పండ్లు తిన్న తర్వాత సాధారణంగా తొక్కలను పారేస్తుంటాం. కానీ ఆ తొక్కల్లో ఫైబర్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. దానిమ్మ పండు విషయానికి వస్తే.. దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనారోగ్యంతో ఉన్నవారికి దివ్య ఔషధం దానిమ్మ.
ఎన్నో సమస్యలను ఈ పండు నయం చేస్తుంది. దానిమ్మ పండే కాదు, తొక్క కూడా చాలా ఉపయోగకరం. దీనిలో యాంటిఆక్సిడెంట్స్ ,ఫినోలిక్ యాసిడ్స్,ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. అసలు దానిమ్మ తొక్క ప్రయోజనాలు తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దానిమ్మను ఇష్టపడతారు. దానిమ్మలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్-సి, కె, బి, ఎ ఇందులో పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలోని గుణాలు గుండెసమస్యలు, హైపర్ టెన్షన్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక దానిమ్మ గింజల్లోనే కాదు, తొక్కలోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్నే కాదు, అందాన్ని కూడా పెంచుతుంది. దానిమ్మ రసం కంటే తొక్కలో 50శాతం అదిక మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు
► దానిమ్మ తొక్కల్లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
► చర్మ క్యాన్సర్‌ని తగ్గించడంలో దానిమ్మ తొక్కలు బాగా పనిచేస్తాయి. హానికరమైన యూవీఏ కిరణాల నుంచి ఇది రక్షిస్తుంది. దానిమ్మ తొక్కలతో పొడి చేసుకొని దాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది.
► దానిమ్మ తొక్కలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల చక్కెర స్థాయిలను తగ్గించి బరువును కంట్రోల్‌లో ఉంచేలా చేస్తుంది.
► దానిమ్మ తొక్కలను మరిగించి ఆ రసాన్ని తాగితే కీళ్లనొప్పలు, గొంతునొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
► దానిమ్మలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. దానిమ్మ తొక్కల రసాన్ని మహిళల్లో పీరియడ్స్ సమస్య తగ్గిపోతుంది.
► దానిమ్మ తొక్కలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి...తొక్కలను శుభ్రంగా కడిగి రసం తీసి తాగితే , ఆరోగ్యానికి మంచిది.
► కప్పు నీటిలో టీస్పూను దానిమ్మ పొడి, అరచెక్క నిమ్మరసం వేసి తాగినా మంచిదే.
దానిమ్మ పొడి చేసుకోండిలా..
దానిమ్మ గింజలను తిని తొక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తొక్కలను ఎండలో ఆరబెట్టాలి. చక్కగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడిచేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి.
దానిమ్మతో అందం, మొటిమలు మాయం
- టేబుల్‌స్పూను దానిమ్మ పొడిలో అరటేబుల్ స్పూను నిమ్మరసం, అరటేబుల్ స్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు స్క్రబ్బర్‌లా రుద్ది కడగాలి. ఈ స్క్రబర్ వల్ల మృతకణాలు , ట్యాన్ తొలగి ముఖ చర్మం మృదువుగా మారుతుంది.
- దానిమ్మ తొక్కలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే.. దానిమ్మ పొడిలో కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది.
- వయస్సురీత్యా వచ్చే ముడతలను కూడా దానిమ్మ తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఈ పొడిని రాసుకుంటే మార్పు మీకే కనిపిస్తుంది.
- కొబ్బరినూనెలో దానిమ్మ తొక్కలను కలపి వేడిచేసి చల్లారాక తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది.
- దానిమ్మ తొక్కలు చర్మం pHని సమతుల్యం చేస్తుంది. తేమగా ఉంచుతంది.
- చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. హానీకరమైన యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment