Peel
-
బొప్పాయి తొక్కలతో అందం, ఆనందం
ఆరోగ్యం కోసం అనేక రకాల పండ్లను తినడం మనకు అలవాటు. పండ్లతోనే పండ్ల తొక్కలతో కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి బొప్పాయి తొక్కలు. రుచికి, మంచిపోషకాలకు పెట్టింది పేరు బొప్పాయి. కానీ ఆ పండ్ల తొక్కల్లో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. సౌందర్య పోషణలో బాగా ఉపయోగపడతాయి.బొప్పాయి పండు లోనే కాదు బొప్పాయి తొక్కలోనూ ఎన్నో పోషకాలు లభిస్తాయి. బొప్పాయి పీల్స్‌లో క్రూడ్ ప్రొటీన్, క్రూడ్ ఫైబర్, క్రూడ్ ఫ్యాట్, యాష్ కంటెంట్, తేమ, కార్బోహైడ్రేట్, ఫ్యాటీ యాసిడ్, ఎనర్జీ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బీ1, విటమిన్ బీ2, విటమిన్ బీ3, విటమిన్ బీ6, విటమిన్ బీ12 ,విటమిన్ సీ వంటి విటమిన్లు , ఖనిజాలను కూడా ఉంటాయి. పండిన బొప్పాయి తొక్కలు కాల్షియం, పొటాషియం, ఐరన్ కూడా లభిస్తాయి. అందుకే సౌందర్య పోషణ ఉత్పత్తులో దీన్ని విరివిగా వాడతారు. అలాగే ఇంట్లో సహజంగా ఫేస్‌ప్యాక్‌లా కూడా వాడుకోవచ్చు. ఇవి చర్మ ఆరోగ్యానికి ,చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సాయపడతాయి.పండిన బొప్పాయి తొక్కల్ని శుభ్రంగా కాడిగి, మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రోజ్‌వాటర్ పెరుగు బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి , మెడకుప్యాక్లా వేసుకుని, ఆరిన తరువాత కడిగేసుకోవాలి. కనీసం పండిన బొప్పాయి ముక్కల్ని ముఖంపై సున్నితంగా రుద్దు కొని, ఆరిన తరువాత చల్లని నీళ్లతో కడుక్కున్నా ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. టాన్ పోతుంది. ప్రెష్‌గా, ప్రకాశవంతంగా మారుతుంది. బొప్పాయి తొక్కలతో అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లోఒకటి దాని ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణం అలాగే ఇందులోని పపైన్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది. బొప్పాయిలో లైకోపీన్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, తొందరగా వృద్ధాప్య చాయలు రాకుండా కాపాడతాయి. -
పూల మొక్కలకి ఈ ఎరువు ఇవ్వండి : ఇక పువ్వులే పువ్వులు!
మిద్దె తోటలు, చిన్న చిన్న బాల్కనీలోనే మొక్కల్ని పెంచడం ఇపుడు సర్వ సాధారణంగా మారింది. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు పచ్చని ఆకులు, పువ్వులతో కళ కళలాడుతూ ఉండే మొక్కలు, మనం కుండీలలోకి మార్చగానే పెద్దగా పూయవు. సరికదా ఎదుగుదల లేకుండా, ఉండిపోతాయి. ఇలా ఎందుకు ఉంటాయో తెలుసా? వాటికి సరైన పోషణ లేక పోవడమే ముఖ్య కారణం. మరి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా, మన ఇంట్లోనే సులభంగా దొరికే వాటితో చక్కటి ఎరువును తయారు చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం.ఎలాంటి మొక్క అయినా దాని సహజ లక్షణం ప్రకారం పువ్వులు పూయాలన్నా,కాయలు కాయాలన్నా తగిన ఎండ, నీటితోపాటు పోషకాలు కూడా కావాలి. పొటాషియం,ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు మొక్కల పునరుత్పత్తి సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా అరటి తొక్కల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. అరటి తొక్కల్లో ఇవన్నీ లభిస్తాయి. బనానా పీల్ ఫెర్టిలైజర్ ద్వారా మొక్కల్లో పూలు, పండ్లు ఎక్కువగా రావడమే కాదు, పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయి. తొక్కల్లోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. View this post on Instagram A post shared by Life’s Good Kitchen (@lifesgood_kitchen)ఎలా వాడాలి? అరటి పండు తొక్కలను నేరుగా మొక్కల మధ్య మట్టిలో పాతిపెట్టవచ్చు. ఇది కొన్ని రోజులకు కుళ్లి, ఎరువుగా మారి మొక్కకు చక్కటి పోషకాన్ని అందిస్తుంది.అరటి పండు తొక్కలను వేడి నీటిలో బాగా మరిగించి,చల్లారిన తరువాత ఈ టీని కుండీకి ఒక గ్లాసు చొప్పున అందించాలి. ఇలా చేస్తు గులాబీ మొక్కలు నాలుగు రోజులకే మొగ్గలు తొడుగుతాయి.అరటి పళ్ల తొక్కలను ఒక బాటిల్‌వేసి, నీళ్లు పోసి, 24 గంటలు పులిసిన తరువాత, దీనికి కొద్దిగా నీళ్లు కలుపుకొని నేరుగా ఆ వాటర్‌ను మొక్కలకు పోయవచ్చు. లేదంటే బనానా తొక్కల్ని బాగా ఎండబెట్టి, పొడిగా చేసుకుని నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు.అరటి తొక్కలతో తయారు చేసిన ద్రావణం, టీ లేదా ఫెర్టిలైజర్‌ను ప్రతీ 4-6 వారాలకు మొక్కలకు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రపంచంలోనే అరటి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మనదేశంలో అరటిపండు వ్యర్థాలను వినియోగించుకుంటే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. సహజమైన సూక్ష్మజీవుల చర్యలు జరిగి నేలకూడా సారవంతమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన మొక్కలు ,దీర్ఘకాలిక స్థిరమైన పర్యావరణ వ్యవస్థ మన సొంతమవుతుంది. -
మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!
వేసవిలో మామిడి పండ్ల జాతర అన్నట్లుగా రకరకాల వెరైటీలు వస్తుంటాయి. మామిడి పండ్ల అంటే ఇష్టపడని వారెవరూ ఉంటారు చెప్పండి. అయితే మనం మామిడి పండ్ల తొక్కును పడేసి తినేస్తుంటాం. కానీ మామిడి పండ్ల తొక్కలో ఉన్నన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరెందులోనూ ఉండవని అంటున్నారు. అవేంటో చూద్దామా..!మామిడి తొక్కలో ఏ, సీ, కే, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం, ఫైబర్లు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫైనాల్స్లు ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, కేన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయని శాస్తవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు 2008లో ప్రచురితమైన ఓక్లహోమ్ స్టేట యూనివర్శిటీ అధ్యయనంలో మామిడి తొక్కలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే గాక బరువు కూడా అదుపలో ఉంటుందని తేలింది. ముఖ్యంగా నామ్ డాక్ మై, ఇర్వ్విన్ అనే రెండు మామిడి రకాల తొక్కలు శరీరంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. పండ్లును చక్కగా తినేశాక ఆ మామిడి తొక్కలను ఏం చేయాలనే కదా..! వాటిని పడేయకుండా చక్కగా రకరకాల రెసీపీలు చేసుకుని తినేయండి అని చెబుతున్నారు నిపుణులు. మామిడి తొక్కలతో చేసే రెసీపీలు ఏంటంటే..మామిడి తొక్క టీ: మామిడితొక్కలను చక్కగా నీటిలో ఉడికించి, కొంచెం తేనే, నిమ్మకాయ వేసుకుని టీ మాదిరిగా తాగితే ఆ టేస్టే వేరే లెవల్ అన్నట్లు ఉంటుంది. ఈ టీ వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అందుతాయి.మామిడి తొక్క ఊరగాయ: తొక్కతోపాటు ముక్కలు చేసుకుని ఉప్పులో ఊరబెట్టి, రోజ ఎండలో ఆరనియాలి. ఇలా వాటిలో నీరు మొత్తం ఇంకిపోయేలా ఆరనిచ్చి చక్కగా పచ్చడి మాదిరిగా పట్టుకోవడం లేదా వాటిని భద్రపర్చుకుని పప్పులో వేసుకుని తిన్న బాగుంటాయి. మామిడి తొక్కపొడి: ఎండలో ఎండబెట్టిన మామిడి తొక్కను పొడి చేసుకోవాలి. దీన్ని మెరినేడ్లు, సూప్‌లు, కూరల్లో జోడిస్తే మంచి టేస్ట్ వస్తుంది. పైగా మామిడి తొక్కను ఆహారంలో భాగం చేసుకున్నట్లువుతుంది కూడా. అంతేగాదు ఈ తొక్కల పొడిని బ్యూటీ టోనర్‌గా కూడా ఉపయోగించొచ్చు. హెయిర్ వాష్‌గా కూడా ఉపయోగించొచ్చ. బ్యూటీ స్క్రబ్: మామిడి తొక్కల పొడిని తేనే లేదా పెరుగులో కలిపి ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించొచ్చు. దీని వల్ల ముఖంపై ఉండే మృత కణాలు పోయి తాజాగా ఉంటుంది. పైగా చర్మం కూడా రిఫ్రెష్‌గా ఉంటుంది. జుట్టు సంరక్షణ: ఈ మామిడి తొక్కలను కలిపిని నీటితో షాంపు వేసుకుని తలను శుభ్రం చేసుకుంటే..జుట్టు చిట్లడం వంటి సమస్యలను అరికట్టి సిల్కీగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు చర్మం కుచ్చులా ఉండి మెరుస్తూ ఉంటుంది. స్కిన్ టోనర్: మామిడి తొక్కలను నీటిలో వేసి మరిగించిన ద్రవాన్ని వడగట్టి చర్మానికి టోనర్‌గా ఉపయోగించొచ్చు. ఇది ముఖంపై ఉండే రంధ్రాను దగ్గర చేయడమే తాజాగా ఉండేలా చేస్తుంది.(చదవండి: మామిడి బఫే..ఐస్‌క్రీం నుంచి బ్రేక్‌ఫాస్ట్ వరకు అన్ని మ్యాంగో మయం..!) -
Potato Peel ‘తొక్క’ లే అనుకుంటే పప్పులో కాలేసినట్టే!
#Potato Peel : చిన్నపుడు అమ్మమ్మ బీర కాయ పొట్టు పచ్చడి చేసి. ఇది ఏం పచ్చడో చెప్పండర్రా.. అంటూ పెద్ద పజిల్ వేయడం గుర్తుందా? నిజంగా అమోఘమైన ఆ రుచికి, అసలు అది ఏం పచ్చడో అర్థం కాక.. తీరా గుట్టు విప్పాక, ‘బీర్’ కాయా అంటూ నోరు వెళ్లబెట్టడం కూడా తెలుసు. అలాగే సొరకాయ తొక్కులు, పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి, ఆఖరికి పుచ్చకాయల తొక్క లోపల ఉండే తెల్లటి పదార్థంతో కూడా దోసెలు చేసి పెట్టడం కూడా తెలుసు. ఇపుడు అలాంటి తొక్కలు మరొక దాని గురించే తెలిస్తే.. నిజంగా ఔరా అంటారు.. అదిఏమిటంటే.. చిన్న పిల్లలకు ఆలూ ఫ్రై చేసి పెడితే చాలు..మారు మాట్లాడకుండా లాగించేస్తారు. పెద్దలకి కూడీ ఆలూ లేదా బంగాళా దుంప అంత ఫ్యావరేట్. కానీ ఆలూ తొక్కల వాడకం, ప్రయోజనాల గురించి మాత్రం చాలామంది తెలియదు. బంగాళాదుంపల తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కలను చర్మ, సౌందర్య సాధానాల్లో వినియోగిస్తారు. కాలిన గాయాలకు చికిత్స ఆలుగడ్డ తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది. ఇది చిన్నపాటి కాలిన గాయాలకు చికిత్సగా ఉపయోపడుతుంది. అంతేకాదు వేసవిలో ఎండలకు కమిలిని చర్మానికి సహజమైన చిట్కాగా పని చేస్తుంది. సిల్కీ స్కిన్ మొటిమలతో ఎక్కువగా బాధపడుతున్నవారు ఆలూ తొక్కలను అప్లై చేసుకోవచ్చు.మొటిమల్ని గిల్లకుండా, ఎక్కువ రుద్దకుండా వాటిపై తొక్కలతో మెల్లిగా రాయాలి. అలాగే కళ్లకిందే ఉండే డార్క్ సర్కిల్స్ నివారణలో కూడా ఫలితాలు అందిస్తుంది. కెమికల్స్ లేని సహజమైన ఈ తొక్కల రసాన్ని చర్మానికి అప్పై చేయవచ్చు. ఈ జ్యూస్‌తో సిల్కీగా, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అందుకే వీటిని ఎప్పటినుంచో సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఐరన్ పాత్రల తుప్పు పట్టకుండా, స్టార్చ్ సహజమైన గ్రీజుగా పనిచేస్తుంది. అలా వంట ఇంటి చిట్కాగా పనిచేస్తుంది. ఆలూ తొక్కలు మొక్కలకు ఎంతో బలం మొక్కలకు కూడా ఇవి మంచి బాలన్నిస్తాయి. భాస్వరం, పొటాషియం, నత్రజని వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ తొక్కలు నేల నాణ్యతను మెరుగుపరుస్తాయి. మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది. ఆలూ తొక్కల పీల్ కంపోస్ట్ వేసిన వెంటనే గులాబీ, మల్లె లాంటి పూల మొక్కలు వెంటనే మొగ్గ తొడుగుతాయి. -
దానిమ్మ తొక్కలను పడేస్తున్నారా? ఇవి తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
పండ్లు తిన్న తర్వాత సాధారణంగా తొక్కలను పారేస్తుంటాం. కానీ ఆ తొక్కల్లో ఫైబర్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. దానిమ్మ పండు విషయానికి వస్తే.. దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనారోగ్యంతో ఉన్నవారికి దివ్య ఔషధం దానిమ్మ. ఎన్నో సమస్యలను ఈ పండు నయం చేస్తుంది. దానిమ్మ పండే కాదు, తొక్క కూడా చాలా ఉపయోగకరం. దీనిలో యాంటిఆక్సిడెంట్స్ ,ఫినోలిక్ యాసిడ్స్,ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. అసలు దానిమ్మ తొక్క ప్రయోజనాలు తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దానిమ్మను ఇష్టపడతారు. దానిమ్మలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్-సి, కె, బి, ఎ ఇందులో పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలోని గుణాలు గుండెసమస్యలు, హైపర్ టెన్షన్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక దానిమ్మ గింజల్లోనే కాదు, తొక్కలోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్నే కాదు, అందాన్ని కూడా పెంచుతుంది. దానిమ్మ రసం కంటే తొక్కలో 50శాతం అదిక మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు ► దానిమ్మ తొక్కల్లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ► చర్మ క్యాన్సర్‌ని తగ్గించడంలో దానిమ్మ తొక్కలు బాగా పనిచేస్తాయి. హానికరమైన యూవీఏ కిరణాల నుంచి ఇది రక్షిస్తుంది. దానిమ్మ తొక్కలతో పొడి చేసుకొని దాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది. ► దానిమ్మ తొక్కలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల చక్కెర స్థాయిలను తగ్గించి బరువును కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది. ► దానిమ్మ తొక్కలను మరిగించి ఆ రసాన్ని తాగితే కీళ్లనొప్పలు, గొంతునొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ► దానిమ్మలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. దానిమ్మ తొక్కల రసాన్ని మహిళల్లో పీరియడ్స్ సమస్య తగ్గిపోతుంది. ► దానిమ్మ తొక్కలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి...తొక్కలను శుభ్రంగా కడిగి రసం తీసి తాగితే , ఆరోగ్యానికి మంచిది. ► కప్పు నీటిలో టీస్పూను దానిమ్మ పొడి, అరచెక్క నిమ్మరసం వేసి తాగినా మంచిదే. దానిమ్మ పొడి చేసుకోండిలా.. దానిమ్మ గింజలను తిని తొక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తొక్కలను ఎండలో ఆరబెట్టాలి. చక్కగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడిచేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. దానిమ్మతో అందం, మొటిమలు మాయం టేబుల్‌స్పూను దానిమ్మ పొడిలో అరటేబుల్ స్పూను నిమ్మరసం, అరటేబుల్ స్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు స్క్రబ్బర్‌లా రుద్ది కడగాలి. ఈ స్క్రబర్ వల్ల మృతకణాలు , ట్యాన్ తొలగి ముఖ చర్మం మృదువుగా మారుతుంది. దానిమ్మ తొక్కలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే.. దానిమ్మ పొడిలో కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. వయస్సురీత్యా వచ్చే ముడతలను కూడా దానిమ్మ తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఈ పొడిని రాసుకుంటే మార్పు మీకే కనిపిస్తుంది. కొబ్బరినూనెలో దానిమ్మ తొక్కలను కలపి వేడిచేసి చల్లారాక తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది. దానిమ్మ తొక్కలు చర్మం pHని సమతుల్యం చేస్తుంది. తేమగా ఉంచుతంది. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. హానీకరమైన యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. -
Skin Care: ముడతలు, మచ్చలు, మృతకణాల నివారణకు అరటి తొక్క ఫేస్ మాస్క్..
అరటిపండు తిని తొక్కపడేస్తున్నారా? అరటి తొక్కతో మీ చర్మం మెరిసేలా చేయొచ్చని తెలుసా? అవునండి! దీనిలో చర్మానికి మేలు చేసే పోషకాలు, పైటోనూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పబ్మెడ్ సెంట్రల్ ప్రచురించిన నివేదికలో అరటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయని, ఇవి సూర్యరశ్మివల్ల దెబ్బతిన్న చర్మానికి, ప్రీరాడికల్స్ నుంచి రక్షించి చికిత్సనందిస్తుందని వెల్లడించింది. పొడి చర్మానికి కూడా ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక అరటితోలుతో ఏ విధంగా చర్మాన్ని కాపాడుకోవచ్చో తెలుసుకుందామా.. అరటి తోలుతో మసాజ్ ముఖాన్ని నీటితో శుభ్రపరిచి టవల్‌తో తుడుచుకోవాలి. తర్వాత అరటి తొన లోపలిభాగంతో ముఖచర్మంపై 10 నిముషాలపాటు మర్దన చేయాలి. మరోపది నిముషాలు ఆరనివ్వాలి. చివరిగా చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై వాపు, ముడతలు తొలగి ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. అరటి తోలు ఫేస్ మాస్క్ అరటి తొక్కల్లో రెండు అరటి ముక్కలను కూడా వేసి పేస్టులా అయ్యేంతవరకూ మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, పెరుగు కలపాలి. అవసరమైతే రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చెయ్యాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. అరటిలోని బి6,బి12 విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ అనేక చర్మసమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అరటి తోలు ఫేస్ స్క్రబ్బర్ అరటి తోలును చిన్న ముక్కలుగా కట్‌చేసి, టేబుల్‌స్పూన్ చొప్పున పసుపు, చక్కెర, తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 15-20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ స్క్రబ్బర్‌ను వారానికి ఒకసారైనా వాడితే చర్మంపై మృతకణాలను తొలగించి చర్మం కాంతులీనేలా చేస్తుంది. అరటి తోలు ప్యాచెస్ అరటి తొక్కను రెండు ముక్కలుగా కట్‌చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. పది నిముషాల తర్వాత బయటికి తీసి వీటిని రెండు కళ్ల మీద 15-20 నిముషాలుంచి కడిగేసుకోవాలి. ఈ ప్రక్రియ కంటి కింద నల్లని వలయాలు, ముడతలు రాకుండా నివారిస్తుంది. చదవండి: Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే! -
'తొక్క'తో బోలెడు ప్రయోజనాలు
అరటిపండులో పోషకాలు మెండు. పండును తినేసి తొక్కను పడేస్తుంటాం. కానీ, వస్తువుల వాడకంలో అరటిపండు తొక్కను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుంటే పడేయడానికి ఇక చెత్తబుట్టను వెతకాల్సిన పనిలేదు. ♦ స్టీల్, వెండి వస్తువులపై మరకలు పోవడానికి, డిష్వాషర్ సోప్ రసాయనాలను తొలగించడానికి అరటిపండు తొక్కతో రుద్ది కడగాలి. సేంద్రీయ పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ నీటిని మొక్కలకు పోయవచ్చు నాన్‌స్టిక్ వంటపాత్రల లోపలి భాగాన్ని అరటిపండు తొక్కతో రుద్ది, కడిగితే కోటింగ్ త్వరగా పోదు. ♦ దుమ్ము లేకుండా తడి క్లాత్‌తో తుడిచి, ఆ తర్వాత అరటిపండుతొక్కతో రుద్దితే షూ శుభ్రపడి, మెరుస్తాయి. ♦ కట్టె ఫర్నీచర్, కట్టెతో తయారు చేసిన వస్తువులను అరటిపండు తొక్కతో రుద్ది, తడి క్లాత్‌తో తుడిస్తే మరకలు, గీతలు పోయి కొత్తవాటిలా మెరుస్తాయి ∙ఇంకు మరకలు పోవాలంటే అరటిపండు తొక్కతో రుద్ది, కడగాలి. -
‘తొక్క’లో పంచాయితీ
బంజారాహిల్స్: తొక్కే కదా అని తేలిగ్గా తీసేయొద్దు... ఓ అరటి తొక్క 300 మంది అడ్డా కూలీలను ఏకం చేసింది... ఈ తొక్క పంచాయితీ కారణంగా వారు ఒక రోజు కూలీని కోల్పోవాల్సి వచ్చింది.. వివరాల్లోకి వెళితే...బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్ కమాన్ వద్ద ఉండే ఆడ్డా నుంచి నిత్యం వందలాది మంది కూలీలు దినసరి కూలీలకు వెళ్తుంటారు.. అదే ప్రాంతంలో బాబూరావు అనే వ్యక్తి బండిపై అరటి పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. ఆదివారం ఉదయం కూలీలంతా పనుల కోసం వేచి ఉన్న సమయంలో ఎవరో ఓ వ్యక్తి అరటిపండు తిని రోడ్డుపై పారవేశాడు. దీంతో పక్కనే ఉన్న పండ్ల వ్యాపారి ఇటుగా వస్తున్న లింగం అనే అడ్డా కూలీని పిలిచి తొక్క తీయాలని సూచించాడు. తాను తినలేదని, తాను వేయని తొక్క ఎందుకు తీస్తానని పండ్ల వ్యాపారిని ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన పండ్ల వ్యాపారి బాబూరావు కర్రతో లింగంపై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆగ్రహానికి లోనైన తోటి అడ్డా కూలీలు న్యాయం చేయాలంటూ స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి ఎదుట పంచాయితీ పెట్టారు. రెండు గంటల పాటు ఈ పంచాయితీ కొనసాగింది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం రణరంగంగాన్ని తలపించింది. పెద్ద సంఖ్యలో అడ్డా కూలీలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరటిపండ్ల వ్యాపారిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. న్యాయం చేస్తామని కార్పొరేటర్ హామీ ఇవ్వడంతో వారు తిరుగుముఖం పట్టారు. అయితే అప్పటికే పనికి వెళ్లే సమయం ముగియడంతో ఉసూరుమంటూ ఇంటిబాట పట్టారు. -
తొక్క మీద కళాఖండాలు
కళావిలాసం అరటి పండును చేతిలో పెడితే ఎవరైనా ఏం చేస్తారు? శుభ్రంగా తొక్క తీసి పారేసి, పండును తినేస్తారు. ఇది అందరూ చేసే పనే! కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న అమెరికన్ కుర్రాడు అలా కాదు. టెక్సాస్‌లో ఉండే ఈ యువకుడి పేరు డావోంట్ విల్సన్. వృత్తిపరంగా ఇతడు ఈసీజీ టెక్నీషియన్ అయినా, ప్రవృత్తిపరంగా కళాకారుడు. అరటిపండును తొక్కతీసి తినేయడంలో మజా ఏముందనుకున్నాడు. తొక్కే కదా... అని తీసి పారేయలేదు. పండు నుంచి తొక్కను వేరు చేయకుండానే, తొక్కల మీద కళాఖండాలు సృష్టించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగాడా..? తొక్కల మీద తీర్చిదిద్దిన కళాఖండాలను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు. కళాభిమానుల నుంచి వేలంవెర్రిగా ప్రతిస్పందన లభించింది. కళాఖండాలు తీర్చిదిద్దిన ఒక్కో అరటిపండు 10 డాలర్లకు తక్కువ కాకుండా అమ్ముడుపోయాయి. దీంతో డావోంట్ ఇక ఆగలేదు.. ఏకంగా ‘బనానాస్ గాన్ వైల్డ్’ పేరిట ఆన్లైన్ సంస్థను ప్రారంభించి జోరుగా హుషారుగా అమ్మకాలు సాగిస్తున్నాడు. తొక్క మీది కళాఖండాల ద్వారా ఏటా లక్ష డాలర్ల వరకు సంపాదిస్తున్నాడు. రోజుకు కనీసం 75 అరటిపళ్లపై ఇలాంటి కళాఖండాలను తీర్చిదిద్దుతానని, ఆర్డర్ ఇచ్చిన వారికి జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్‌చేసి, పార్సెల్ చేస్తుంటానని డావోంట్ చెబుతున్నాడు. -
తీసి... పారేయకండి
ఫుడ్ ఫ్యాక్ట్స్ అరటిపండు తిని తొక్క పడేస్తాం..కానీ తొక్కతో చాలా లాభాలున్నాయి. అందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల చుట్టూ ఉన్న ముడతలను మాయం చేస్తుంది. తాజా అరటిపండు తొక్కలోపలి భాగాన్ని కళ్లచుట్టూ సున్నితంగా రుద్దితే ముడుతలు, ఐ బాగ్స్ అడ్రస్ లేకుండా పోతాయి. చీమ, దొమ వంటి కీటకాలు కుట్టిన చోట వాపు, దురదలాంటివి ఉంటే అరటిపండు తొక్కతో రుద్దితే ఉపశమనం కలుగుతుంది.అరటిపండు మనుషులకే కాదు మొక్కలకూ ఆరోగ్యమే. పండు తిని తొక్కను డస్ట్‌బిన్‌లో వేయకుండా గులాబి మొక్కల తొట్లలో వేస్తే గులాబీలు విరగబూస్తాయి. -
తొక్కే కదా అని తీసి పారేస్తే..!
పండు తినడం, తొక్క పారేయడం సహజమే. అయితే నారింజ, బత్తాయి, కమలాఫలం తొక్కల్ని మాత్రం పారేయవద్దు అంటున్నారు నిపుణులు. ఎందుకూ అంటే... ఈ తొక్కలు మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయట ఇవి క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో పెద్ద పాత్రే పోషిస్తాయి గుండె మంటను తగ్గించడానికి దోహదపడతాయి వీటిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జలుబు, దగ్గు, ఫ్లూ, ఆస్త్మా వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ఈ తొక్కలు మంచి మందు శారీరక దుర్వాససను పోగొట్టే లక్షణం ఉంది వీటికి. అందుకే వీటిని పర్ఫ్యూమ్స్ తయారీలో ఉపయోగిస్తారు వీటితో పళ్లు రుద్దుకుంటే ముత్యాల్లా మెరుస్తాయి. అప్పుడప్పుడూ చిన్న ముక్కను నములుతూంటే... చిగుళ్ల సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కాబట్టి ఇంకెప్పుడూ తొక్కే కదా అని పారేయకండి. తప్పకుండా తీసుకోండి. ఎలా అంటే ఎండబెట్టి పొడి చేసి వంటల్లో వాడొచ్చు. లేదంటే నీళ్లలో మరిగించి ఆ నీటిని సేవించవచ్చు. మీ ఇష్టం!