అరటిపండులో పోషకాలు మెండు. పండును తినేసి తొక్కను పడేస్తుంటాం. కానీ, వస్తువుల వాడకంలో అరటిపండు తొక్కను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుంటే పడేయడానికి ఇక చెత్తబుట్టను వెతకాల్సిన పనిలేదు.
♦ స్టీల్, వెండి వస్తువులపై మరకలు పోవడానికి, డిష్‌వాషర్ సోప్ రసాయనాలను తొలగించడానికి అరటిపండు తొక్కతో రుద్ది కడగాలి. సేంద్రీయ పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ నీటిని మొక్కలకు పోయవచ్చు నాన్‌స్టిక్ వంటపాత్రల లోపలి భాగాన్ని అరటిపండు తొక్కతో రుద్ది, కడిగితే కోటింగ్ త్వరగా పోదు.
♦ దుమ్ము లేకుండా తడి క్లాత్‌తో తుడిచి, ఆ తర్వాత అరటిపండుతొక్కతో రుద్దితే షూ శుభ్రపడి, మెరుస్తాయి.
♦ కట్టె ఫర్నీచర్, కట్టెతో తయారు చేసిన వస్తువులను అరటిపండు తొక్కతో రుద్ది, తడి క్లాత్‌తో తుడిస్తే మరకలు, గీతలు పోయి కొత్తవాటిలా మెరుస్తాయి ∙ఇంకు మరకలు పోవాలంటే అరటిపండు తొక్కతో రుద్ది, కడగాలి.
పీల్‌తో బోలెడు ప్రయోజనాలు
Published Thu, Feb 27 2020 10:14 AM | Last Updated on Thu, Feb 27 2020 10:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment