Purse
-
IPL 2024: ఏప్రిల్ 16న ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ భేటి
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చించేందుకు బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీల ఓనర్లతో భేటి కానున్నట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ ఏప్రిల్ 16న అహ్మదాబాద్‌లో జరుగనున్నట్లు సమాచారం. 2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్, పర్స్ వ్యాల్యూ తదితర అంశాలు అజెండాగా ఉండవచ్చని తెలుస్తుంది. గతేడాది మినీ వేలంలో 100 కోట్లకు పెరిగిన ఫ్రాంచైజీ పర్స్ వ్యాల్యూ రానున్న సీజన్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, 2024 ఐపీఎల్ సీజన్ రసపట్టుగా సాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 13 మ్యాచ్‌లు అభిమానులకు కావల్సినంత మజాను అందించాయి. ఈ సీజన్లో ఇంకా 61 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సీఎస్కే, రాజస్థాన్, గుజరాత్, సన్‌రైజర్స్, లక్నో, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, ముంబై వరుస స్థానాల్లో ఉన్నాయి. వాంఖడే వేదికగా ఇవాళ (ఏప్రిల్ 1) ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. -
పర్సుని ఫ్యాంటు వెనుక జేబులో పెడుతున్నారా?
మనం నిత్యం సాధారణంగా భావించి చేసే పనులు ఒక్కోసారి చేటు తెస్తాయి. ఎంతలా అంటే అందువల్లే మనకు ఈ సమస్య వచ్చిందని వైద్యులు లేదా మరేవరైన ఆరోగ్య నిపుణుడు చెప్పేంతవరకు గమనించం. మనం ఊహించను కూడా ఊహించం అలా చేయడం అంత ప్రమాదమా! అని ఆ తర్వాతగానీ తెలిసి రాదు. ఎందుకంటే చాలామంది ఇలాంటి పనులు రోజువారి జీవితంలో సాధారణంగా చేసేవే కావడం. ఇంతకీ ఎందుకిదంతా అంటే..చాలామంది పర్సు లేదా వాలెట్‌ని మగవారు లేదా స్త్రీలు బాక్ పాకెట్లోనే పెట్టుకుంటుంటారు. చాలా సర్వసాధారణమైన విషయం కూడా. ఐతే అలా అస్సలు పెట్టకూడదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్లే తలెత్తే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఓ ఏజ్ వచ్చేటప్పటికి సరిగా నడవలేక వంగిపోవడానికి కారణం కూడా ఇదే అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు. పర్సు వల్ల ఆరోగ్య సమస్యలా అని ఆశ్చర్యపోకండి!. ఔను! దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయంటే..చాలా మంది మెడ, భుజాలు, వెన్ను సమస్యలను తరుచుగా ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం పర్సుని వెనుక జేబులో పెట్టడమేనని అంటున్నారు. మనం బ్యాక్ పాకెట్లో పెట్టే వాలెట్‌ని బట్టి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. బరువైన వాలెట్‌ని తీసుకొచ్చి బ్యాక్ పాకెట్లో పెట్టడం వల్ల తెలియకుండా ఆ బరువు కారణంగా కొంత ఒత్తిడి కండరాలు, స్నాయువులపై పడి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా అది కాస్త దీర్ఘకాలిక కీళ్ల నొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వెన్నుపై ఎలా ప్రభావం పడుతుందంటే.. పర్సు ఓ మోస్తారు బరువు ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వోచ్చర్స్, ఆధార్ కార్డులని ఇలా ఎన్నో కార్డులతో బరువుగా నింపేస్తాం. పోనీ అక్కడితో ఊరుకోకుండా దాన్ని తీసుకెళ్లి బ్యాక్ జేబులో ఏదోరకంగా కుక్కి ఎత్తుగా కనపడకుండా ఉండేలా పైన ఉన్న షర్ట్ లేదా టీషర్టుని సరిచేసుకుంటాం. ఔనా! దీంతో తుంటి ఎముకలోని కండరాలు, కీళ్లు ఒత్తడికి గరయ్యి ఒకవైపు ఒంగిపోతాయి. అంతేందుకు మనం ఎక్కువ బరువుని మోస్తే ఆటోమోటిక్గా ఒకవైపుకి వంగి నడుస్తాం. మనకు తెలియకుండాని మన నడక వంకర అవుతుంది. దీంతో వెన్ను, తుంటి, కాలు, భుజాలలో నొప్పి మొదలై అసౌకర్యంగా ఉంటుంది. మన బ్యాక్ సైడ్పెట్టే బరువు వెన్నుపూసపై గట్టి ప్రభావం చూపిస్తుంది. చెప్పాలంటే పూసలు కదలడం లేదా వెన్ను ఒకవైపు వంకర అయ్యే ప్రమాదం లేకపోలేదు. అంతేగా ఆ నొప్పి అక్కడ నుంచి మెడకు, భుజాలకు పాకి కీళ్ల నొప్పుల్లోకి పెట్టేస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు వాలెట్‌ని బరువుగా ఉండనివ్వొద్దని వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కార్డులతో పనిలేకుండా.. నిజానికి, అనేక దుకాణాలు పంచ్ కార్డ్‌ని ఉపయోగించకుండా యాప్ ద్వారా లాయల్టీ పాయింట్లను ఉపయోగించేలా అనుమతిస్తాయి కూడా. మీరు చాలా బిల్లులు కట్టేందుకు ఆయా కార్డులు పట్టికెళ్లాల్సి ఉంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని కార్డులు తగ్గించే యత్నం చేయండి. పంచ్ కార్డ్‌లు, బిజినెస్ కార్డులు, రివార్డు కార్డ్‌లు తదితర ఎలాంటి కార్డులైన తీసుకుని వెళ్లడం తగ్గించేలా యత్నం చేయాలి. అన్నింటిని రోజు మోసుకుంటూ వెళ్లాల్సి అవసరం లేదు. సాధ్యమైనంత వరకు వాలెట్ లేదా పర్సులో కార్డుల సంఖ్య పరిమితిగా ఉండి బరువు లేకుండా ఉండేలా చూసుకోండి. తద్వారా చిన్నగా ప్రారంభమయ్యే ఈ వీపు, మెడ, భుజాలు, కాళ్లు సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చని వైద్యలు నొక్కి చెబుతున్నారు. (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
కేంద్రమంత్రి సతీమణి పర్స్ మిస్సింగ్.. పెద్దసంఖ్యలో రంగంలోకి పోలీసులు.. చివరకి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: యాత్ర కోసం కన్యాకుమారి జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి భార్య మనీ పర్స్ కనపడకుండా పోవడం కలకలం రేపింది. పెద్దసంఖ్యలో పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి వెతుకులాట ప్రారంభించి పర్స్‌ను గుర్తించారు. వివరాలు.. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ కారత్ కన్యాకుమారి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మంగళవారం ఉదయం అక్కడి సుచీంద్రం దానుమలయస్వామి ఆలయానికి సతీమణి అంజలికారత్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడ అంజలీకారత్ తన మనీపర్స్ కనపడక పోవడంతో ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది వెదికినా పర్స్ కనపించలేదు. దీంతో బందోబస్తుగా వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆలయ సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. ఇందిర వినాయక సన్నిధిలో ఆమె దర్శనం చేసుకునేటప్పుడు పర్స్ చేతి నుంచి జారి కిందపడినట్లు, దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు దాన్ని తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. నిందితుడు చెన్నైకి చెందిన ఓ జ్యోతిష్కుడి అని తేలింది. అతడు నాగర్‌కోవిల్ రైల్వేస్టేషన్లో రైలు కోసం వేచి ఉన్నట్లు తెలియడంతో, అక్కడికి వెళ్లి పోలీసులు పర్స్‌ను స్వాధీనం చేసుకుని కేంద్ర మంత్రి సతీమణికి అప్పగించారు. చదవండి: ఓపీఎస్‌కు మరో షాకిచ్చిన ఈపీఎస్.. 18 మంది బహిష్కరణ -
‘అదృష్టాన్ని’ పర్సులోనే దాచింది.. 290 కోట్ల లాటరీ!
బెర్లిన్: లాటరీ టికెట్ కొంటే లక్కీ డ్రా తేదీ కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తుంటారు చాలామంది. అలాంటిది ఒకావిడ తాను లాటరీ టికెట్ కొన్న సంగతే మర్చిపోయింది. కొన్న టికెట్ తన పర్సులోనే ఉన్నా దానిని వారాల పాటు ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎలాగోలా లాటరీ ఫలితాల విషయం తెల్సి తన టికెట్ నంబర్‌ను చెక్ చేసుకుంది. తను కొన్న టికెట్‌కే 39 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.290.53 కోట్ల) బంపర్ డ్రా తగిలిందనే విషయం తెలిసి సంభ్రమాశ్చర్యానికి గురైంది. ఈ ఘటన జర్మనీలో ఇటీవలే జరిగింది. జూన్ తొమ్మిదిన లాటరీ ఫలితాలు ప్రకటించారు. 1.20 యూరోలు (దాదాపు రూ.105) పెట్టి టికెట్‌ను కొని ఇన్నాళ్లూ ఆ సంగతే మర్చిపోయిన ఆమె.. ఇటీవలే తన లాటరీ టికెట్‌లోని ఏడు నంబర్లను సరిచూసుకుని ఆనందసాగరంలో మునిగిపోయారు. -
ఈ వీడియో చూసి మీరు నోరెళ్లబెట్టాల్సిందే..!
ఇంతకీ ఏమిటిది.. విషయం తెలిస్తే.. మీరు నోరెళ్లబెట్టాల్సిందే.. ఎందుకంటే.. ఇది ఓ పర్సు.. చూడ్డానికి అచ్చం మనిషి నోరులా కనిపిస్తున్న ఈ వినూత్న పర్సును జపాన్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్, ఆర్టిస్ట్ డూ డిజైన్ చేశారు. ఆ పళ్లు, పెదాలు అన్నీ.. తేడా అస్సలు తెలియనట్లు తయారుచేయడం విశేషం. పర్సు తెరవాలంటే.. ఇలా నోరు తెరవాల్సిందే. ప్రస్తుతానికి దీని తాలూకు వీడియోను డూ తన ట్విటర్ ఖాతాలో పెట్టారు. ఏం సామగ్రితో దీన్ని తయారు చేశారని ప్రశ్నిస్తే.. అది రహస్యమని బదులిచ్చారు. ఇప్పటికే దీని రేటెంత..? కొంటాం అని అడిగేవాళ్లు కూడా ఎక్కువైపోయారు. ప్రస్తుతానికి దీన్ని మార్కెట్లోకి తెచ్చే ఆలోచన తనకు లేదని డూ చెబుతున్నారు. -
పోయిన పర్సు ఇంటికే వచ్చింది!
సాక్షి, హైదరాబాద్: సొమ్ములు పోగొట్టుకున్న ఓ మహిళ ఇంటికి చేరేలోపే ఆమె సొమ్ములు భద్రంగా ఉన్నట్లు పోలీసులు సమాచారం అందించడమేగాక బాధితురాలిని పిలిపించి వాటిని అప్పగించిన సంఘటన బుధవారం అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మలక్‌పేట ఏసీ పీ నర్సింగ్‌రావు, ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట పోచమ్మబస్తీకి చెందిన అలివేలు సొదరుని వైద్యం కోసం తన రెండు తులాల పుస్తెల తాడు, వెంటి పట్టీలను తనఖా పెట్టేందుకు మార్వాడీ దుకాణానికి వెళ్లింది. మార్వాడి ఇస్తానన్న డబ్బులు సరిపోకపోవడంతో ఆమె మరో ఫైనాన్స్ సంస్థకు వెళ్తుండగా శ్రీరమణ చౌరస్తా వద్ద ఆమె పర్స్ పడిపోయింది. ఫైనాన్స్ సంస్థ వద్దకు వెళ్లి చూసుకున్న అలివేలు ఆందోళనకు గురైంది. అదే సమయంలో శ్రీరమణ చౌరస్తా మీదుగా వెళ్తున్న జైస్వాల్ గార్డెన్‌కు చెందిన బుచ్చిబాబుకు రోడ్డుపై దొరికిన పర్సును అంబర్‌పేట పోలీసులకు అప్పగించాడు. పర్సును పరిశీలించిన పోలీసులు అందులో ఉన్న రసీదు ఆధారంగా మార్వాడి దుకాణాన్ని సంప్రదించి అలివేలు అడ్రస్ తెలుసుకున్నారు. పోచమ్మబస్తీలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లేలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరాశగా ఇంటికి చేరుకున్న అలివేలు వద్ద వివరాలు తీసుకుని స్టేషన్‌కు పిలిపించి పర్సును అప్పగించారు. ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పర్స్ అప్పగించిన బుచ్చిబాబును ఏసీపీ అభినందించారు. అలివేలుకు పర్సు అందజేస్తున్న ఏసీపీ నర్సింగరావు -
ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీ
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణం): సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు... వస్తువులు ఏమైనా దొరికితే మెల్లగా జేబులో పడేసేవారు కొందరు. దొరికిన సొమ్ము పోలీసులకు అందజేస్తే నొక్కేస్తారేమోనన్న భయంతో వారికి అందజేయకుండా ఉండిపోయిన వారు మరికొందరు. దొరికిన సొమ్ము/వస్తువులు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయాలన్న తపన ఇంకొందరిది. ఈ కోవకే చెందుతారు విజయవాడ గవర్నర్పేట్ ఆర్టీసీ డిపో డ్రైవర్లు. డబ్బులు, బ్యాంకు ఏటీఎం కార్డులు పోగొట్టుకున్న ఆర్టీసీ ప్రయాణికుడికి అందజేసి వారి నిజాయితీ నిరూపించుకోవడమే గాక ఆర్టీసీకి పేరు తెచ్చిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నం కోటపాడు మండలం కె.గుల్లేపల్లికి చెందిన షేక్ రసూల్ ఈ నెల 2న సాయంత్రం విశాఖ వచ్చేందుకు విజయవాడ – విశాఖపట్నం బస్సు (సర్వీస్ నంబరు 95449, ఏపీ16జెడ్0227))లో ప్రయాణం చేశారు. సీటు నంబరు 30లో కూర్చున్నారు. విశాఖపట్నం ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఆ ప్రయాణికుడు బస్సు దిగిపోయారు. ఆతృతగా దిగిన ఆ వ్యక్తి తను కూర్చున్న సీటులో మనీపర్స్, ఏటీఎం కార్డులు మరచిపోయారు. విశాఖపట్నం ద్వారకా బస్సు స్టేషన్‌కు ఆ బస్సు చేరింది. బస్సు దిగినప్పుడు డ్రైవర్లు ఎం.వి.కాసులు(ఎంప్లాయి నంబరు 370550), ఎం.దానయ్య (ఎంప్లాయి నంబరు 371520) బస్సును పరిశీలించారు. సీటు నంబరు 30లో ప్రయాణికుడు మరచిపోయిన మనీపర్సును గుర్తించారు. ఆ మనీపర్సులో రూ.8,500 నగదు, ఏటీఎం కార్డులు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉన్నాయి. వాటిని ఆ డ్రైవర్లు ఇద్దరూ భద్రపరచి మనీపర్సు పోగొట్టుకున్న రసూల్‌కు ఫోన్‌చేసి ద్వారకా బస్టేషన్‌కు పిలిపించి వాటిని స్టేషన్ మేనేజర్ ద్వారా మంగళవారం అందజేసి నిజాయితీ చాటుకున్నారు. డ్రైవర్ల నిజాయితీని ఇటు ప్రయాణికుడు, అటు ఆర్టీసీ మేనేజర్ అభినందించారు. -
పోగొట్టుకున్న ఐఫోన్ యువతికి అప్పగింత
హైదరాబాద్ (రాంగోపాల్‌పేట్): ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో ఓ యువతి పోగొట్టుకున్న పర్సును దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు దాన్ని తిరిగి ఆమెకు అప్పగించారు. గత సోమవారం శివాజీనగర్‌కు చెందిన స్నేహలత అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చి పొరపాటున తన పర్సును పోగొట్టుకుంది. అందులో రూ.30 వేలకు పైగా విలువ చేసే ఐఫోన్, రూ.3 వేల నగదు, ఏటీఎం, క్రెడిట్ కార్డులు, పాన్‌కార్డు ఉన్నాయి. ఈ పర్సు దేవాలయం వద్ద విధుల్లో ఉన్న దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధికి దొరికింది. దీంతో పర్సులో ఉన్న మొబైల్ నంబర్ల ఆధారంగా ఫోన్లు చేసి సంప్రదించి, యువతి స్నేహలతకు బుధవారం రాత్రి ఐఫోన్, పర్సు అందజేశారు. దక్కన్ మానవ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శీలం ప్రభాకర్, ప్రతినిధులు, సీకే నర్సింగరావు, జ్ఞానేశ్వర్ తదితరులకు ఆ యువతి కృతజ్ఞతలు తెలిపింది. -
శభాష్ ఎస్.ఐ సంపత్‌కుమార్
తుళ్ళూరు: తాళాయపాలెం పుష్కరఘాట్ వద్ద సోమవారం పర్సు పోగొట్టుకున్న వ్యక్తిని వెతికి పట్టుకుని వారికి పరుసును అప్పగించిన ఎస్ఐ సంపత్‌కుమార్‌ను సహ ఉద్యోగులు శభాష్ అని మెచ్చుకున్నారు. తాడికొండ మండలం బండారుపల్లికి చెందిన జాలాపురి వరప్రసాద్ శైవక్షేత్రం సమీపంలో మనీ çపర్సు పోగొట్టుకున్నారు. ఈ పరుసు ఎస్ఐ సంపత్‌కుమార్‌కు దొరికింది. పరుసు దొరికిందనీ, సంబంధీకులు వచ్చి తీసుకెళ్లాలని అప్పుడే మైక్‌లో ప్రచారం చేశారు. అయినా ఎవరూ రాలేదు. దీంతో çపర్సులో ఉన్న కార్డుల ఆధారంగా విచారించి తాడికొండ ఎస్సై సహకారంతో బాధితుడిని పిలిపించి మంగళవారం వరప్రసాద్ దంపతులకు ఎస్సై çపర్సు అందజేశారు. ఈ పరుసులో రూ. 6000 నగదుతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నట్లు వరప్రసాద్ తెలిపారు. ఎస్సై సంపత్కుమార్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. -
తోలు తీయక్కర్లేదు...
షూస్, పర్స్, హ్యాండ్ బ్యాగులను లెదర్ లేదా క్లాత్‌లతో తయారు చేస్తారనే మనకు తెలుసు. అసలు లెదర్‌తో తయారు చేసిన ఏ ఐటమ్నైనా ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఎందుకంటే... క్లాత్ వస్తువులతో పోలిస్తే లెదర్ వస్తువుల నాణ్యత, మన్నిక భేషుగ్గా ఉంటాయి. ఇక్కడ ఫొటోల్లో కనిపిస్తున్న షూస్, బ్యాగ్స్ అచ్చం లెదర్‌తో తయారు చేసినవే అనిపిస్తున్నాయి కదూ! కానే కాదు. వీటి తయారీకి.. జంతువుల తోలు తీయక్కర్లేదు. వినడానికి వింతగా.. కొత్తగా ఉన్నా... ఈ వస్తువులన్నింటికీ ముడి పదార్థం పైనాపిల్ (అనాస పండు) ఆకులు. ఈ పైనాపిల్ ఆకులతో లెదర్ వంటి పదార్థం తయారీకి పెద్ద కృషే జరిగింది. ఐర్లాండ్‌లో కార్మెన్ హిజోసా అనే మహిళ ఓ లెదర్ కంపెనీలో పనిచేసేది. ఎప్పుడూ ఇన్నొవేటివ్‌గా ఆలోచించే తనకు, ఓ రోజు కొత్త ఐడియా వచ్చింది. దానిని ఆచరణలో పెట్టేందుకు ఐదేళ్లు అవిశ్రాంతంగా శ్రమించి, జంతుచర్మం అవసరంలేని కొత్తరకం లెదర్ తయారీకి శ్రీకారం చుట్టింది. పైనాపిల్ ఆకులను గుజ్జుగా చేసి, దానికి మరికొన్ని పదార్థాలు జతకలిపి, జంతుచర్మంతో తయారయ్యే లెదర్‌కు దీటైన పదార్థాన్ని తయారు చేసింది. పైనాపిల్ ఆకులతో తయారు చేసినందున దీనికి ‘పైనాటెక్స్’ అని కూడా నామకరణం చేసింది. జంతుచర్మంతో తయారైన లెదర్ వస్తువుల కంటే పైనాటెక్స్తో తయారు చేసిన వస్తువులు ధృడంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఒక చిన్నసైజు హ్యాండ్‌బ్యాగ్ తయారీకి 16 పైనాపిల్స్ ఆకులు సరిపోతాయట. జంతువధను ఇష్టపడని జంతుప్రేమికులకు ‘పైనాటెక్స్’ వస్తువులు కచ్చితంగా నచ్చుతాయి. స్వచ్ఛంద లెదర్ నిషేధం పాటించే వారు సైతం, ‘పైనాటెక్స్’ వస్తువులతో ఫ్యాషన్ రంగంలో దూసుకుపోయేందుకూ ఇవి ఇంచక్కా పనికొస్తాయి. -
హోంగార్డు నిజాయితీ
రాజోలు : తనకు లభించిన పర్సును నిజాయితీగా సంబంధిత వ్యక్తికి అప్పగించిన హోంగార్డును పలువురు ప్రశంసించారు. వివరాల్లోకి వెళితే.. రాజోలు సీఐ జీవీ కృష్ణారావు జీపు డ్రైవర్ సురేష్ హైదరాబాద్ ఏసీబీ కార్యాలయ ఏఓ డ్రైవర్‌గా 10 రోజుల పాటు విధి నిర్వహణకు వెళ్లాడు. ఈనెల 12వ తేదీన అక్కడ సురేష్ తన రూమ్‌కు వెళ్తుండగా ఓ పర్సు దొరికింది. అందులో రూ. 9 వేలు, మూడు ఏటీఎం కార్డులు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, బస్సు పాస్ ఉన్నాయి. ఈ విషయాన్ని వెంటనే సురేష్ సీఐ కృష్ణారావుకు తెలిపారు. బస్‌పాస్‌లో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా పర్సు పోగొట్టుకున్న వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అశోక్‌కుమార్‌గా గుర్తించి ఆయనకు సురేష్ ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆయన రాకపోవడంతో సురేష్ రాజోలు వచ్చేశారు. పలుమార్లు ఫోన్ చేయగా అశోక్‌కుమార్ హైదరాబాద్ నుంచి శనివారం రాజోలు రాగా సీఐ కృష్ణారావు సమక్షంలో పర్సుతోపాటు నగదు, ఏటీఎం కార్డులు అందజేశారు. హోంగార్డు సురేష్ నిజాయితీని పలువురు ప్రశంసించారు. -
నిజాయితీ చాటిన ఆటో డ్రైవర్
ఘట్కేసర్(రంగారెడ్డి): ఓ మహిళ ఆటోలో ప్రయాణిస్తుండగా పర్సు అందులో పడిపోయింది. ఆమె దిగిపోయిన తర్వాత డ్రైవర్ గమనించి అందులో ఉన్న రూ.27 వేలు సురక్షితంగా తిరిగివ్వడంతో అందరూ అభినందించారు. వివరాలు.. ఘట్‌కేసర్‌కుచెందిన జి.గోపాల్ వృత్తిరీత్యా డ్రైవర్. నిత్యం తన ఆటోను నగరంలోని ఈసీఐఎల్‌కు నడుపుతూ ప్రయాణికులకు చేర వేస్తుంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 11 గంటలకు మండలంలోని మైసమ్మగుట్టకాలనీకి చెందిన మైసమ్మతోపాటు మరికొందరు కలిసి ఘట్కేసర్లో అతని ఆటోలో ఎక్కారు. కొద్దిసేపటికి మిగతా ప్రయాణికులతో కలిసి ఆమె ఈసీఐఎల్‌లో దిగింది. అనంతరం సీటు కింద చిన్నపర్సు ఉండటాన్ని డ్రైవర్ గమనించాడు. అందులో ఉన్న రూ.27 వేలను నేరుగా ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అందజేశాడు. మధ్యాహ్నం మూడు గంటలకు బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన పర్సు ఆటోలో పోగొట్టుకున్నానని చెప్పింది. దీంతో ఆటో డ్రైవర్ గోపాల్‌తోపాటు సంఘం నాయకుడు సుధాకర్‌ను పిలిపించారు. పోలీసుల సమక్షంలో డబ్బులున్న పర్సును మైసమ్మకు ఇవ్వడంతో అతని నిజాయితీని అందరూ అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐలు వీరభధ్రం, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
బస్టాండ్‌లో దొంగలు..
అందినకాడికి దోచుకుంటున్నారు అదును చూసి పర్సులు కొట్టేస్తున్న చోరులు మెడల్లోంచి గొలుసులు తెంపుకెళ్తున్న కేటుగాళ్లు ఆదమరిస్తే ఒంటిమీదున్న వస్తువులూ మాయం పోలీసులున్నా.. ప్రయోజనం సున్నా పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం 2013 జనవరి నుంచి ఇప్పటివరకు నిజామాబాద్ బస్టాండ్‌లో 132 చోరీ కేసులు నమోదయ్యాయి. సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, ఆరు బైకులు, రెండు ల్యాప్‌టాప్‌లు ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. వాటి వివరాలిలా ఉన్నాయి. గొలుసు దొంగతనాలు 16 బైకులు 06 కంప్యూటర్ పరికరాలు 02 చిల్లర దొంగతనాలు 12 ఇతర దొంగతనాలు 96 నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్ : నిజామాబాద్ బస్టాండ్ ఆవరణలో దొంగల బెడద ఎక్కువైంది. ఆదమరిస్తే ఒంటిమీద ఉన్న నగలను దోచేస్తున్నారు. ప్రయాణికులు బస్సులో సీటు సంపాదించడం కోసం ఆరాటపడే సమయం లో చోరులు తమ కళను ప్రదర్శిస్తున్నారు. పర్సులు, గొలుసులు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. సీట్లో కూర్చున్న తర్వాతగానీ ప్రయాణికులకు తెలియడం లేదు తమ వస్తువులు చోరీకి గురయ్యాయని. ఇలా రోజూ ఇద్దరు ముగ్గురైనా తమ వస్తువులు పోగొట్టుకుంటున్నారు. చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని తెలుస్తోంది. బస్టాండ్‌లోని పోలీసు బూత్ వద్ద కు వచ్చి మొరపెట్టుకోవడం, తమ ఖర్మ ఇంతేనని ఇంటికి వెళ్లి పోవడం చేస్తున్నారు. రోజూ లక్షల మంది ప్రయాణం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ మీదుగా నిత్యం 1,125 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుం టాయి. అంతర్రాష్ట్ర బస్సులు అదనం. వీటిద్వారా సుమారు రెండున్నర లక్షల మంది ప్రయాణిస్తుంటారు. దీంతో బస్టాండ్ నిత్యం రద్దీగా ఉంటుంది. చోరులు తమ కళ ప్రదర్శించడానికి ఈ రద్దీని అవకాశంగా తీసుకుంటున్నారు. ఏమరుపాటుగా ఉన్న ప్రయాణికుల వస్తువులు అపహరించి పారిపోతున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు కిక్కిరిసి ఉండే ప్లాట్‌ఫామ్‌ల వద్ద దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇంత రద్దీగా ఉండే బస్టాండ్‌లో ప్రయాణికులకు రక్షణ కల్పించడానికి పోలీసులు, ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. బస్టాండ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు. చూసీ చూడనట్లుగా బస్టాండ్లలో చోరీలను నివారించడంలో పోలీసు శాఖ విఫలమవుతోంది. చోరీలు జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వస్తువులు పోగొట్టుకున్నవారు వచ్చి మొరపెట్టుకుంటున్నా సరిగా స్పందించడం లేదని తెలుస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం, పోలీసులు స్పందించి బస్టాండ్లలో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. 