ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం మాత్రమే కాదు, నిద్ర కూడా అంత కంటే ఎక్కువే అవసరం. ఈ చలికాలంలో సాధారణం కంటే ఎక్కువ గంటలు నిద్రపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మందపాటి దుప్పటి ఉంటేనే హాయిగా నిద్రపడుతుంది. అయితే చలికాలంలో బట్టలు లేకుండా నగ్నంగా పడుకోవడం వల్ల మీ అందం మరింత రెట్టింపు అవుతుందని మీకు తెలుసా?
దీనివల్ల అనేక చర్మ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చట. చలికి బట్టలు లేకుండా పడుకోవడమంటే చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ఈ కాలంలో నగ్నంగా నిద్రించడం వల్ల నిజంగానే అన్ని లాభాలున్నాయా చూసేద్దాం.
►శీతాకాలంలో వెచ్చదనాన్ని పొందడానికి పెద్ద పెద్ద దుప్పట్లను వేసుకొని నిద్రపోతుంటారు. అయితే వింటర్ సీజన్‌లో ఒంటిపై నూలిపోగు కూడా లేకుండా పడుకోవడం వల్ల బాగా నిద్రపట్టడంతో పాటు ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుందట.
► రాత్రిపూట బిగుతుగా ఉండే బట్టలు ధరించడం వల్ల చాలా మందిలో రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. దీని కారణంగా కొందరిలో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అదే నగ్నంగా నిద్రపోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
► నగ్నంగా నిద్రించడం వల్ల బాడీ టెంపరేచర్‌ను కూడా రెగ్యులేట్ చేస్తుందట. దీని వల్ల శరీరంలో అధిక చెమటను నివారించడంలో సహాయపడుతుంది
► వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాలను ఎదుర్కొనే శక్తి సహజంగానే శరీరం సంతరించుకుంటుందట.
► నగ్నంగా పడుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్, పోషకాల స్థాయిలు కూడా పెరుగుతాయి. దీనివల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుందట.అంతేకాకుండా ముడతలు, వృద్దాప్య సంకేతాలను నివారిస్తుంది.
► నిద్రలేమి సమస్యకు కూడా ఇది మంచి పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
► నగ్నంగా నిద్రించడం వల్ల మీరు ఎక్కువ కేలరీలను కూడా కరిగిస్తుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
► అంతేకాకుండా కొన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కూడా శరీరాన్ని కాపాడుతుంది.
► నగ్నంగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment