Basil
-
ఆడవాళ్లు సబ్జా గింజలు తింటున్నారా? ఈ విషయం తెలిస్తే..
హెల్త్ టిప్స్ ►వంటిమీద ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని నూరి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకుంటే సరి, పుళ్లు తొందరగా తగ్గుతాయి. గాయాలు తొందరగా మానుతాయి. ► తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. ► ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది. ► గొంతులో మంట, ఆస్తమా, జ్వరం వంటి సమస్యలకు సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తీసుకుంటే విముక్తి. ► అదేవిధంగా బీపీ అదుపులో ఉండాలన్నా సబ్జా గింజలు తీసుకుంటే మంచిది. వీటిలో ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ►మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది.. కాసిని సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి. ►గోరింటాకు, జుత్తుకు సహజసిద్ధమైన రంగుగానే కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణలోనూ బాగా తోడ్పడుతుంది. వెంట్రుక కుదుళ్లను పటిష్టం చేయడం ద్వారా ఇది చుండ్రును, జుత్తు రాలడాన్ని నివారిస్తుంది. ► వేపాకు యాంటీ సెప్టిక్‌గానూ, ఇన్ సెక్టిసైడ్గానూ పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నోరకాల క్రిమి కీటకాలు ఇంటికి దూరంగా వెళ్లిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి స్ప్రే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమాల బాధలు తప్పుతాయి. ►కలబంద గుజ్జు ఒక సహజసిద్ధమైన కండీషనర్. మాయిశ్చరైజర్ కూడా. ఈ గుజ్జును చర్మం మీద, మాడు మీద రుద్దితే, చర్మ వ్యాధులు, చుండ్రు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఈ గుజ్జుతో కాలిన గాయాలు కూడా త్వరగా మానిపోతాయి. -
Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
సబ్జా గింజల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేసవి రాగానే పొద్దున్నే కాసిని సబ్జా గింజలను చెంబెడు నీళ్లులో నానబెట్టుకుని, మధ్యాన్నం కాగానే, ఆ నీటిలో కాస్త పంచదార కలుపుకుని తాగడం ఇంచుమించు అందరికీ అనుభవమే. వేసవి ఎండలు ముదురుతున్నాయి కాబట్టి సబ్జాగింజలను, వాటి ఉపయోగాలనూ మరోసారి గుర్తు చేసుకుందాం. ►సబ్జాగింజలకు కాస్త తడి తగిలితే చాలు, దానిని పీల్చుకుని అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది. దాంతో అప్రయత్నంగానే తక్కువ తింటాం. ►సబ్జా గింజల్లో ఔషధగుణాలెన్నో ఉన్నాయి. వాటితోపాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ►వంటిమీద ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని నూరి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకుంటే సరి, పుళ్లు తొందరగా తగ్గుతాయి. గాయాలు తొందరగా మానుతాయి. ►తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. ►రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..! ►శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గ్లాసుడు గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలనూ కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యసమస్యలు తగ్గుముఖం పట్టడంతోపాటు శ్వాస బాగా ఆడుతుంది. ►ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల క్రీడాకారులకు శరీరంలో నీటిశాతం తగ్గి బాగా నీరసించిపోతారు. అలాంటప్పుడు రోజూ సబ్జా గింజలను తీసుకుంటే శరీరంలో తేమను పోనీయకుండా నిలిపి ఉంచుతాయి. ►గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలతో బాధపడేటప్పుడు కాసిని సబ్జా గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేస్తే సరి.. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి. ►వీటిలో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా–3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రావు. ►బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి ఈ గింజలు. ►మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో కలిపి కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది.. కాసిని సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి ఇంతవరకూ తీసుకోనివారు ఇప్పటినుంచి సబ్జాగింజలను నానబెట్టి తాగడం అలవాటు చేసుకోవడం మంచిది కదా! -
కిడ్నీ సమస్యలకు బీన్స్, తులసి, ద్రాక్ష
ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడాలేకుండా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఆహార అలవాట్లు, జీవన విధానంలో మార్పుతో ఈ సమస్య సాధారణంగా మారింది. ఈ సమస్య రాకుండా, అప్పటికే సమస్య ఉంటే అది పెద్దది కాకుండా చూసుకోవాలంటే అది మన చేతిలో పనే. కిడ్నీ బీన్స్(రాజ్మా): ఈ బీన్స్ మన నాలుకకు ఎంత రుచిని ఇస్తాయో, ఆరోగ్యానికి అంతకన్నా ఎక్కువ మేలు చేస్తాయి. నాలుగు లీటర్ల నీటిలో మధ్యకు చీల్చిన అరవై గ్రాముల బీన్స్ గింజలను వేయాలి. ఈ నీటిని నాలుగు గంటలపాటు సన్నటి మంట మీద ఉంచి మరగనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని సుమారు 8 గంటల పాటు చల్లబరచాలి. చల్లారిన మిశ్రమాన్ని మళ్లీ వడకట్టుకోవాలి. రోజులో రెండు గంటలకోసారి ఈ డికాషన్‌ను గ్లాసు చొప్పున తీసుకోవాలి. ఇలా వారంలో కొన్నిసార్లు తీసుకోవాలి. డికాషన్ తయారయిన 24 గంటలలోపే అది ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్‌లో సమస్యలు, ఏ ఇతర సమస్యలున్నా ఇది మంచి చిట్కా. తులసి ఆకులు: తులసి ఆకులకు ఒక టీస్పూన్ తేనె కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్‌ని ఆరునెలల పాటు ప్రతి రోజు తీసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీలోని రాళ్ల పరిమాణం తగ్గి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ద్రాక్ష: ద్రాక్షలో అధిక శాతం నీరు, పొటాషియం, సాల్ట్ ఉంటాయి. ఇవి మూత్రపిండ సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే పుచ్చకాయ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్య తలెత్తదు. ఇది చాలా సురక్షితమైనది కూడా. -
తులసి చెట్టు గొప్పతనం
మీకు తెలుసా? ఇంటింటా తులసి మొక్కను పెంచడం, పూజించడం హిందూ సంప్రదాయం. తులసి మొక్కల్ని ఒక బృందావనంలా పెంచడం, ఆ తులసి కోట దగ్గర నిత్యం ధూప దీపారాధన స్త్రీలకు సనాతనంగా వస్తున్న విధి. అందులోనూ కార్తిక మాసంలో అది ఇంకా విశేషం. అంత మహత్తరమైన ప్రాధాన్యం తులసికి ఇచ్చారు. తులసీ మాహాత్మ్యం గురించి మన పురాణాలు, ఇతిహాసాలు స్పష్టంగా చెప్పాయి. తులసీ మాహాత్మ్యం గురించి సాక్షాత్తూ వ్యాసమహర్షి, ధర్మరాజుకు ఇలా చెప్పాడు... ‘‘సాక్షాత్తూ బ్రహ్మదేవుడు సైతం తులసి గొప్పదనాన్ని పూర్తిగా వర్ణించలేనన్నాడు. అయితే, ఆయన నారదుడికి చెప్పిన మాట ఏమిటంటే - కార్తిక మాసంలో తులసి పూజ చేసినవారు స్వర్గానికి వెళతారు. తులసీ దళాలతో కూడిన నీటితో స్నానం చేస్తే, తుదిశ్వాస విడిచాక వైకుంఠానికి చేరుకుంటారు. ఎవరైతే ఒక బృందావనంగా తులసి మొక్కల్ని పెంచుతారో వారికి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో నివసించడం, తులసి చెట్టు పెంచడం, తులసి పూసల మాల ధరించడం, తులసి ఆకులు తినడం వల్ల సమస్త పాపాలూ పోతాయి. యమకింకరులు తులసి చెట్టు సమీపానికి కూడా రారు.‘యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతా, యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీమ్ త్వామ్ నమామ్యహమ్’ ‘ఏ చెట్టు మూలంలో అయితే సమస్త తీర్థాలూ ఉన్నాయో, ఏ చెట్టు మధ్యలో అయితే సర్వదేవతలూ వసిస్తున్నారో, ఏ చెట్టు అగ్రభాగంలో సమస్త వేదాలూ ఉన్నాయో - అలాంటి తులసి చెట్టుకు నమస్కరిస్తున్నాను’ అనే మంత్రం చదివితే, అన్ని సమస్యలూ, కష్టాలూ నశిస్తాయి. అకాల మృత్యు భయం ఉండదు.’’అని శాస్త్రవచనం. - మహతి -