2013 జనవరి 22 : రంగారెడ్డి జిల్లా సుచిత్ర జంక్షన్, రాఘవేంద్ర కాలనీకి చెందిన దేవభక్త గిరిజారాణి మాక్లూర్ మండలంలోని దుర్గానగర్‌లో ఉన్న బంధువుల ఇం టికి వెళ్లడానికి నిజామాబాద్ బస్టాండ్‌కు చేరుకున్నారు. దుర్గానగర్‌కు వెళ్లేందుకు నందిపేట బస్సు ఎక్కారు. సీటులో కూర్చున్న తర్వాత మెడను తడుముకోగా గొలుసు కనిపించలేదు. నాలుగు తులాల బంగారు ఆభరణం చోరీకి గురయ్యిందని ఆమె నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2013 మే 13 : బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు చెందిన బీర్కూర్ పద్మావతి నిజామాబాద్ వచ్చారు. పని పూర్తి చేసుకున్న తర్వాత స్వగ్రామానికి వెళ్లడానికి బస్టాండ్‌కు చేరుకుని బోధన్ బస్సు ఎక్కారు. టికెట్టు తీసుకోవడం కోసం హ్యాండ్ బ్యాగును తెరచి చూడగా డబ్బులు లేవు. బస్సు ఎక్కినప్పుడు తన పక్కన కూర్చున్న మహిళ కనిపించలేదు. బ్యాగులోని బంగారు గొలుసు, రెండు ఉంగరాలు, రెండు వేల నగదు అపహరణకు గురయ్యాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2013 జూలై 16 : బాన్సువాడ ప్రాంతానికి చెందిన మైలవరం తరుణ్‌కుమార్ నిజామాబాద్ బస్టాండ్ వచ్చారు. బాన్సువాడ బస్సు వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండడం తో తన చేతిలో ఉన్న బ్యాగును కిటికీలోంచి సీటుపై వేశారు. తర్వాత నెమ్మదిగా బస్సు ఎక్కారు. బ్యాగు తెరచి చూడగా ల్యాప్‌టాప్ కనిపించలేదు. బస్సంతా గాలించినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యా దు చేశారు. 2013 అక్టోబర్ 14 : నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి కాలనీకి చెందిన ఎర్ర లింగం తన పిల్లలను కామారెడ్డి బస్సు ఎక్కించడానికి బైక్‌పై బస్టాండ్‌కు వచ్చారు. బస్టాండ్ ఆవరణలో బైక్‌ను పార్క్ చేశారు. పిల్లలను బస్సు ఎక్కించి వచ్చే సరికి బైక్ మాయమైంది. చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆవిష్కరణం: వస్తువు విలువ పెరిగిన ప్పుడు పుట్టింది!
‘పర్స్’ విలువైన, ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా దాచుకోవడానికి ఉపయోగించుకొంటున్నాం. మరి ఈ ఉపయోగాన్ని బట్టి మానవ నాగరికతలో ‘వస్తువు’కు విలువ పెరిగిన సమయంలో పర్స్ ప్రస్థానం మొదలైందని అనుకోవాలి. ఎందుకంటే... దీని పుట్టుక తేదీ ఇదీ అని ఎవరూ తేల్చలేదు. ద్రవ్యం లేదా కరెన్సీలు వాడకంలోకి వచ్చాక మాత్రం పర్స్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి అనేక రూపాంతరాలున్నాయి. తొలినాళ్లలో నాణెంలు దాచుకోవడానికి బుల్లిబుల్లి బ్యాగ్‌లను ఉపయోగించేవారట. పద చరిత్ర ప్రకారం‘బుర్సా’అనే లాటిన్పదమే పర్స్‌గా పరిణామం చెందింది. ఇప్పుడు పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు అంటూ రకరకాల పర్స్‌లు అందుబాటులోకి వచ్చాయి కానీ.. 17 వ శతాబ్దం వరకూ పర్స్ అంటే ఒకటే రూపమే, అందరూ ఉపయోగించుకొనేదే. 17 వ శతాబ్దంలో పర్స్లకు ఎంబ్రైడరీ వర్క్ చేయడం మొదలుపెట్టారు మహిళలు. అప్పటి నుంచి పర్స్‌లలో మహిళలు, పురుషులూ అంటే లింగభేదం మొదలైంది. మహిళల పర్స్‌లు హ్యాండ్బ్యాగ్లుగా రూపాంతరం చెంది స్టైల్స్‌తో భుజానికి తగిలించుకొనేవిగా మారితే, పురుషుల పర్స్‌లు జేబులో ఇమిడిపోయాయి. వీటికి ఒకే రూపం లేకపోవడం వల్ల పేటెంట్ చక్రంలో ఇవి బంధింపబడలేదు. పర్స్‌ల చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు పూర్వం 3,300 సంవత్సరాల క్రితమే పర్స్‌లను ఉపయోగించినట్టు దాఖలాలు ఉన్నాయి. అప్పటి వాడైన ఓట్జి అనే వ్యక్తి మమ్మీలో తోలుతో కుట్టిన ఒక పర్స్ కనిపించింది. ప్రస్తుతానికి పర్స్ చరిత్రకు సంబంధించి ఉన్న దాఖలాలు అవే.