అమెరికన్ ఫిట్‌నెస్ ఇన్‌ప్లుయెన్సర్, ఎక్స్‌ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్ల వయసులోనే అనూహ్యంగా మరణించింది. ఎలాంటి కారణాలు లేకుండానే చనిపోయింది. ఓ రెస్టారెంట్‌కి భోజనానికి వెళ్లినప్పుడూ ఈ ఘటన జరిగింది. దీంతో ఆమె మరణానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేయగా చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బరువు తగ్గాలనుకోవడమే ఆమెకు శాపమైందా? త్వరిగతిన బరువు తగ్గితే ప్రాణాలు కోల్పోతామా? తదితరాల గురించే ఈ కథనం.!
అమెరికాలోని 40 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్ బ్రాందీ మల్లోరీ 2014లో ఏబీసీ వెయిట్ లాస్ రియాలటీ షోతో ఒక్కసారిగా ఆమె పేరు వార్తల్లో మారుమ్రోగిపోయింది. ఎందుకంటే? అక్కడ ఆ వెయిట్‌లాస్ షోలో ఏకంగా మల్లోరి 70 కిలోల బరువు తగ్గింది. విపరీతమైన బరువుతో బాధపడుతున్నవారికి ఆమె ఆదర్శంగా నిలిచింది. ఆమెలా బరువు తగొచ్చనే ఆలోచనను రేకెత్తించింది. అయితే ఆమె ఓ రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేసి తెచ్చుకుని కార్ వద్దకు వచ్చింది. అంతే ఆ తర్వాత ఆమె ఏమయ్యిందో ఏమో!..ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె మరణానికి గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేయగా కారణాలు ఏమి తెలియలేదు.
చివరకి బరువు తగ్గేందుకు ఆమె తీసుకున్న విధానమే కారణమా? అనే సందేహలు తలెత్తాయి. దీంతో ఆ దిశగా విచారణ చేయగా.. బరువు తగ్గడం కోసం చేసే విపరీతమైన వ్యాయామాలు కారణంగానే చాలామంది చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అందుకోసం వారి అనుసరించే కట్టుదిట్టమైన డైటే.. ప్రధాన కారణం అని అన్నారు. "సడెన్‌గా కేలరీలు పరిమితంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, వల్ల బరువు తొందరగా తగ్గొచ్చు గానీ అది మీ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే? పోషకాహార లోపం, అలసట, కండరాల నష్టానికి దారితీస్తుంది.
ఇది శరీరంలోని జీవక్రియలకు ప్రభావితం చేసి ఆరోగ్యంపై ప్రభావం ఏర్పడుతుంది. అలాగే ఆకలిని నియంత్రించే సప్లిమెంట్స్ కూడా ప్రమాదమే. అవి మధుమేహం వంటి ఇతరత్ర వ్యాధులకు దారితీసి ప్రాణాంతకం కావొచ్చు. కొందరూ బారియాట్రిక్ సర్జరీలతో గణనీయమైన బరువు తగ్గేలా లక్ష్యం పెట్టుకుంటున్నారు. దీని వల్ల స్పీడ్‌గా బరువు తగ్గినప్పటికీ జీవితాంతం ఆహార నియమాలు పాటించాల్సిందే. ఏదిపడితే అది తినకూడదు. అందువల్ల త్వరితగతినే బరువు తగ్గేందుకు అనుసరించే పద్ధతులకు మన శరీరం వెంటనే సహకరించలేదు. మనం సడెన్‌గా మొదలు పెట్టే డైట్‌కి మన శరీర వ్యవస్థ అడ్జెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి నిధానంగా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గే యత్నాలు చేయండి అని హితువు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇలానే హఠాన్మరణాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
(చదవండి: పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment