Health Tips In Telugu- Papaya Seeds: బొప్పాయి పండు తరగగానే ముందు అందులో ఉండే గింజలు తీసి అవతల పారేస్తాం. బొప్పాయి గింజలపై జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇవి కొద్దిగా కారంగా, చేదుగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి.. మిక్సీలో పొడిలా చేసి తినవచ్చు.
బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ ఉంటాయి. ఇంకా జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇంకా ఈ గింజల్లో ఒలీక్ యాసిడ్, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని పెంచుతాయి.
కార్పైన్ వల్ల
బొప్పాయి గింజలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ సాధారణ స్థాయికి తగ్గుతుంది. వీటిలో ఉండే కార్పైన్ అనే పదార్థం పేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. ఈ విత్తనాలలోని అధిక ఫైబర్.. పేగులు బాగా కదిలేలా చేస్తుంది.
బరువు తగ్గుతారు
ఫలితంగా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి.. శరీర వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరంలో అనవసర కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది. ఫలితంగా త్వరగా బరువు తగ్గిపోతారు.
పీరియడ్స్ నొప్పిని తగ్గించి
బొప్పాయిలో ఉండే కెరోటిన్.... ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. బొప్పాయి గింజలు ఋతుక్రమం సరైన క్రమంలో ఉండేలా చేస్తాయి. పీరియడ్స్ నొప్పిని కొంతవరకూ తగ్గిస్తాయి.
బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మంట, నొప్పిని తగ్గిస్తాయి.
ఇందులోని పాలీఫెనాల్స్ కారణంగా
బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్... అనేక రకాల క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. రోజూ 5 నుంచి 6 బొప్పాయి గింజలను తీసుకుని.. వాటిని చూర్ణంలా చేసి తినండి. లేదా పొడిలా చేసి నీటిలో కలిపి తాగేయండి. బొప్పాయి గింజల సారాన్ని తాగడం వల్ల... కడుపులో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాలు చనిపోతాయి.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశ ఉంటుంది.
చదవండి: బీరకాయ కూర తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల
Comments
Please login to add a commentAdd a comment