ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఈమధ్య యోగా, ఫిట్‌నెస్, ఆయుర్వేదం వంటివాటిపై అవగాహన పెరిగింది. ప్లాస్టిక్ అతిగా వాడితే మంచిది కాదని, స్టీల్, గాజు, రాగ్రి పాత్రల్లో నీళ్లు తాగేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. రాగిలో శుద్దీకరణ లక్షణాలు ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాగి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
రాగి చెంబులో నీళ్లు నిలువ చేసి పరగడుపున త్రాగడం వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి.రాగి పాత్రలోని నీరు తాగితే కలిగే ప్రయోజనాలే కాదు.. వాటితో వచ్చే ప్రమాదాలను కూడా తెలుసుకోవడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. రాగి పాత్రల్లో సరైన పద్దతిలో నీళ్లు తాగితేనే అది శరీరానికి మేలు చేస్తుందని, ప్రతిరోజూ రాగి బాటిల్‌లో నీళ్లు తాగాలనుకునేవాళ్లు కశ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.
రాగినీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
► రాగిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో హానికరమైన బ్యాక్టీరియా, మంటను సమర్థవంతంగా ఎదుర్కోగలవు.
► రాగి బాటిల్స్‌లో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేస్తుంది.
► హైపర్ టెన్షన్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. రాగి నీళ్లు కొలెస్ట్రాల్‌ని తగ్గించగలదు.
► ఫలితంగా రాగి సీసాలోని నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, అల్సర్లు, అజీర్ణం సమర్ధవంతంగా తగ్గుతాయి.
► కిడ్నీ, కాలేయం పనితీరును మెరుగుపర్చడంలో రాగి సహాయపడుతుంది.
► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
► ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ రాగినీళ్లను తాగితే రిలీఫ్ కలుగుతుంది.
► రాగి పాత్రలను నిత్యం ఉపయోగించడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది.
రాగి నీళ్లు తాగుతున్నారా? ఇవి గుర్తుపెట్టుకోండి
♦ రాగి బాటిల్‌లో ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు నీళ్లను నిల్వ చేయరాదు.
♦ రాత్రి నిల్వ చేసిన నీళ్లను పరగడుపున తాగితే చాలా మంచిది. దీని వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి.
♦ నిపుణుల సూచనల ప్రకారం రాగి బాటిల్స్‌ను ఫ్రిడ్జ్‌లో అస్సలు నిల్వ చేయరాదు.దీనివల్ల రాగి ప్రయోజనాలు శరీరానికి ఏమాత్రం అందవు.
♦ రాగి పాత్రలో నీళ్లు తాగితే మంచిది కదా అని రోజంతా అవే నీళ్లు తాగొద్దు. దీనివల్ల కాపర్ టాక్సిసిటీ అయ్యే ప్రమాదం ఉందట. ఫలితంగా వికారం, కడుపునొప్పి వంటివి వచ్చే అవకాశం ఉందట.
♦ రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లను వేటితోనూ మిక్స్ చేయొద్దు. పరగడుపున రాగి నీళ్లు తీసుకునేటప్పుడు కొందరు నిమ్మరసంతో కలిసి తాగేస్తున్నారు. కానీ ఇలా అస్సలు చేయకండి. ఎందుకంటే నిమ్మరసంలోని యాసిడ్ కాపర్‌తో రియాక్ట్ అయి ఎసిడిటీ, వాంతులు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment