సహజ కాంతి... | Natural light ... | Sakshi
Sakshi News home page

సహజ కాంతి...

Published Thu, Sep 19 2013 12:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

సహజ కాంతి...

సహజ కాంతి...

పండ్లు, కూరగాయలు, వాటి నుంచి వచ్చే నూనెలను సౌందర్య లేపనాలుగా ఉపయోగిస్తే చర్మం సహజకాంతితో మెరిసిపోతుంది.
 
 దానిమ్మ:
 చర్మం ముడతలు పడనివ్వని యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ దానిమ్మలో పుష్కలం. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ -సి సమృద్ధిగా ఉన్న దానిమ్మ ఓట్స్ లేదా పెరుగుతో కలిపితే మేలైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది. మలినాలను, మృతకణాలను తొలగించడమే కాదు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
 
 తయారి: 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు, కప్పు ఓట్స్ కలిపి మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమా న్ని ఒక గిన్నెలోకి తీసుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఐదు నిమిషాలు ఉంచి, కడిగేయాలి.
 
 స్ట్రాబెర్రీ:
 విటమిన్ -సి సహజ సిద్ధమైన యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ గల స్ట్రాబెర్రీ మాస్క్ వల్ల రెట్టింపు అందాన్ని పొందవచ్చు. ఎండకు కమిలిన, మృతకణాలున్న చర్మాన్ని సాధారణస్థితికి తీసుకువచ్చి యవ్వనకాంతిని పెంచుతుంది.
 
 తయారి: కప్పుడు తాజా స్ట్రాబెర్రీలను మిక్సర్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. దీంట్లో కప్పు పెరుగు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మెత్తటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవచ్చు.
 
 పెరుగు:
 పెరుగు వల్ల జీర్ణకోశానికి మేలు కలుగుతుంది.


 తయారి: కప్పుడు పెరుగు, 2-3 చుక్కల బాదంనూనె, టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా తయారవుతుంది.
 
 తేనె:
 ఫేసియల్ ట్రీట్‌మెంట్‌లో తేనెను మించిన మాయిశ్చరైజర్ లేదని చెప్పవచ్చు. పొడి చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది.
 
 తయారి: చిన్న గిన్నెలో తగినంత తేనె తీసుకొని, సన్నని మంట మీద మరిగించాలి. పూర్తిగా చల్లారాక (వేలికి అద్దుకొని వేడిని పరీక్షించాలి) ముఖమంతా రాసుకోవాలి. పదిహేను నిమిషాలు ఉంచి, వెచ్చని నీటితో తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. చర్మం కాంతిగా, మృదువుగా మారుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement