మలయాళ హీరోయిన్ పార్వతి నాయర్‌పై కేసు నమోదైంది. దొంగతనం నెపంతో తనపై దాడి చేసిందని ఆమె పనిమనిషి సుభాష్ చంద్రబోస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పార్వతితోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే?
సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి కేజేఆర్ స్టూడియోలో హెల్పర్‌గా పని చేసేవాడు. 2022 నుంచి పార్వతి నాయర్ ఇంట్లో పనిమనిషిగా చేరాడు. అదే ఏడాది అక్టోబర్‌లో చెన్నైలోని పార్వతి నాయర్ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షలు విలువైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. తన పనిమనిషి సుభాషే ఈ దొంగతనం చేశాడని పార్వతి ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సుభాష్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత కొద్దిరోజులకు అతడిని విడుదల చేశారు.
స్టూడియోలో రభస
తర్వాత సుభాష్.. తిరిగి కేజేఆర్ స్టూడియోలో పనిలో చేరాడు. అయితే స్టూడియోలోనే ఉన్న పార్వతి తనను కొట్టిందని ఆరోపించాడు. ఆమెతోపాటు ఉన్న మరో నలుగురు వ్యక్తులు తనను తీవ్రంగా దుర్భాషలాడారని చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సైదాపేట్ 19 ఎమ్‌ఎమ్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు పార్వతితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
సినిమా..
కాగా మలయాళ కుటుంబానికి చెందిన పార్వతి సొంతభాషలోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. పాప్పిన్స్, స్టోరీ కాతే, డి కంపెనీ, యాంగ్రీ బేబీస్ ఇన్ లవ్, ఉత్తమ విలన్, వాస్కోడిగామ, కొడిత్త ఇదంగళై నిరప్పుగ, 83, ధూమం, గోట్.. తదితర చిత్రాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment