![Ram Charan Hit Movie Orange to re release on February 14](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/ram.jpg.webp?itok=5srYl7pP)
రామ్ చరణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ అభిమానులను రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అలరించనుంది. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఆరెంజ్ ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆరెంజ్ సినిమా (Orange Movie) రీ రిలీజ్ కానుంది. ఆరెంజ్ సినిమా (Orange Movie) వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న థియేటర్లలో సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. హరీశ్ జయరాజ్ సంగీతం అందించాడు.ఈ చిత్రంలో షాజాన్ పదమ్సీ, ప్రభు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాగ బాబు కీలక పాత్రల్లో నటించారు.
కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ16 పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీతో సినీ ప్రియులను అలరించాడు చెర్రీ. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment