What If I Eat Pomegranate At Night? | Pomegranate Seeds Health Benefits In Telugu - Sakshi
Sakshi News home page

Pomegranate Seeds: దానిమ్మ రాత్రిపూట తినకూడదా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Published Fri, Aug 4 2023 4:40 PM | Last Updated on Fri, Aug 4 2023 5:04 PM

Do You Know What Happens If You Take Pomegranate Seeds At Night - Sakshi

దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, విటమిన్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ పండులో మెండుగా ఉంటాయి. సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తాయి.

రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఈజీగా పెరుగుతాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచే దానిమ్మ పండ్లు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అన్నది ఇప్పుడు చూద్దాం.  


చూడటానికి ఆకర్షణీయంగా ఉండే దానిమ్మ గింజల్లో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. మీకు తెలుసా? ఒక దానిమ్మ పండులో సుమారు 600 వరకు గింజలు ఉంటాయట. క దానిమ్మ పండులో 7 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 30 శాతం విటమిన్ సి, 16 శాతం ఫోలేట్ మరియు 12 శాతం పొటాషియం ఉంటాయి. ఒక కప్పు దానిమ్మపండులో 24 గ్రాముల చక్కెర మరియు 144 కేలరీల శక్తి కూడా ఉంటుంది. రెండు వారాల పాటు రోజూ 150 మి.లీ దానిమ్మ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది.

రక్తహీనతతో బాధపడేవాళ్లకు దానిమ్మను మించిన ఔషధం లేదు. యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే దానిమ్మ తింటే రక్తకణాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా దానిమ్మ పండ్లతో జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుందని తేలింది. క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకుంటే అల్జీమర్స్ వ్యాధిని నివారించొచ్చని వైద్యులు చెబుతున్నారు. 

దానిమ్మతో ఆ సమస్యలు దూరం
► చలికాలంలో దానిమ్మ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
► దానిమ్మలో యంటీ ఏజింగ్‌ గుణాలు మెండుగా ఉంటాయి. 
► దానిమ్మ రక్తంలో ఐరన్‌ను డెవలప్‌ చేస్తుంది. ఇది హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచుతుంది.
► ఇందులోని ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ రాడికల్స్‌ను నివారిస్తుంది.
► నిత్యం దానిమ్మ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. 
► వృద్దాప్యాన్ని దారితీసే ప్రీ రాడికల్స్‌ నుంచి కాపాడి, యవ్వనంగా ఉంచేలా చేస్తుంది. 
► దానిమ్మ గింజల్లో విటమిన్‌  బి, సి, కెతో పాటు పొటాషియం, కాల్షియం వంటి పలు రకాల మినరల్స్‌ మెండుగా ఉంటాయి. 
► మలబద్దకం, ఒబెసిటీ వంటి సమస్యలను దానిమ్మ దూరం చేస్తుంది. 

దానిమ్మతో అందం

  • దానిమ్మ తినడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
  • రోజూ కప్పు దానిమ్మ గింజలు తినడం వల్ల స్కిన్‌టోన్‌ మెరుగవుతుంది
  • విటమిన్స్‌, పీచు అధికంగా ఉంటుంది. ఇవి చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి
  • దానిమ్మ పండులో ఉన్న ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌ చర్మం తేమ కోల్పోకుండా నివారిస్తుంది.
  • చర్మంపై ఉండే జిడ్డు, మొటిమలను శక్తివంతంగా తగ్గించడంలో దానిమ్మ సూపర్‌ ఫ్రూట్‌.
  • వివిధ చర్మ సమస్యలను దూరం చేయడంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది.


దానిమ్మ రాత్రిపూట తినొచ్చా?
చాలామంది రాత్రిపూట దానిమ్మ తింటే జలుబు చేస్తుందని, కఫం ఏర్పడుతుందని అనుకుంటారు. కానీ ఒట్టి అపోహ మాత్రమే. రాత్రి పడుకునే ముందు దానిమ్మ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్‌ దానిమ్మ జ్యూస్‌లో ఒక టీ స్పూన్‌లో అల్లం వేసుకొని తాగితే కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు కూడా ధృడంగా తయారవుతాయి. నిద్రించే ముందు దానిమ్మను పెరుగు తీసుకుంటే నాణ్యమైన నిద్రపడుతుంది. రాత్రిపూట దానిమ్మను తింటే ఉదయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement