ఘట్‌కేసర్(రంగారెడ్డి): ఓ మహిళ ఆటోలో ప్రయాణిస్తుండగా పర్సు అందులో పడిపోయింది. ఆమె దిగిపోయిన తర్వాత డ్రైవర్ గమనించి అందులో ఉన్న రూ.27 వేలు సురక్షితంగా తిరిగివ్వడంతో అందరూ అభినందించారు. వివరాలు.. ఘట్‌కేసర్‌కుచెందిన జి.గోపాల్ వృత్తిరీత్యా డ్రైవర్. నిత్యం తన ఆటోను నగరంలోని ఈసీఐఎల్‌కు నడుపుతూ ప్రయాణికులకు చేర వేస్తుంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 11 గంటలకు మండలంలోని మైసమ్మగుట్టకాలనీకి చెందిన మైసమ్మతోపాటు మరికొందరు కలిసి ఘట్‌కేసర్‌లో అతని ఆటోలో ఎక్కారు.
కొద్దిసేపటికి మిగతా ప్రయాణికులతో కలిసి ఆమె ఈసీఐఎల్‌లో దిగింది. అనంతరం సీటు కింద చిన్నపర్సు ఉండటాన్ని డ్రైవర్ గమనించాడు. అందులో ఉన్న రూ.27 వేలను నేరుగా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అందజేశాడు. మధ్యాహ్నం మూడు గంటలకు బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన పర్సు ఆటోలో పోగొట్టుకున్నానని చెప్పింది. దీంతో ఆటో డ్రైవర్ గోపాల్‌తోపాటు సంఘం నాయకుడు సుధాకర్‌ను పిలిపించారు. పోలీసుల సమక్షంలో డబ్బులున్న పర్సును మైసమ్మకు ఇవ్వడంతో అతని నిజాయితీని అందరూ అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వీరభధ్రం, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
నిజాయితీ చాటిన ఆటో డ్రైవర్
Published Tue, Oct 20 2015 11:46 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement