![BCCI Will Meet IPL Owners On April 16th Regarding 2025 Season Auction And Others - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/1/Untitled-8.jpg.webp?itok=LfAqNr7J)
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చించేందుకు బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీల ఓనర్లతో భేటి కానున్నట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ ఏప్రిల్ 16న అహ్మదాబాద్‌లో జరుగనున్నట్లు సమాచారం. 2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్, పర్స్ వ్యాల్యూ తదితర అంశాలు అజెండాగా ఉండవచ్చని తెలుస్తుంది. గతేడాది మినీ వేలంలో 100 కోట్లకు పెరిగిన ఫ్రాంచైజీ పర్స్ వ్యాల్యూ రానున్న సీజన్‌లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా, 2024 ఐపీఎల్ సీజన్ రసపట్టుగా సాగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన 13 మ్యాచ్‌లు అభిమానులకు కావల్సినంత మజాను అందించాయి. ఈ సీజన్‌లో ఇంకా 61 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సీఎస్‌కే, రాజస్థాన్, గుజరాత్, సన్‌రైజర్స్, లక్నో, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, ముంబై వరుస స్థానాల్లో ఉన్నాయి. వాంఖడే వేదికగా ఇవాళ (ఏప్రిల్ 1) ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment