పర్సుని ఫ్యాంటు వెనుక జేబులో పెడుతున్నారా? | Does Wearing A Purses And Bags Cause Neck And Back Pain, Know About What Experts Says - Sakshi
Sakshi News home page

పర్సుని ఫ్యాంటు వెనుక జేబులో పెడుతున్నారా? ఐతే ఈ సమస్యలు తప్పవు!

Published Mon, Oct 2 2023 11:27 AM | Last Updated on Mon, Oct 2 2023 3:04 PM

Does Wearing A Purse Cause Neck And Back Pain - Sakshi

మనం నిత్యం సాధారణంగా భావించి చేసే పనులు ఒక్కోసారి చేటు తెస్తాయి. ఎంతలా అంటే అందువల్లే మనకు ఈ సమస్య వచ్చిందని వైద్యులు లేదా మరేవరైన ఆరోగ్య నిపుణుడు చెప్పేంతవరకు గమనించం. మనం ఊహించను కూడా ఊహించం అలా చేయడం అంత ప్రమాదమా! అని ఆ తర్వాతగానీ తెలిసి రాదు. ఎందుకంటే చాలామంది ఇలాంటి పనులు రోజువారి జీవితంలో సాధారణంగా చేసేవే కావడం. ఇంతకీ ఎందుకిదంతా అంటే..చాలామంది పర్సు లేదా వాలెట్‌ని మగవారు లేదా స్త్రీలు బాక్‌ పాకెట్‌లోనే పెట్టుకుంటుంటారు. చాలా సర్వసాధారణమైన విషయం కూడా. ఐతే అలా అస్సలు పెట్టకూడదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్లే తలెత్తే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఓ ఏజ్‌ వచ్చేటప్పటికి సరిగా నడవలేక వంగిపోవడానికి కారణం కూడా ఇదే అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు. 

పర్సు వల్ల ఆరోగ్య సమస్యలా అని ఆశ్చర్యపోకండి!. ఔను! దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయంటే..చాలా మంది మెడ, భుజాలు, వెన్ను సమస్యలను తరుచుగా ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం పర్సుని వెనుక జేబులో పెట్టడమేనని అంటున్నారు. మనం బ్యాక్‌ పాకెట్‌లో పెట్టే వాలెట్‌ని బట్టి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. బరువైన వాలెట్‌ని తీసుకొచ్చి బ్యాక్‌ పాకెట్‌లో పెట్టడం వల్ల తెలియకుండా ఆ బరువు కారణంగా కొంత ఒత్తిడి కండరాలు, స్నాయువులపై పడి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా అది కాస్త దీర్ఘకాలిక కీళ్ల నొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 

వెన్నుపై ఎలా ప్రభావం పడుతుందంటే..
పర్సు ఓ మోస్తారు బరువు ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ మనం క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, వోచ్చర్స్‌, ఆధార్‌ కార్డులని ఇలా ఎన్నో కార్డులతో బరువుగా నింపేస్తాం. పోనీ అక్కడితో ఊరుకోకుండా దాన్ని తీసుకెళ్లి బ్యాక్‌ జేబులో ఏదోరకంగా కుక్కి ఎత్తుగా కనపడకుండా ఉండేలా పైన ఉన్న షర్ట్‌ లేదా టీషర్టుని సరిచేసుకుంటాం. ఔనా! దీంతో తుంటి ఎముకలోని కండరాలు, కీళ్లు ఒత్తడికి గరయ్యి ఒకవైపు ఒంగిపోతాయి.

అంతేందుకు మనం ఎక్కువ బరువుని మోస్తే ఆటోమోటిక్‌గా ఒకవైపుకి వంగి నడుస్తాం. మనకు తెలియకుండాని మన నడక వంకర అవుతుంది. దీంతో వెన్ను, తుంటి, కాలు, భుజాలలో నొప్పి మొదలై అసౌకర్యంగా ఉంటుంది. మన బ్యాక్‌ సైడ్‌పెట్టే బరువు వెన్నుపూసపై గట్టి ప్రభావం చూపిస్తుంది. చెప్పాలంటే పూసలు కదలడం లేదా వెన్ను ఒకవైపు వంకర అ‍య్యే ప్రమాదం లేకపోలేదు. అంతేగా ఆ నొప్పి అక్కడ నుంచి మెడకు, భుజాలకు  పాకి కీళ్ల నొప్పుల్లోకి పెట్టేస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు వాలెట్‌ని బరువుగా ఉండనివ్వొద్దని వార్నింగ్‌ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

కార్డులతో పనిలేకుండా..
నిజానికి, అనేక దుకాణాలు పంచ్ కార్డ్‌ని ఉపయోగించకుండా యాప్ ద్వారా లాయల్టీ పాయింట్‌లను ఉపయోగించేలా అనుమతిస్తాయి కూడా. మీరు చాలా బిల్లులు కట్టేందుకు ఆయా కార్డులు పట్టికెళ్లాల్సి ఉంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని కార్డులు తగ్గించే యత్నం చేయండి.  పంచ్‌ కార్డ్‌లు, బిజినెస్‌ కార్డులు, రివార్డు కార్డ్‌లు తదితర ఎలాంటి కార్డులైన తీసుకుని వెళ్లడం తగ్గించేలా యత్నం చేయాలి.

అన్నింటిని రోజు మోసుకుంటూ వెళ్లాల్సి అవసరం లేదు. సాధ్యమైనంత వరకు వాలెట్‌ లేదా పర్సులో కార్డుల సంఖ్య పరిమితిగా ఉండి బరువు లేకుండా ఉండేలా చూసుకోండి. తద్వారా చిన్నగా ప్రారంభమయ్యే ఈ వీపు, మెడ, భుజాలు, కాళ్లు సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చని వైద్యలు నొక్కి చెబుతున్నారు. 

(చదవండి: డీజే మ్యూజిక్‌ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement