శభాష్ ఎస్.ఐ సంపత్‌కుమార్
తుళ్ళూరు: తాళాయపాలెం పుష్కరఘాట్ వద్ద సోమవారం పర్సు పోగొట్టుకున్న వ్యక్తిని వెతికి పట్టుకుని వారికి పరుసును అప్పగించిన ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ను సహ ఉద్యోగులు శభాష్ అని మెచ్చుకున్నారు. తాడికొండ మండలం బండారుపల్లికి చెందిన జాలాపురి వరప్రసాద్ శైవక్షేత్రం సమీపంలో మనీ çపర్సు పోగొట్టుకున్నారు. ఈ పరుసు ఎస్‌ఐ సంపత్‌కుమార్‌కు దొరికింది. పరుసు దొరికిందనీ, సంబంధీకులు వచ్చి తీసుకెళ్లాలని అప్పుడే మైక్‌లో ప్రచారం చేశారు. అయినా ఎవరూ రాలేదు. దీంతో çపర్సులో ఉన్న కార్డుల ఆధారంగా విచారించి తాడికొండ ఎస్సై సహకారంతో బాధితుడిని పిలిపించి మంగళవారం వరప్రసాద్ దంపతులకు ఎస్సై çపర్సు అందజేశారు. ఈ పరుసులో రూ. 6000 నగదుతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నట్లు వరప్రసాద్ తెలిపారు. ఎస్సై సంపత్‌కుమార్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.