పాత ఇళ్లు కూలి ముగ్గురి మృతి
- ముగ్గురికి గాయాలు మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆగకుండా కురుస్తున్న వర్షానికి పలు పాత భవనాలు, ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేరు వేరు ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని కొలిగడ్డవీధిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో కళావతి(35), తులసి(7) అనే ఇద్దరు మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సదాశివపేట మండలంలోని ముబారక్‌పూర్‌లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న నడ్డిమెట్టి శ్యామమ్మ(65) అనే వృద్ధురాలు మృతిచెందింది. శ్యామమ్మ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరో వైపు.. జిల్లాలోని జిన్నారం మండలం కనుకుంట గ్రామంలో ఇల్లు కూలి ఇద్దరు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. -
ఔషధ మొక్కల తల్లి తులసి
న్యూఢిల్లీ: భారతీయులు అతి పవిత్రంగా భావించే మొక్కల్లో ముఖ్యమైంది ’తులసి‘. ఇంటి ముందు తులసి లేని ఇళ్లు చాలా తక్కువ. ఈ మొక్కతో ఎన్నో ప్రయోజనాలు. అనేక ఔషధాల్లో తులసిని ఉపయోగిస్తారు. దీన్ని ఔషధ మొక్కలకు తల్లిగా అభివర్ణిస్తారు. తులసి మీద ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా భారత శాస్త్రవేత్తలు తులసి జీనోమ్ (జన్యుక్రమం) ను కనుగొన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ప్రత్యేకంగా పెంచిన తులసి మొక్కల నుంచి సేకరించిన ఆకుల కణజాలాల్ని విశ్లేషించి జన్యుక్రమాన్ని గుర్తించారు. ఈ ఫలితంతో భవిష్యత్‌లో తులసి నుంచి మరెన్నో ఔషధాలు తయారు చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ జన్యుక్రమాన్ని గుర్తించడం ద్వారా వైద్యరంగంలో తులసితో కొత్త ఔషధాలు తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఔషధ రంగానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు తెలిపారు. తులసిలో ఫినైల్ ప్రోపనాయిడ్స్, టెర్పనాయిడ్స్లాంటి అనేక కర్బన పదార్థాలున్నాయి. వీటివల్లే దీనికి ఎక్కువగా ఔషధ లక్షణాలొచ్చాయి. తులసిలో అనేక జాతులున్నాయి. అనేక చికిత్సల్లోనూ: తులసిని దేశంలోనూ, విదేశాల్లోనూ అనేక ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. ఆయుర్వేదం, సిద్ధ, యునాని, గ్రీకు, రోమన్ వైద్య చికిత్సల్లో ప్రధానంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇక మన దేశంలో గృహ వైద్యంలో తులసిది ప్రత్యేక స్థానం. ఈ మొక్క అన్ని భాగాలూ ఔషధ గుణాన్ని కలిగి ఉన్నాయి. తులసి వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు కొన్ని నీళ్లల్లో తులసి ఆకులను మరిగించి తాగడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. దగ్గు కూడా తొలగిపోతుంది. శ్వాస సంబంధ సమస్యలు, జ్వరాన్ని నివారించే లక్షణాల్ని తులసి కలిగి ఉంది. ఆరు నెలల పాటు తులసి, తేనె కలిసి తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరు మెరుగవుతుంది. కిడ్నీల్లో రాళ్లు కూడా కరుగుతాయి. దంత సమస్యలు, తలనొప్పి, కంటి సమస్యల నివారణలో కూడా తులసిని వినియోగిస్తారు. -
నాటి బ్యూటీస్ నేటి ఆంటీస్‌గా...
పాత్రల ప్రాముఖ్యత, పరిధిల్లో ట్రేడ్ ఉండవచ్చునేమో గానీ సినిమాల్లో నాయికానాయకులు లేని చిత్రాలు అరుదే. కమర్షియల్ అంశాలకు హీరో ఎంత అవసరమో కనువిందు చేయడానికి హీరోయిన్ అంతే అవసరం. కొన్ని చిత్రాల్లో హీరోయిన్లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అలా అందం, అభినయంతోను తమ సత్తా చాటి ప్రముఖ కథానాయికలుగా రాణించిన పలువురు తరువాత వివాహ బంధాలతో సంసార జీవితంలోకి వెళ్లిపోయూరు. కొంతకాలం పాటు మాతృత్వ మాధుర్యాన్ని చవిచూశారు. పిల్లా పాపలతో సుఖ సంతోషాలను అనుభవించి, మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఏదేమైనా నాడు బ్యూటీస్‌గా వెలుగొందిన భామలు నేడు ఆంటీస్‌గా రాణిస్తున్నారు. మరి కొందరు ఆ ప్రయత్నంలో ఉన్నారు. వీరిని ఒక్కసారి పరిశీలిస్తే అతిలోక సుందరి బిరుదు సొంతం చేసుకున్న శ్రీదేవితోపాటు నదియ, మనీషా కొయిరాలా, గౌతమి, మధుబాల, అమల, తులసి, జ్యోతిక, అభిరామి, కిరణ్రాథోడ్, ప్రియా ఆనంద్, లైలా తదితరులు సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రల్లో అలరించడానికి రెడీ అయ్యారు. గౌతమి పునరాగమనం పదహారణాల తెలుగమ్మాయి గౌతమి తమిళంలో వర్ధమాన నటుల నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ కమలహాసన్ వరకు జోడి కట్టి ప్రముఖ హీరోయిన్గా రాణించారు. ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా వున్న గౌతమి తాజాగా తాను సహజీవనం చేస్తున్న నటుడు కమలహాసన్‌తోనే. పాపనాశం చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఈమె ముగ్గురు పిల్లల తల్లిగా నటిస్తున్నారు. ఇంకా తెలుగు బుల్లితెరపై కొన్ని నృత్య సంగీత కార్యక్రమాలకు ఈమె న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. అతిలోక సుందరి సీనియర్ నటి శ్రీదేవి విషయానికొస్తే ఇద్దరు పిల్లల తల్లి. ఆమె పెద్ద కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సుదీర్ఘ విరామం తరువాత ఆమె ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. ఆ చిత్రానికి ఆమె ప్రధానం అయినా ఆంటీ పాత్రనే పోషించి మెప్పించారు. ఆ తరువాత చిన్న గ్యాప్ తీసుకుని, తాజాగా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న గరుడ చిత్రంలో ముఖ్యపాత్ర చేస్తున్నారు. అదే విధంగా తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా పలు చిత్రాలు చేసిన నటి నదియ ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రం ద్వారా ఆ చిత్ర హీరో జయం రవికి తల్లిగా నటించారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆ తరువాత వరుసగా అమ్మగా, అత్తగా, అక్కగా పలు చిత్రాల్లో నటి స్తున్నారు. బుల్లి తెరపై మెరుపులు అమలా నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతోపాటు తెలుగులోను క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. నాగార్జునను వివాహమాడిన తరువాత నటనకు దూరంగా ఉన్నారు. ఈమె కొడుకు అఖిల్ ఒక పక్క హీరోగా పరిచయం అవుతుంటే అమల మళ్లీ నటిగా పునఃప్రవేశం చేయడం విశేషం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించిన ఈమె తాజాగా తమిళంలో ఒక మెగా సీరియల్లో నటిస్తున్నారు. అదే విధంగా అజిత్ సరసన కాదల్‌మన్నన్ చిత్రంలో నటించిన మాను కొంతకాలం చిత్రాలకు దూరంగా సింగపూరులో నివసించారు. మళ్లీ ఇటీవల ఎన్న సత్తం ఇంద నేరం చిత్రం ద్వారా రీ ఎంట్రీ అయ్యారు. మాళవిక, లైలా, ప్రియారామన్ తదితరులు బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నారు. వీరంతా సినిమానే లోకంగా జీవిస్తున్న తారలు. వీరి పునః ప్రవేశానికి సంపాదన ఒక్కటే కారణం కాదు. దానిని మించి నటనపై మమకారం అని చెప్పవచ్చు. ఏడేళ్ల తరువాత... కోలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్గా వెలిగిన జ్యోతిక నటుడు సూర్యతో కలిసి ఏడు చిత్రాలు చేసి ఏడేళ్లు ఆయనతో ప్రేమబంధాన్ని పెంచుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఏడేళ్ల విరామం తరువాత జ్యోతిక నటిగా రీ ఎంట్రీ అయ్యారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యు చిత్ర తమిళ రీమేక్‌లో జ్యోతిక నటిస్తున్నారు. ఇది వివాహానంతరం స్త్రీలు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇంతకుముందు కథనాయికిగా విజయ విహారం చేసిన రమ్యకృష్ణ ప్రస్తుతం ఆంటీ పాత్రలతో అలరిస్తున్నారు. పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న దేవయాని ఆ తరువాత బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం నగరంలోనే ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె తాజాగా సహాబ్దం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు కమలహాసన్ సరసన విరుమాండి చిత్రంతోపాటు ప్రభు తదితర ప్రముఖ హీరోలతో డ్యూయెట్లు పాడిన అభిరామి హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం ద్వారా మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్నారు.