
గెట్ రెడీ ఫర్ క్రిస్ గెతిన్ వర్కవుట్స్
వరల్డ్ ఫేమస్ ఫిట్‌నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ ఇండియాలో తన వర్కవుట్లకు హైదరాబాద్‌ను ఎంచుకున్నారు.
దేశంలో తొలి జిమ్ నగరంలో ఏర్పాటు
ఈ నెల 14న బంజారాహిల్స్‌లో ప్రారంభానికి సన్నాహాలు
హైదరాబాద్: వరల్డ్ ఫేమస్ ఫిట్‌నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ ఇండియాలో తన వర్కవుట్లకు హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. దేశంలో తొట్టతొలి అత్యాధునిక జిమ్‌ను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో విశాల సముదాయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమెరికాకు చెందిన గెతిన్ బాలీవుడ్ బాయ్స్ రణబీర్‌కపూర్, హృతిక్ రోషన్, జాన్ అబ్రహం, అర్జున్‌కపూర్‌లతో పాటు టాలీవుడ్ స్టార్ మహేష్‌బాబులకు పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాకు చెందిన గెతిన్ హెల్దీ ఫిట్‌నెస్‌లో డైనమిక్ ట్రాన్స్‌మిషన్ ప్రిన్సిపుల్ విధానంతో అనేక అద్భుతాలు సొంతం చేసుకున్నారు. ఫిట్‌నెస్, కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్, కోర్ ఫిట్‌నెస్ విభాగాలతో పాటు సాలిడ్ న్యూట్రిషన్ అడ్వైజ్ చేయటం గెతిన్ ప్రత్యేకత.
నగరంలో 14న ప్రారంభం...
పూర్తి అధునాతన టెక్నాలజీ, సదుపాయాలతో నిర్మించిన జిమ్‌ను ఈ నెల 14న ప్రారంభించనున్నారు. మరింత మందికి హెల్దీ లైఫ్‌ను అందించాలన్న ఏకైక లక్ష్యంతోనే క్రిస్ గెతిన్ హైదరాబాద్‌ను ఎంచుకున్నాడని అతని సన్నిహితుడు, ఇంటర్నేషనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ సతీష్ పర్యాద చెప్పారు.