
ఆహార పథ్యాలు, వ్యాయామాలతోనే కాకుండా కొన్ని రకాల చిట్కాలని అనుసరించడం ద్వారా కూడా సన్నగా, నాజూకుగా కనపడవచ్చు. అదెలాగంటే ఫ్యాషన్ అనేది స్టైల్’గా మాత్రమే కాకుండా నాజూగ్గా... అందంగా కనపడేలా కూడా చేస్తుంది. ఇందుకోసం చేయవలసిందల్లా శరీరంలో మీకు సమస్యగా అనిపించే ప్రాంతాలను గుర్తించడమే– అది మీ నడుము భాగమా లేదా మీ తొడలలో లేదా మీ పిరుదులలో సమస్యగా ఉందా అన్నది తెలుసుకోవాలి.
ఇందుకోసం మీ గదిలో ఏకాంతంగా అద్దం ముందు నిల్చుని ప్రతి శరీర భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని, లోపాలను దాచి పెట్టుకోటానికి ప్రయత్నించాలి. లేదంటే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం తీసుకోవడంలో తప్పు లేదు. శరీరంలోని ఈ భాగాలు శరీరం కన్నా పెద్దగా కనపడకుండా చూసుకోవాలి.
మనం తీసుకునే ఆహారం శారీరక ఎదుగుదలకే కాదు, మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు మనసును నిరుత్సాహంగా మార్చితే, కొన్నిరకాల ఆహారాలు మనసును ఉత్తేజపరుస్తాయి. కార్బోహైడ్రేట్లు సెరోటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది ఫీల్‌గుడ్ హార్మోన్.
అందుకే మన రోజువారీ ఆహారంలో కార్బొహైడ్రేట్‌లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మితిమీరిన చక్కెర స్థాయులు లేని కార్బోహైడ్రేట్‌లను తీసుకోవడం మంచిది. తిన్న తర్వాత త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ఆహారానికి బదులుగా కూరగాయలు, బీన్స్, పొట్టు తీయని ధాన్యాలను తీసుకోవాలి.
క్యారట్ శరీరంలో రక్తాన్నే కాదు... ఆ రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని సర్వేలో తేలింది. క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలోనైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది.
ఆయుర్వేదం ప్రకారం భోజనం చివరిలో నెయ్యి, బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ సవ్యంగా సాగుతుంది. శరీరంలోని వ్యర్ధాలన్నీ బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా జీవశక్తి పెరుగుతుంది. నెయ్యి, బెల్లం రెండిట్లోనూ పోషక ప్రయోజనాలు ఎక్కువే. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఎముకల ఆరోగ్యాన్ని పెంచి, రోగనిరోధక శక్తిని కూడగడితే, బెల్లంలో మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
అందువల్ల భోజనానంతరం నెయ్యి, బెల్లం తినడం వల్ల శరీరానికి కావలసిన ఇతర ΄ోషకాలు పుష్కలంగా అందుతాయి. ΄ోషకాహార లోపం రాకుండా శరీరం సవ్యంగా పనిచేస్తుంది. అయితే, తినమన్నారు కదా అని పెద్ద పెద్ద ముక్కలు తినేయకూడదు. చిన్న ముక్క తింటే చాలు.
(చదవండి: సిట్ రైట్: సరిగ్గా కూర్చుందాం ఇలా..!)
Comments
Please login to add a commentAdd a comment