ఆరోగ్యం కోసం అనేక రకాల పండ్లను తినడం మనకు అలవాటు. పండ్లతోనే పండ్ల తొక్కలతో కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి బొప్పాయి తొక్కలు. రుచికి, మంచిపోషకాలకు పెట్టింది పేరు బొప్పాయి. కానీ ఆ పండ్ల తొక్కల్లో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. సౌందర్య పోషణలో బాగా ఉపయోగపడతాయి.
బొప్పాయి పండు లోనే కాదు బొప్పాయి తొక్కలోనూ ఎన్నో పోషకాలు లభిస్తాయి. బొప్పాయి పీల్స్‌లో క్రూడ్ ప్రొటీన్, క్రూడ్ ఫైబర్, క్రూడ్ ఫ్యాట్, యాష్ కంటెంట్, తేమ, కార్బోహైడ్రేట్, ఫ్యాటీ యాసిడ్, ఎనర్జీ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బీ1, విటమిన్ బీ2, విటమిన్ బీ3, విటమిన్ బీ6, విటమిన్ బీ12 ,విటమిన్ సీ వంటి విటమిన్లు , ఖనిజాలను కూడా ఉంటాయి. పండిన బొప్పాయి తొక్కలు కాల్షియం, పొటాషియం, ఐరన్ కూడా లభిస్తాయి. అందుకే సౌందర్య పోషణ ఉత్పత్తులో దీన్ని విరివిగా వాడతారు. అలాగే ఇంట్లో సహజంగా ఫేస్‌ప్యాక్‌లా కూడా వాడుకోవచ్చు. ఇవి చర్మ ఆరోగ్యానికి ,చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సాయపడతాయి.
పండిన బొప్పాయి తొక్కల్ని శుభ్రంగా కాడిగి, మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రోజ్‌వాటర్ పెరుగు బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి , మెడకుప్యాక్‌లా వేసుకుని, ఆరిన తరువాత కడిగేసుకోవాలి. కనీసం పండిన బొప్పాయి ముక్కల్ని ముఖంపై సున్నితంగా రుద్దు కొని, ఆరిన తరువాత చల్లని నీళ్లతో కడుక్కున్నా ఇన్‌స్టెంట్ గ్లో వస్తుంది. టాన్ పోతుంది. ప్రెష్‌గా, ప్రకాశవంతంగా మారుతుంది. బొప్పాయి తొక్కలతో అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లోఒకటి దాని ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణం అలాగే ఇందులోని పపైన్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది. బొప్పాయిలో లైకోపీన్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, తొందరగా వృద్ధాప్య చాయలు రాకుండా కాపాడతాయి.
Comments
Please login to add a commentAdd a comment