నటి, మోడల్ పార్వతీ నాయర్‌కు సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ మలమాళీ ముద్దుగుమ్మ. తాజాగా మాల్దీవులకు వెళ్లిన భామ అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో జిమ్ ట్రైనర్ మైఖేల్‌తో కలిసి పార్వతీ చేసిన రొమాంటిక్ స్టంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో మైఖేల్‌తో కలిసి ఓ వీడియో తీస్తుండగా, అతను సడెన్‌గా పార్వతిని గాల్లోకి పైకెత్తాడు. దీంతో షాక్ అయిన నటి..ఇది సడెన్ సర్‌ప్రైజ్ అంటూ ఆ వీడియోను షేర్ చేసింది. ట్రైనర్ మైఖేల్ సైతం ఈ వీడియోను షేర్ చేస్తూ..సడెన్‌గా ఆమెను లిఫ్ట్ చేయగానే పార్వతీ చాలా షాకింగ్‌కి గురయ్యిందని చెప్పుకొచ్చాడు. కాగా గత కొన్ని రోజులుగా పలువురు సెలబ్రిటీలు హాలీడే ట్రిప్ పేరుతో మాల్దీవులకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభిస్తున్నా ఏమాత్రం భాద్యత లేకుండా సెలబ్రిటీలు ఇలా విహారయాత్రలకు వెళ్లడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
చదవండి : అల్లు అర్జున్‌ను దారుణంగా అవమానించిన దిల్ రాజు!
అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్
Comments
Please login to add a commentAdd a comment