హెల్త్ టిప్స్
►వంటిమీద ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని నూరి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకుంటే సరి, పుళ్లు తొందరగా తగ్గుతాయి. గాయాలు తొందరగా మానుతాయి.
► తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది.
► ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది.
► గొంతులో మంట, ఆస్తమా, జ్వరం వంటి సమస్యలకు సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తీసుకుంటే విముక్తి.
► అదేవిధంగా బీపీ అదుపులో ఉండాలన్నా సబ్జా గింజలు తీసుకుంటే మంచిది. వీటిలో ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
►మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది.. కాసిని సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి.
►గోరింటాకు, జుత్తుకు సహజసిద్ధమైన రంగుగానే కాకుండా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ నివారణలోనూ బాగా తోడ్పడుతుంది. వెంట్రుక కుదుళ్లను పటిష్టం చేయడం ద్వారా ఇది చుండ్రును, జుత్తు రాలడాన్ని నివారిస్తుంది.
► వేపాకు యాంటీ సెప్టిక్‌గానూ, ఇన్ సెక్టిసైడ్‌గానూ పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నోరకాల క్రిమి కీటకాలు ఇంటికి దూరంగా వెళ్లిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి స్ప్రే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమాల బాధలు తప్పుతాయి.
►కలబంద గుజ్జు ఒక సహజసిద్ధమైన కండీషనర్. మాయిశ్చరైజర్ కూడా. ఈ గుజ్జును చర్మం మీద, మాడు మీద రుద్దితే, చర్మ వ్యాధులు, చుండ్రు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఈ గుజ్జుతో కాలిన గాయాలు కూడా త్వరగా మానిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment