sabja
-
ఆడవాళ్లు సబ్జా గింజలు తింటున్నారా? ఈ విషయం తెలిస్తే..
హెల్త్ టిప్స్ ►వంటిమీద ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని నూరి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకుంటే సరి, పుళ్లు తొందరగా తగ్గుతాయి. గాయాలు తొందరగా మానుతాయి. ► తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. ► ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది. ► గొంతులో మంట, ఆస్తమా, జ్వరం వంటి సమస్యలకు సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తీసుకుంటే విముక్తి. ► అదేవిధంగా బీపీ అదుపులో ఉండాలన్నా సబ్జా గింజలు తీసుకుంటే మంచిది. వీటిలో ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ►మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది.. కాసిని సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి. ►గోరింటాకు, జుత్తుకు సహజసిద్ధమైన రంగుగానే కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణలోనూ బాగా తోడ్పడుతుంది. వెంట్రుక కుదుళ్లను పటిష్టం చేయడం ద్వారా ఇది చుండ్రును, జుత్తు రాలడాన్ని నివారిస్తుంది. ► వేపాకు యాంటీ సెప్టిక్‌గానూ, ఇన్ సెక్టిసైడ్గానూ పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నోరకాల క్రిమి కీటకాలు ఇంటికి దూరంగా వెళ్లిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి స్ప్రే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమాల బాధలు తప్పుతాయి. ►కలబంద గుజ్జు ఒక సహజసిద్ధమైన కండీషనర్. మాయిశ్చరైజర్ కూడా. ఈ గుజ్జును చర్మం మీద, మాడు మీద రుద్దితే, చర్మ వ్యాధులు, చుండ్రు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఈ గుజ్జుతో కాలిన గాయాలు కూడా త్వరగా మానిపోతాయి. -
Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
సబ్జా గింజల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేసవి రాగానే పొద్దున్నే కాసిని సబ్జా గింజలను చెంబెడు నీళ్లులో నానబెట్టుకుని, మధ్యాన్నం కాగానే, ఆ నీటిలో కాస్త పంచదార కలుపుకుని తాగడం ఇంచుమించు అందరికీ అనుభవమే. వేసవి ఎండలు ముదురుతున్నాయి కాబట్టి సబ్జాగింజలను, వాటి ఉపయోగాలనూ మరోసారి గుర్తు చేసుకుందాం. ►సబ్జాగింజలకు కాస్త తడి తగిలితే చాలు, దానిని పీల్చుకుని అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది. దాంతో అప్రయత్నంగానే తక్కువ తింటాం. ►సబ్జా గింజల్లో ఔషధగుణాలెన్నో ఉన్నాయి. వాటితోపాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ►వంటిమీద ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని నూరి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకుంటే సరి, పుళ్లు తొందరగా తగ్గుతాయి. గాయాలు తొందరగా మానుతాయి. ►తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. ►రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..! ►శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గ్లాసుడు గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలనూ కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యసమస్యలు తగ్గుముఖం పట్టడంతోపాటు శ్వాస బాగా ఆడుతుంది. ►ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల క్రీడాకారులకు శరీరంలో నీటిశాతం తగ్గి బాగా నీరసించిపోతారు. అలాంటప్పుడు రోజూ సబ్జా గింజలను తీసుకుంటే శరీరంలో తేమను పోనీయకుండా నిలిపి ఉంచుతాయి. ►గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలతో బాధపడేటప్పుడు కాసిని సబ్జా గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేస్తే సరి.. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి. ►వీటిలో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా–3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రావు. ►బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి ఈ గింజలు. ►మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో కలిపి కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది.. కాసిని సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి ఇంతవరకూ తీసుకోనివారు ఇప్పటినుంచి సబ్జాగింజలను నానబెట్టి తాగడం అలవాటు చేసుకోవడం మంచిది కదా! -
సబ్జా... ఎండకు విరుగుడు
దాదాపు ఐదొందల ఏళ్ల నాటి సంగతి. మొఘల్ సేనలు గోల్కొండ కోటకు చేరుకున్నాయి. ఆ చుట్టుపక్కల వారి పటాలాలు వెలిశాయి. బాగా అలసిపోయిన ఆ సేనలకు వేసవి ఎండలు చికాకు పెట్టిస్తున్నాయి. విపరీతమైన ప్రయాణ బడలికతో ఉన్న సైనికులు ఎండ తీవ్రతతో వెంటనే కోలుకోలేరని తేలిపోయింది. వెంటనే వారి కోసం ప్రత్యేక నిపుణుల బృందం వచ్చింది. కాసేపట్లో ఓ ‘ఔషధం’ సిద్ధమైంది. నిత్యం మూడు పూటలా దాన్ని సేవించేసరికి వారిలో ఉత్సాహం తిరిగొచ్చింది. ఆ ఔషధం తయారు చేసింది ఇరాన్ నుంచి వచ్చిన హకీమ్‌లు. దాని పేరు... ఫాలుదా! ఎండా కాలం మొదలు కాగానే హైదరాబాద్ రోడ్లపై విస్తృతంగా వెలిసే దుకాణాల్లో తయారు చేసి అందించే పానీయమే ఫాలుదా. భగభగలాడే వేసవి ఎండల దుష్ఫలితాల నుంచి రక్షించే గొప్ప ఔషధ గుణాలున్న పానీయమది. సూర్యతాపం నుంచి తాత్కాలి ఉపశమనం కలిగించేది అందులో చల్లదనమైతే... ఎండల వల్ల శరీరంలో వచ్చే మార్పులు చెడు ప్రభావాన్ని కల్పించకుండా చేసేది అందులోని సబ్జా. సబ్జా... ఇప్పటి తరానికి అంతగా పరిచయం లేని పేరు. అంత దూరం నుంచి సువాసన వెదజల్లే సబ్జా చెట్టు గింజలే అవి. ఆవాల్లా కనిపించే ఈ గింజలకు గొప్ప లక్షణముంది. శరీరంలో ఎంతటి వేడి ఉన్నా దాన్ని తీసేసినట్టు మాయం చేసే గుణాలు దీని సొంతం. అందుకే ఈ గింజలను ఫాలుదాలో విస్తృతంగా వినియోగిస్తారు. దీంతోపాటు జొన్న, మెట్ట తామర పొడితో తయారు చేసే వెర్మిసెల్లీ వాడతారు. మనకు పరిచయమైందిలా... సబ్జా గింజలతో శరీర ఉష్ణాన్ని తగ్గించే సంప్రదాయం మన దేశంలో అనాదిగా వస్తోంది. కానీ ప్రత్యేక పానీయంగా ఫాలుదాతో రంగరించే సంప్రదాయం మాత్రం మధ్య ఆసియా నుంచి వచ్చి చేరింది. అక్కడ ఎండ తీవ్రత వల్ల ఏర్పడే దుష్పరిణామాల నుంచి కాపాడుకోవటానికి ఫాలుదా తాగే సంప్రదాయం ఉంది. చలికాలంలో కొండలపై పేరుకునే మంచు దిమ్మెలను భూగర్భంలో ప్రత్యేక పద్ధతిలో భద్రపరిచి నడి వేసవిలో ఫాలుదాలో రంగరించి తాగేవారట. మంచు కరగకుండా ప్రత్యేక పద్ధతులను వినియోగించేవారు. ఇందుకోసం నాటి పాలకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. భారత ఉపఖండంలో మొఘల్ చక్రవర్తులు కాలుమోపినప్పుడు ఇది కూడా వచ్చి చేరింది. తొలుత ఉత్తర భారతానికే ఇది పరిమితమైనా కుతుబ్‌షాహీల ఉత్సాహం కొద్దీ దక్కన్ పీఠభూమికి చేరువైంది. వారి హయాంలో సైనిక పాటవానికి ఎంత ప్రాధాన్యం ఉండేదో షాహీ దస్తర్ఖానాలకు అంతే విలువ ఉండేది. ఇందులో మధ్యాహ్నం వేళ ఘుమఘుమలాడే ఫాలుదాలు సిద్ధంగా ఉండేవి. సాయంత్రం వేళ గిన్నెలకొద్దీ ఫలూదా ఖర్చయ్యేది. వేసవిలో ఇది లేకుండా దర్బారు నడిచేది కాదంటారు. ఆ ఆనవాయితీ నిజాం హయాంలోనూ కొనసాగింది. దీంతో హైదరాబాద్‌లో ఫాలుదా స్థానం చిరస్థాయిగా మారిపోయింది. భానుడి ప్రతాపం కాస్త పెరిగిందంటే చాలు చారిత్రక హైదరాబాద్‌లోని హోటళ్లు ఫాలుదా గిన్నెలతో నిండిపోతాయి. ఆదిలో ప్రత్యేక సేమియా, సబ్జా గింజలకే పరిమితమైన ఈ పానీయంలో ఆ తర్వాత రోజ్ వాటర్, పాలు, డ్రైఫ్రూట్స్ కలపటం మొదలైంది. ఇప్పుడు హైదరాబాద్ సంస్కృతిలో ఇదీ ఓ భాగమైంది. గౌరీభట్ల నరసింహమూర్తి