పిండం మెదడు ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేసే ఓ ఆరోగ్య సమస్యను దానిమ్మ రసంతో నివారించొచ్చని బ్రైగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంట్రాయుటేరియన్ గ్రోత్ రిస్ట్రిక్షన్(ఐయూజీఆర్)అని పిలిచే ఈ సమస్య ప్రతి పదిమంది పిల్లల్లో ఒకరిని పీడిస్తుంది.
పిండానికి ఆక్సిజన్‌తో పాటు ఇతర పోషకాలను అందించే ఉమ్మనీటిలో తేడాలుంటే వచ్చే ఐయూజీఆర్‌కు దానిమ్మతో చెక్ పెట్టొచ్చని అధ్యయనంలో రుజువైంది. దానిమ్మలో పుష్కలంగా ఉండే పాలీఫినాల్స్ మెదడు వరకు నేరుగా ప్రవేశించగలవని ఇప్పటికే రుజువైన నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు.
ఐయూజీఆర్ సమస్య ఉన్న 78 మంది గర్భిణులను ఎంచుకుని వారిలో సగం మందికి కాన్పు వరకు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం అందించారు. మిగిలిన వారికి పాలీఫినాల్స్ లేని జ్యూస్ అందించారు. అందరి కాన్పుల తర్వాత పిల్లలను పరిశీలించగా.. దానిమ్మ రసం తీసుకున్న తల్లుల పిల్లల మెదళ్లలోని కనెక్షన్లు బలంగా ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment