విటర్ కూడా తమ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను మరో కంపెనీకి అమ్ముకుందట. ఖాతాదారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే ట్విటర్ కూడా కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కంపెనీకే సమాచారాన్ని అమ్ముకుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేగాక ఫేస్‌బుక్ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన అలెగ్జాండర్ కోగన్‌కే ట్విటర్ ఈ డేటాను విక్రయించినట్లు సండే టెలిగ్రాఫ్ అనే పత్రిక తన కథనంలో పేర్కొంది. దాని ప్రకారం.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన అలెగ్జాండర్ కోగన్.. ‘పర్సనాలిటీ క్విజ్’ యాప్‌ను తయారుచేశాడు. ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ కావాలి.
అలా దాదాపు 8.7కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను కోగన్ సేకరించి కేంబ్రిడ్జ్ అనలిటికాకు అందించాడు. కాగా.. కోగన్‌కు సొంతంగా గ్లోబల్ సైన్స్ రీసెర్చ్(జీఎస్‌ఆర్) అనే సంస్థ ఉంది. ఈ సంస్థ ద్వారా ట్విటర్ నుంచి యూజర్ల డేటాను తీసుకున్నాడు. ఇందుకోసం 2015లో జీఎస్‌ఆర్ సంస్థకు ట్విటర్ వన్‌టైం అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ యాక్సెస్ కల్పించింది. 2014 డిసెంబరు నుంచి 2015 ఏప్రిల్ వరకు యూజర్ల పబ్లిక్ ట్వీట్ల రాండమ్ శాంపిల్ కోసం ఒకరోజు యాక్సెస్ కల్పించామని ట్విటర్ కూడా అంగీకరించింది. ఈ సమయంలోనే ఖాతాదారుల వ్యక్తిగత సమాచారమంతా జీఎస్‌ఆర్‌కు చేరిఉంటుంది. ఈ సమాచారం కోసం జీఎస్‌ఆర్ తమకు కొంత మొత్తాన్ని కూడా చెల్లించినట్లు ట్విటర్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment