Health Tips: Things You Shouldn't Do After Eating Meal - Sakshi
Sakshi News home page

Health Tips: రాత్రిపూట అరటిపండ్లు తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే

Published Mon, Jul 3 2023 3:27 PM | Last Updated on Thu, Jul 27 2023 4:53 PM

Health Tips: Things You Should Never Do After Eating Meal - Sakshi

మనలో చాలామంది భోజనం విషయంలో సరైన నియమాలు పాటించరు. తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటుంది. కొన్ని కాంబినేషన్స్‌  శరీరానికి అస్సలు మంచివి కావు.కొంతమంది అన్నంలో అరటిపండు, మామిడి పండును తీసుకుంటారు. ఇలా తినడం వల్ల అసౌకర్యంతో పాటు అనారోగ్యం కూడా తోడవుతుంది.

అందుకే కొన్ని కాంబినేషన్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. మరికొందరు భోజనం తర్వాత వెంటనే పండ్లను తింటూ ఉంటారు. ఇలా అస్సలు చేయొద్దని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి? అస్సలు తినకూడదని కొన్ని కాంబినేషన్స్‌ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. 

► సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత పండ్లు తింటూ ఉంటాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు. భోజనం చేశాక కొన్ని పండ్లు అస్సలు తినకూడదట. భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే త్వరగా జీర్ణం కావని చెబుతున్నారు నిపుణులు. భోజనం చేసిన వెంటనే పండ్లను తీసుకుంటే భోజనంతో పాటు ఇతర ఆహారాలతో కలిసి అది రియాక్షన్‌గా ఏర్పడుతుందట. దీని ఫలితంగా ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో పండ్లలోని పోషకాలు సరైన పద్దతిలో శరీరానికి అందవు. అందుకే భోజనం చేసిన కనీసం గంట, రెండు గంటల తర్వాత పండ్లను తీసుకోవాలి. 

► భోజనం చేసిన వెంటనే అరటిపండ్లు తింటుంటారు చాలామంది. కానీ తిన్న వెంటనే అరటిపండ్లు తినడం వల్ల జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మరికొంతమంది నిద్రపోయే ముందు అరటిపండ్లు తింటుంటారు. దీనివల్ల నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందట. కాబట్టి అరటిపండ్లు తినాలనుకునేవారు మధ్యాహ్న సమయంలో తినడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

► నారింజ, కమల, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్‌ పండ్లలో యాసిడ్స్‌ ఉంటాయి. కాబట్టి వీటిని తినడానికి గంటముందు, లేదంటే తిన్న గంట తర్వాత పండ్లు తినడం మంచిది. లేదంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గుండెల్లో మంటగా అనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా సిట్రస్‌ పండ్లను పాలతో కూడా కలిపి తీసుకోరాదు.  

► పాలకూర, పనీర్‌ కాంబినేషన్‌ చాలా ఎక్కువగా తింటుంటారు. రెస్టారెంట్లలోనూ వెజ్‌ తినాలనుకుంటే ఎక్కువగా పాలక్‌ పనీర్‌ తినేందుకు మొగ్గు చూపుతారు. కానీ ఈ కాంబినేషన్‌ అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఈ కాంబినేషన్‌ వల్ల పాలకూరలోని పోషకాలు నాశనం అవుతాయని అన్నారు. పాలక్‌ పనీర్‌లో ఎక్కువగా కాల్షియం,ఐరన్‌ ఉంటాయి. కాల్షియం కారణంగా ఐరన్‌ను శరీరం గ్రహించుకోలేదు. అందుకే పనీర్‌కు బదులుగా బంగాళదుంప, కార్న్‌ వంటివి తీసుకుంటే సరైన పోషకాలు అందుతాయని అంటున్నారు. 

► భోజనం చేసిన వెంటనే కొందరు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. తిన్న వెంటనే నిద్ర పోవడం వల్ల తిన్నది సరిగా అరగదని, దానివల్ల జీర్ణప్రక్రియకకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెరుగుతారని, అందుకే భోజనానికి, నిద్రకు మధ్య రెండు, మూడు గంటల వ్యత్యాసం ఉండాలని సూచిస్తున్నారు.  

► కొందరు తిన్న తర్వాత భోజనం చేస్తుంటారు. ఇలా అస్సలు చేయొద్దని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే అది శరీర ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచుతుందని, ఇది జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. అందుకే తిన్నాక గంటకు పైగానే బ్రేక్‌ తీసుకొని ఆ తర్వాత స్నానం చేయాలని చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement