జలుబు, దగ్గు నుంచి బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి | Natural Remedies To Reduce Cold And Cough | Sakshi
Sakshi News home page

Home Remedies: జలుబు, దగ్గు నుంచి బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

Published Sat, Jun 17 2023 3:04 PM | Last Updated on Thu, Jul 27 2023 7:12 PM

Natural Remedies To Reduce Cold And Cough - Sakshi

వేసవికాలం ముగిసింది. వర్షాకాలం వచ్చేస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దగ్గు, జలుబులు వంటివి సర్వసాధారణం. ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కానప్పటికీ, ఇది ఒకరి నుంచి మరొకరి అంటుకునే అవకాశం ఉంటుంది. తరచుగా దగ్గు, జలుబు నుంచి వంటింటి చిట్కాలతో సత్వర ఉపశమనం పొందొచ్చు.
 

  • తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
  • ఓ నాలుగైదు తమలపాకులను వెచ్చచేసి, వాటిని నూరి రసం తీసి, దానిలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
  • ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచాలి. దీనిని ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి.
  • గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్‌ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం పంచదార కలిపి, రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement