పండు తినడం, తొక్క పారేయడం సహజమే. అయితే నారింజ, బత్తాయి, కమలాఫలం తొక్కల్ని మాత్రం పారేయవద్దు అంటున్నారు నిపుణులు. ఎందుకూ అంటే... ఈ తొక్కలు మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయట ఇవి క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో పెద్ద పాత్రే పోషిస్తాయి గుండె మంటను తగ్గించడానికి దోహదపడతాయి
వీటిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జలుబు, దగ్గు, ఫ్లూ, ఆస్త్మా వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ఈ తొక్కలు మంచి మందు శారీరక దుర్వాససను పోగొట్టే లక్షణం ఉంది వీటికి. అందుకే వీటిని పర్‌ఫ్యూమ్స్ తయారీలో ఉపయోగిస్తారు వీటితో పళ్లు రుద్దుకుంటే ముత్యాల్లా మెరుస్తాయి. అప్పుడప్పుడూ చిన్న ముక్కను నములుతూంటే... చిగుళ్ల సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కాబట్టి ఇంకెప్పుడూ తొక్కే కదా అని పారేయకండి. తప్పకుండా తీసుకోండి. ఎలా అంటే ఎండబెట్టి పొడి చేసి వంటల్లో వాడొచ్చు. లేదంటే నీళ్లలో మరిగించి ఆ నీటిని సేవించవచ్చు. మీ ఇష్టం!
తొక్కే కదా అని తీసి పారేస్తే..!
Published Wed, Mar 11 2015 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement
Advertisement