
జిల్లాలో గతంలో నిత్యం వాడకం 20 లక్షల పైమాటే
కానీ బర్డ్‌ఫ్లూ భయంతో 10 లక్షలకు పడిపోయిన వైనం
గుడ్లవల్లేరు: కోడిగుడ్డు వాడకాలు సగానికి పడిపోయాయి. జిల్లాలో నిత్యం కోడిగుడ్ల వినియోగం 20 లక్షల పైమాటే ఉండేది. కానీ బర్డ్‌ఫ్లూతో 10 లక్షలకు వాడకాలు పడిపోయాయి. గతంలో రిటైల్‌లో గుడ్డు ధర రూ.7 ఉండేది. అదే కోడిగుడ్డు ధర రూ.4.30కు పడిపోయింది. బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్‌తో పాటు కోడిగుడ్లను తినకూడదన్న ప్రచారం బాగా కొనసాగుతుంది. దీంతో గుడ్డుకు ఉండే మాత్రం డిమాండ్ తగ్గిపోయింది. జిల్లాలో నిత్యం ఈ కోడిగుడ్ల వినియోగం 20లక్షల పైమాటే ఎప్పుడూ ఉంటుంది. గతంలో ఒక్కో కోడి గుడ్డు ధర రూ.5 నుంచి రూ.6 ఉండేది. అది కాస్తా....రూ.7కు పెరిగిపోయింది. ఇప్పుడైతే బర్డ్‌ఫ్లూతో రూ.4.50కు దిగజారింది. 30 గుడ్లు ఉండే ఒక్కో ట్రే గుడ్లను ప్రాంతాలను బట్టి రూ.135 నుంచి రూ.15 0వరకు మార్కెట్లో వ్యాపారులు అమ్ముతున్నారు.
బర్డ్‌ఫ్లూ భయంతో....
బర్డ్‌ఫ్లూతో జిల్లాలో కోడిగుడ్ల వాడకం 10 లక్షలకు పడిపోయింది. తిరువూరు, గంపలగూడెంలో బర్డ్‌ఫ్లూ కలకలంతో మరింత ఆందోళన అధికమైంది. గతంలో జిల్లాలో గుడ్ల వాడకం 20 లక్షల పైమాటే ఉండేది. జిల్లాలోని ప్రజలతో పాటు హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్ల వినియోగం కూడా బర్డ్‌ఫ్లూతో తగ్గిపోయింది. అలాగే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో వాడకం కూడా నానాటికీ దిగజారిపోతుంది. వీటిలో గుడ్ల వాడకం గతంలో ప్రతి స్నాక్స్ కోటింగ్‌కు వినియోగించటంతో పాటు ఫ్రైడ్‌రైస్ తయారు చేసే ఆ చెఫ్‌కు ఎగ్స్ లేకుండా వంట అనేది ముందుకు వెళ్లేదే కాదు. కానీ ఇపుడు చికెన్‌తో పాటు గుడ్డు లేకుండా ఉన్న స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్‌నే కస్టమర్స్ ఎక్కువగా అడుగుతున్నారని ఆ రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. గుడ్డుకు ఇలాగే డిమాండ్ తగ్గితే ఇపుడు ఒక్కో గుడ్డు రూ.4.50 ఉండటంతో ఆగిపోకుండా మరింతగా దిగజారిపోయే అవకాశం ఉందని వ్యాపారులు సతమతమవుతున్నారు.
గుడ్డు హ్యాపీగా తినవచ్చు
బర్డ్‌ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో తప్ప గుడ్డును నిత్యం ఎలా ఆరోగ్యానికి వినియోగిస్తారో...అలాగే తినవచ్చు. కానీ ఆరగ్యోం కోసం పచ్చి గుడ్లను తాగేవాళ్లు కొన్నాళ్లు ఆ అలవాటుకు అడ్డుకట్ట వేయాలి. బర్డ్‌ఫ్యూ ప్రభావం తగ్గేంత వరకు కొన్ని జాగ్రత్తలతో గుడ్లను తింటే ఆరోగ్యానికి మంచిది. సగం ఉడికించిన (హాఫ్ బాయిల్డ్) గానీ, సరిగా ఉడకని ఆమ్లెట్ గానీ తినకూడదు. చలికాలంలో గుడ్లను తినటంతో శరీరానికి ఎక్కువగా వెచ్చదనం వస్తోంది.
– డాక్టర్ ఎ.లక్ష్మీనారాయణ,వెటర్నరీ ఏడీ గుడ్లవల్లేరు
Comments
Please login to add a commentAdd a comment