అప్పటివరకూ ఎక్కడ ఉంటుందో తెలియదు కాని సీజన్ మారగానే ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ నివారణకు చిట్కాలు.
►జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్ టాబ్లెట్‌లు వాడవచ్చు. జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టించాలి..
►రోజులో కనీసం మూడుసార్లయినా పసుపు లేదా, అదుబాటులో ఉండే జండూబామ్ వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు ఉపశమనం కలుగుతుంది.
► ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దల దాకా అందరూ కాచి, చల్లార్చి వడపోసిన నీళ్లు మాత్రమే తాగితే మంచిది.
► జలుబు లక్షణాలను త్వరగా తగ్గించే వాటిలో ముఖ్యమైనది నిమ్మపండు.. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.
► మిరియాలు, వెల్లుల్లి, అల్లం వంటివి ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి.
► జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు ఆవనూనెకు వెల్లుల్లి కలిపి చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మసాజ్ చేయాలి.
► పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఆరారగా మంచినీరు తాగిస్తుండటం వల్ల కోల్పోయిన నీటి శాతం భర్తీ అయి శరీరానికి వ్యాధితో సమర్థంగా పోరాడగల శక్తి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment